ETV Bharat / state

జుట్టు ఊడిపోతుందని చింతిస్తున్నారా?- ఐతే ఈ చిట్కాలు మీ కోసమే

జుట్టు ఊడిపోవడానికి కారణాలేంటి, ఒత్తుగా హెయిర్​ పెరిగేందుకు ఏం చేయాలి?

Hair Care Tips For Women
Hair Care Tips For Women (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 15, 2024, 10:57 PM IST

Hair Care Tips For Women : రోజురోజుకు పెరిగిపోతున్న పర్యావరణ కాలుష్యం, మారుతున్న జీవన శైలి ప్రభావం కూడా కురులపై ఉంటోంది. అందుకే జుట్టు ఊడిపోవడం, పలుచనగా మారడం లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. వీటికి తోడు స్త్టెలింగ్ కోసం ఉపయోగించే ఉత్పత్తులు కూడా హెయిర్​ను నిర్జీవంగా మార్చేస్తున్నాయి. మరి, వీటికి పరిష్కారమార్గం ఏమిటి? ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? చక్కటి జుట్టును సొంతం చేసుకోవడం ఎలా?

రసాయన పదార్థాలకు దూరంగా ఉండండి : జుట్టు పటిష్ఠంగా పెరిగేందుకు అవసరమయ్యే పోషకాలను ఎప్పటికప్పుడు ఆహారం ద్వారానే కాకుండా బయట నుంచి కూడా అందిస్తూ ఉండాలి. అలాగే హెయిర్​ శుభ్రంగా ఉండేవిధంగా చూసుకోవడం కూడా తప్పనిసరి. అంటే జుట్టుపై దుమ్ము, ధూళి, చుండ్రు ఇలాంటివేవీ దరిచేరకుండా జాగ్రత్తపడాలి. తల స్నానం చేసేటప్పుడు కూడా ఎంతమేరకు షాంపూ అవసరమో అంతమాత్రమే వినియోగించాలి. వీటిలో సల్ఫేట్ లేకుండా చూసుకోవాలి. అవసరానికి మించి షాంపూ ఉపయోగిస్తే ఆ ప్రభావం జుట్టు మీద తప్పకుండా కనిపిస్తుంది. అందుకే రసాయనాలు ఎక్కువగా ఉండే ప్రొడక్టులను ఎంత తక్కువ వాడితే అంత శ్రేయస్కరం.

జుట్టు త్వరగా ఆరాలని డ్రయర్లు వాడుతున్నారా? : ఆఫీసుకు వెళ్లేందుకు టైం అవుతోందనో, కాలేజీ బస్సు మిస్సవుతుందనో జుట్టు త్వరత్వరగా ఆరిపోవాలని ఈ మధ్య కాలంలో హెయిర్​ డ్రయర్లు వాడుతూ ఉంటాం. అయితే వీటివల్ల అప్పటికప్పుడు జుట్టు ఆరిపోయి సమస్య పరిష్కారం అయినప్పటికీ అవి కొత్త సమస్యలు తెచ్చిపెడతాయి. అలాంటి ఉత్పత్తుల ద్వారా విడుదలయ్యే వేడి హెయిర్​ను మరింత బలహీనపరుస్తుంది. ఫలితంగా తల దువ్వేటప్పుడు వెంట్రుకలు సగంలో తెగిపోవడం లేదా మొత్తానికి ఊడిపోతుండటం లాంటివి జరుగుతుంది. కాబట్టి డ్రయర్లు, కర్లర్స్, స్ట్రెయిటనర్స్ మొదలైన ఉత్పత్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదంటున్నారు నిపుణులు.

పోనీటెయిల్స్​ వేసుకోకపోవడమే ఉత్తమం : కళాశాలకు వెళ్లే అమ్మాయిలు లేదా ఆఫీసుకు వెళ్లే మహిళలు స్త్టెల్‌గా కనిపించడానికో లేక తక్కువ సమయం ఉందనో ఎక్కువగా పోనీటెయిల్స్ వేసుకుంటూ ఉంటారు. కానీ జుట్టంతా అలా బిగుతుగా లాగి బ్యాండ్ పెట్టడం వల్ల కుదుళ్లు బలహీనపడే అవకాశం ఉంది. హెయిర్​పై ఒత్తిడి పెరిగి తెగిపోతుంది. కాబట్టి జుట్టును సాధ్యమైనంత వరకు వదులుగానే ఉంచడం మంచిది. అలా వదులుగా ఉండే హెయిర్‌స్త్టెల్స్ ప్రయత్నించడమే బెటర్​.

జుట్టు చివర్లు ట్రిమ్ చేయాలి : జుట్టు చివర్లను ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసుకుంటుండాలి. ఇలా చేయడం వల్ల కురుల చివర్లు ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టుకు అవసరమయ్యే పోషణ సులభంగా అంది, హెయిర్ ఎదుగుదల బాగుంటుంది.

హెల్మెట్​ పెట్టుకుంటే జుట్టు రాలుతోందని దిగులు పడుతున్నారా? - అయితే దీన్ని ట్రై చేయండి - Shoulder Helmet Designed

తలస్నానం చేసినా జుట్టు జిడ్డుగా ఉంటుందా? - ఈ టిప్స్ పాటిస్తే అంతా సెట్​! - Greasy Hair Treatment Home

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.