ETV Bharat / state

యూట్యూబర్​ ప్రణీత్​ హనుమంతుపై మరో కేసు నమోదు - DRUGS CASE ON YOUTUBER PHANUMANTHU - DRUGS CASE ON YOUTUBER PHANUMANTHU

Drugs Case Filed On Praneeth Hanumanthu : యూట్యూబర్​ ప్రణీత్​ హనుమంతుపై మరో కేసు నమోదైంది. అతడు​ మత్తు పదార్థాలు సేవించినట్లు వెల్లడి కావడంతో ఆయనపై మాదకద్రవ్యాల కేసు నమోదు చేశారు.

Another Case Filed On Praneeth Hanumanthu
Another Case Filed On Praneeth Hanumanthu (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 19, 2024, 10:46 AM IST

Updated : Jul 19, 2024, 1:04 PM IST

Another Case filed Against Youtuber Praneeth Hanumanthu : సామాజిక మాధ్యమంలో తండ్రి- కుమార్తె వీడియోపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్​ ప్రణీత్​ హనుమంతుపై మరోకేసు నమోదైంది. అతడు మత్తుపదార్థాలు సేవించినట్లు వైద్య పరీక్షల్లో వెల్లడి కావడంతో మరో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా ప్రణీత్​ను ఇప్పటికే సైబర్​ సెక్యూరిటీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చంచల్​గూడ జైల్లో ఉన్న అతడిని 3 రోజులు కస్టడీకి కోరుతూ సైబర్​ సెక్యూరిటీ పోలీసులు పిటిషన్​ దాఖలు చేశారు. నిందితుడి తరఫు న్యాయవాదికి పోక్సో కోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రణీత్​ కస్టడీపై కోర్టు నిర్ణయం తీసుకోవాలసి ఉంది.

ప్రణీత్​పై నమోదు చేసిన సెక్షన్లు ఇవే : ప్రణీత్​పై ఐటీ సెక్షన్​తో పాటు 67 బీ, పోక్సో చట్టాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వీటితో పాటు 79, 294 బీఎన్​ఎస్​, ఎన్డీపీఎస్​ చట్టాల కింద పలు సెక్షన్లను జత చేశారు.

పూర్వపరాలు : కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియాలో తండ్రి- కుమార్తెలకు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రణీత్​ హనుమంతు వీడియో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ కేసులో కీలక నిందితునిగా ఉన్న అతడిని సైబర్​ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు బెంగళూరులో అరెస్టు చేసి హైదరాబాద్​కు తరలించారు.

ఇదీ జరిగింది : ప్రణీత్​ అనే యువకుడు యూట్యూబర్​గా వీడియోలు చేస్తుంటాడు. ఈ క్రమంలోనే తండ్రీ, కుమార్తె ఉన్న ఓ వీడియోపై అశ్లీలం ధ్వనించేలా అసభ్యకరంగా మిత్రులతో చిట్​చాట్​ చేసిన విషయం విధితమే. అతడితో పాటు మరో ముగ్గురు కలిసి వేర్వేరు ప్రదేశాల్లో కూర్చుని ఒక రీల్​ గురించి లైవ్​లో మాట్లాడారు. ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

వీడియోను చూసిన ప్రముఖ హీరో సాయి దుర్గ తేజ్​ యూట్యుూబర్​లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రెండు రాష్ట్రాల సీఎంలను 'ఎక్స్'​ వేదికగా కోరారు. ఈ వ్యవహారంపై స్పందించిన సీఎం రేవంత్​ రెడ్డి వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

యూట్యూబర్​ ప్రణీత్​కు 14 రోజుల జ్యుడీషియల్​ కస్టడీ - YouTuber Praneet Arrest

తండ్రి-కుమార్తె వీడియోపై అసభ్యంగా మాట్లాడిన యూట్యూబర్​ 'ప్రణీత్​ హనుమంతు అరెస్ట్' - YouTuber Praneeth Hanumanthu arrest

Last Updated : Jul 19, 2024, 1:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.