Emerging Courses For engineering Students : రోజులు మారుతున్నాయి కానీ చాలామంది విద్యార్థులు మాత్రం అకడమిక్ పుస్తకాలు బాగా చదివి పరీక్షల్లో 80శాతానికి పైగా మార్కులు సాధిస్తే చాలు ఉద్యోగాలు వస్తాయని భ్రమలో ఉంటున్నారు. కానీ అది అవాస్తవం. మార్కులతో పాటు స్కిల్స్ ముఖ్యం. సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న దాన్ని అందిపుచ్చుకున్న వారికే అవకాశాలు మెండు అనే వాస్తవికతను విద్యార్థులు అర్థం చేసుకోవాలి. నిరుడు చాలా కంపెనీలు ఇంజినీరింగ్ విద్యార్థులను క్యాంపస్ ప్లేస్మెంట్లో ఎంపిక చేసుకోవడం లేదు. ఆయా కళాశాలల్లో నైపుణ్యం ఉన్న విద్యార్థులను మంచి ప్యాకేజీలతో ఎంపిక చేసుకుంటున్నాయి. దీన్ని ద్వారా విద్యార్థులు అర్థం చేసుకోవాల్సిందేంటంటే అకడమిక్‌తో పాటు అదనపు స్కిల్ నేర్చుకోవాలి, కానీ వారికి సలహా ఇచ్చే వారు లేక వెనుకబడిపోతున్నారు.
రెండో సంవత్సరం నుంచే శిక్షణ : స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటున్నవారు కానీ అది బీటెక్ చివరి సెమిస్టర్ లేదా సంవత్సరంలో చేద్దాం అనుకుంటే తప్పే అంటున్నారు. బీటెక్ రెండో సంవత్సరం నుంచి ఇతర కోర్సులు లేదా విదేశీ భాషలు నేర్చుకోవడం ప్రారంభించాలని సూచిస్తున్నారు. ఇలా రెండో సంవత్సరంలో ప్రారంభించడం వల్ల చివరి ఏడాదిలో జరగబోయే క్యాంపస్ ప్లేస్మెంట్లకు సన్నద్ధంగా ఉంటే ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశముంటుందన్నారు.
కాలం చెల్లిన కోర్సులు వద్దు : సీ, సీప్లస్ ప్లస్, జావా, పైథాన్ వంటి కోర్సులకు కాలం చెల్లిందని వీటికి ఉద్యోగ అవకాశాలు తక్కువని, ప్రస్తుతం సాంకేతికలను అందిపుచ్చుకునే కొత్త కోర్సులను నేర్చుకోవాలని చెబుతున్నారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్ కొత్తగా వచ్చిన దాంట్లో సర్వీస్ నౌ, పెగా, ఏడబ్ల్యూఎస్, క్లౌడ్ వంటి సర్టిఫికెట్ కోర్సులు నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయని అంటున్నారు. అప్పుడే కంపెనీల క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో ఉద్యోగాలు సాధించగలుగుతారని నిపుణులు పేర్కొంటున్నారు.
బీటెక్ చదువుతున్న సమయంలో మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సుకు శిక్షణ తీసుకోవాలి. ప్రస్తతం సర్వీస్ నౌ కోర్సు తీసుకుంటే మేలు అంటున్నారు. స్మార్ట్ బ్రిడ్జి కంపెనీ వారు ఈ కోర్సులు ప్రతిరోజూ సాయంత్రం ఆన్లైన్లో శిక్షణ ఇస్తారు. ట్రైనింగ్ పుర్తయ్యాకా పరీక్ష ఉంటుంది. తర్వాత ఇంటర్య్వూ చేస్తారు. ఈ రెండింటిలో నైపుణ్యం సాధించిన విద్యార్థికి సర్వీస్ ఔ కంపెనీ సర్టిఫికెట్ ఇస్తుంది. ఈ ధ్రువపత్రం దగ్గరుంటే ప్రాంగణ నియామకాల్లో పెద్ద కంపెనీలు సైతం ఉద్యోగ అవకాశమే కాకుండా మంచి ప్యాకేజీలు ఇస్తాయి.
ఈ ఐదు AI కోర్సులు చేస్తే చాలు - లక్షల్లో సాలరీ గ్యారెంటీ! - High Paying AI Jobs
సర్టిఫికెట్ ఉంటేనే ప్రాధాన్యత : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీలను అన్ని రంగాల్లో విపరీతంగా ఉపయోగిస్తున్నారు. వీటికి ఈ టూల్స్ వాడతారు. టూల్స్ తెలియాలంటే ఎమర్జింగ్ టెక్నాలజీ కోర్సులు తప్పకుండా నేర్చుకోవాలి. అలాగే ఆయా రంగాల్లో మార్పులు గమనిస్తూ వాటిని నేర్చుకుంటూ ఉండాలి. ఆంగ్ల భాషతో పాటు ఒక విదేశీ భాష నేర్చుకోవడం వల్ల విద్యార్థుల రెజ్యూమ్‌కి ప్రాధాన్యత పెరుగుతోంది.
"ఇంజినీరింగ్ విద్యార్థులకు అకడమిక్ మార్కులు ప్రామాణికం కాదు. ఇవి ఉద్యోగాలు సాధించిపెట్టవు. పరిశ్రమలో వస్తున్న మార్పులను గమనిస్తూ అందుకు తగ్గిన సర్టిఫికెట్ కోర్సులు నేర్చుకోవాలి. కనీసం మూడు అయినా అలాంటి కోర్సులు చేతిలో ఉండాలి. కోడింగ్‌లో మంచి నైపుణ్యం పెంపొందించుకోవాలి. జేఎన్‌టీయూలో విద్యార్థులకు నైపుణ్యంలో ఆరితేరేలా శిక్షణ ఇస్తున్నాం." - శోర్‌బాబు, వైస్ ప్రిన్సిపల్, ప్లేస్‌మెంట్ సెల్ ఇన్‌ఛార్జి, జేఎన్‌టీయూ