ETV Bharat / state

విజయవాడలో తీవ్ర విషాదం - ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి - Doctor Family Suicide in Vijayawada - DOCTOR FAMILY SUICIDE IN VIJAYAWADA

Doctor Family Suicide in Vijayawada: ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడలో ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ఇంటి బయట వైద్యుడు డి.శ్రీనివాస్‌ ఉరేసుకోగా, ఇంటి లోపల అతని భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి మృతి చెంది ఉన్నారు. ఆత్మహత్యలకు గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Doctor Family Suicide
Doctor Family Suicide in Vijayawada
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 30, 2024, 1:50 PM IST

Doctor Family Suicide in Vijayawada : ఏపీలోని విజయవాడలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందడంతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. విజయవాడకు చెందిన వైద్యుడు డి.శ్రీనివాస్‌ ఇంటి బయట ఉరేసుకున్నారు. ఆయన భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి ఇంటి లోపల మృతి చెంది ఉన్నారు. శ్రీజ హాస్పిటల్ యజమాని శ్రీనివాస్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారని సమాచారం. మిగతా కుటుంబసభ్యుల గొంతు కోయడం వల్ల మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు.

విజయవాడ సీపీ రామకృష్ణ ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. కుటుంబ సభ్యులను‌ చంపి, వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నారా? లేక అందరూ ఆత్మహత్య చేసుకున్నారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్​తో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులు డాక్టర్ శ్రీనివాస్ (40), ఉషా రాణి (36), శైలజా (9), శ్రీహాన్ (5), శ్రీనివాస్ తల్లి రమణమ్మ (65)లుగా స్థానికులు తెలిపారు.

కాగా తాజాగా రాష్ట్రంలో వరుస ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. ఇటీవలే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చెట్టుకు ఉరి వేసుకుని మరణించారు. కుటుంబ సమస్యల వల్లే తాము ఈ నిర్ణయానికి వచ్చినట్లు లేఖలో పేర్కొన్నారు. వరుస ఆత్మహత్యలపై పోలీసులు మాట్లాడుతూ ఏవైనా సమస్యలు ఉంటే అవి పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలే తప్ప, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు.

పెళ్లికి నిరాకరించిన పెద్దలు - ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట - Lovers Committed Suicide

వార్డెన్ ఆత్మహత్య : కృష్ణా జిల్లా అవనిగడ్డ సబ్ జైల్ నందు జైల్‌వార్డెన్​గా పనిచేస్తున్న దాసరి నాగ శివకుమార్ (37)ఆత్మహత్య చేసుకున్నారు. శివకుమార్ అవనిగడ్డలో తాను నివాసం ఉంటున్న ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వార్డెన్​ మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

డివైడర్‌ను ఢీకొన్న బైకు - ఇద్దరు మృతి: ఏలూరు జిల్లా పెదపాడు మండలం కలపర్రు జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. డివైడర్‌ను బైకు ఢీకొట్టడంతో, ఘటనాస్థలిలోనే తండ్రి, కుమార్తె మృతి చెందారు. కుమారుడు, తల్లి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విజయవాడ దుర్గమ్మను దర్శించుకుని ఏలూరు వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.

ఇంటర్​ పరీక్షల్లో ఫెయిల్​ అయ్యారని ఎనిమిది మంది విద్యార్థుల ఆత్మహత్య - Inter Students Suicide in Telangana

సంగారెడ్డిలో దారుణం - బాలుడిని చంపి, సెల్​ టవర్​ పైకెక్కి ఉరేసుకున్న రౌడీ షీటర్‌ - Rowdy Sheeter Killed 13 years Boy

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.