ETV Bharat / state

నిఘానీడలో తాడేపల్లి ప్యాలెస్- భారీ ఎత్తున ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్న జగన్ - yS Jagan appointed private security - YS JAGAN APPOINTED PRIVATE SECURITY

Ex-CM YS Jagan appointed private security : మాజీ సీఎం జగన్ తన నివాసం చుట్టూ భద్రత కోసం, భారీగా ప్రైవేటు సిబ్బందిని నియమించుకోవడం చర్చనీయాంశంగా మారింది. గతంలో జగన్ కోసం ఈ ప్రాంతంలో దాదాపు షిఫ్టుల వారిగా రోజుకు 200 మంది పైగా పోలీసు సిబ్బంది ఉండేవారు. ప్రస్తుతం వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో ప్రభుత్వ భద్రత కుదింపు అనివార్యం అయింది. దీంతో జగనే సొంతంగా ఇళ్ల తోపాటుగా, పార్టీ కార్యాలయం భద్రత కోసం భారీ ఎత్తున ప్రైవేటు సెక్యూరిటీ నియమించుకున్నారు.

private security for ys jagan
Ex-CM YS Jagan appointed private security (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 17, 2024, 10:11 PM IST

Ex-CM YS Jagan appointed private security: ఎన్నికల్లో ఘోర పరాజయం పాలు కావడంతో ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన జగన్, తన ఇంటి వద్ద భద్రత కోసం భారీ ఎత్తున ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవడం చర్చనీయాంశమైంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో అత్యంత విశాల ప్రదేశంలో విలాసవంతంగా జగన్ నివాసం, క్యాంపు కార్యాలయం 2018లోనే నిర్మించుకున్నారు. సీఎంగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో భద్రత కోసం భారీ ఎత్తున పోలీసు సిబ్బందిని జగన్ నియమించుకున్నారు.

ఏడు భవనాలు, మూడు ఇళ్లు, 12 పడక గదులు - 'నిరుపేద జగన్ నివాసానికి అనుకూలమట' - Jagan Rushikonda Palace in AP

గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసం, క్యాంపు కార్యాలయాలకు వచ్చే పలు మార్గాల్లో ప్రత్యేకంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పోలీసు బలగాలను నియమించేవారు. సామాన్యులకే కాదు, ప్రముఖులకు కూడా ఈ మార్గంలో అనుమతి లేకుండా 24 గంటల పాటు భద్రత, నిఘా బృందాలు పనిచేసేవి. నివాసం సహా చుట్టుపక్కల ప్రాంతాల భద్రతకే రోజుకు 200 మంది పైగా పోలీసులు పహారా కాసేవారు.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పోలీసు కానిస్టేబుళ్లు, ఎస్సైలు, సీఐలు, ఆ పై స్థాయి అధికారులను ఇక్కడి బందోబస్తుకు రప్పించే వారు. ఎన్నికల్లో ఓటమితో అధికారం కోల్పోవడం, జగన్‌కు కనీసం ప్రతిపక్షనేత హోదా సైతం రాకపోవడంతో ఇంటి చుట్టూ చెక్ పోస్టులను ఎత్తివేయడం సహా పోలీసు భద్రత తగ్గిపోయింది. స్థానికుల విజ్ఞప్తులతో జగన్ ఇంటికి రాకపోకల కోసం ప్రత్యేకంగా నిర్మించుకున్న నాలుగు లైన్ల రహదారి పై ఆంక్షలను ప్రభుత్వం తొలగించింది. సామాన్య ప్రజల వాహనాల రాకపోకలకు అనుమతించారు.

మరోవైపు ఎన్నికల ఫలితాలతో కంగు తిన్న వైసీపీ అధినేత జగన్, తాడేపల్లి పట్టణంలో హైవే పక్కనున్న పార్టీ కేంద్ర కార్యాలయాన్ని మూసివేయాలని ఆదేశించారు. ఇకపై తన క్యాంపు కార్యాలయాన్నే వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంగా మార్చేసుకున్నారు. దీంతో ఇకపై పార్టీ కార్యక్రమాలకు సైతం బయటకు రాకుండా తన నివాసంలోనే పార్టీ కార్యలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ పరిస్ధితుల్లో తన ఇళ్లు సహా పార్టీ కార్యాలయం భద్రత కోసం భారీ ఎత్తున ప్రైవేటు సెక్యూరిటీని జగన్ నియమించుకున్నారు.

ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా నమ్మకమైన వ్యక్తులను గుర్తించి వీరందనినీ నియమించుకున్నారని పార్టీ వర్గాల సమాచారం. 24 గంటలు, నిరంతరం కాాపలా కాసేలా అన్ని షిఫ్టులకు కలసి 200 మందిపై ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని జగన్ నియమించినట్లు తెలిసింది. తాడేపల్లి ప్యాలెస్ ముందున్న ప్రధాన రహదారి ప్రజలకు అందుబాటులోకి రావడం కూడా జగన్ కు తన ప్రైవేటు సిబ్బందిని నియమించుకోవడానికి ఒక కారణంగా పార్టీ వర్గాలంటున్నాయి.

నాలుగు లేన్ల రహదారి మంగళగిరి - తాడేపల్లి ప్రజలకు అందుబాటులోకి రావడంతో స్థానిక ప్రజలకు ప్రయాణ దూరం తగ్గింది. ఇది స్థానికులకు పెద్ద ఉపశమనాన్ని ఇచ్చింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇంటి పక్కన పేదలను బలవంతంగా ఖాళీ చేయించటంతో పాటు రహదారిని పూర్తిగా పోలీసులు దిగ్భందించారు. దీంతో స్థానికులు చుట్టు తిరిగి ప్రధాన రహాదారిని చేరుకునే వారు.

సమీప పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు, పొలాలకు వెళ్లే రైతులు, రైతు కూలీలు ఇలా వివిధ వర్గాల ప్రజలకు రహదారి అందుబాటులోకి రావడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ రహదరిలోకి వెళ్లాలంటే ఉన్నతాధికారులు సైతం తమ ఫోటోలు, గుర్తింపు కార్డులు ముందుగా ఇస్తేనే అటువైపు అనుమతించే పరిస్థితి ఉండేది.

లోటస్​పాండ్​లో జగన్‌ ఇంటి ముందు అక్రమ నిర్మాణాలు - కూల్చివేసిన జీహెచ్​ఎంసీ అధికారులు - Jagan illegal sheds demolished

సొమ్ము ప్రజలది సోకు జగన్​ది - తాడేపల్లి ప్యాలెస్ రోడ్డంతా ఆక్రమణే - Jagan occupy public propert

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.