ETV Bharat / state

తండ్రి మరణం, కుమారుడి జననం - గద్వాల జిల్లాలో హృదయాన్ని మెలిపెట్టే విషాదం - FATHER DEATH SON BIRTH IN GADWALA

రోడ్డు ప్రమాదంలో భర్తకు తీవ్రగాయాలతో ఆసుపత్రికి తరలింపు - అదే ఆసుపత్రికి పురిటినొప్పులతో వచ్చిన భార్య - భర్త మృతి, భార్యకు కుమారుడు జననం

HUSBAND DEATH CASE IN GADWALA
FATHER DEATH SON BIRTH IN JOGULAMBA DISTRICT (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 23, 2024, 5:05 PM IST

Updated : Oct 23, 2024, 6:25 PM IST

Father Death, Son birth in Gadwal District: రోడ్డు ప్రమాదంలో తండ్రి మరణం, ఆ తర్వాత గంట సేపటికే కుమారుడు జన్మించిన హృదయ విదారక ఘటన కర్నూలు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం తుమ్మలపల్లికి చెందిన శివ అనే వ్యక్తి మంగళవారం సాయంత్రం రాజోలి నుంచి సొంత గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. మార్గమధ్యలో ఒక్కసారిగా కుక్క అడ్డు రావడంతో అదుపుతప్పి అతని వాహనం ప్రమాదానికి గురైంది.

ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన శివను హుటాహుటిన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు శివ భార్య లక్ష్మీ గర్భవతిగా ఉంది. కొద్ది రోజుల క్రితం లక్ష్మీ ప్రసవం కోసం పుట్టింటికి వెళ్ళింది. ఆమెకు నొప్పులు రావడంతో పుట్టింటివారు నంద్యాల జిల్లా బలపాలపల్లి నుంచి దగ్గరలో ఉన్న బేతంచెర్ల ఆసుపత్రికి తీసుకువెళ్లారు. బీపీ అధికంగా ఉండడంతో ఆమెను కర్నూలు జిల్లాలోని ఆసుపత్రికి తరలించాల్సిందిగా వైద్యులు సూచించారు.

పవన్ కల్యాణ్​, బాలయ్యకు 'దండుమల్కాపురం'తో ఏంటి సంబంధం?

గంటసేపు తర్వాత మరణం: ప్రమాదానికి గురైన శివ ప్రాణపాయ స్థితిలో, ప్రసూతి కోసం వచ్చిన లక్ష్మి ఇద్దరు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. కానీ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శివ కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతూ ప్రాణాలు విడిచాడు. మరోవైపు ప్రసవం కోసం వచ్చిన లక్ష్మికి పండంటి మగ శిశువు జన్మించాడు. శివ మరణించిన ఓ గంట సమయం తర్వాత అతనికి కుమారుడు పుట్టాడు. కానీ తనయుడిని చూసేందుకు ఆయన ప్రాణాలతో లేరు.

ఓవైపు తండ్రి మరణం మరోవైపు కుమారుని జననం, ఈ విషయాన్ని ఆ తల్లి లక్ష్మీకి ఎలా చెప్పాలో తెలియక కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రావొద్దని లక్ష్మీ కుటుంబ సభ్యుల రోదన అక్కడ ఉన్న వారందరీ గుండెలను పిండేసింది. శివ భార్యకు ఈ విషయం చెప్తే తన ఆనందానికి ఇదే చివరి రోజు అవుతుందని తన కుటుంబ సభ్యులు కుమిలి పోయి బాధను వ్యక్తం చేశారు. ఇటు తండ్రి మరణం, కుమారుడి జననంతో స్వగ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.

'ఆ ముగ్గురు ఎవరికి వారు బతుకుతున్నారు - ఈ కుమారుడు మమ్మల్ని హింసించడమే పనిగా పెట్టుకున్నాడు'

'తెలంగాణ ఆర్టీసీ'నా మజాకా - దసరా పండక్కి కళ్లు చెదిరే ఆదాయం - ఎన్ని కోట్లంటే?

Last Updated : Oct 23, 2024, 6:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.