ETV Bharat / state

హాఁ - బుక్ పట్టగానే నిద్ర ముంచుకొస్తుందా? - ఈ టిప్స్ పాటిస్తే యాక్టివ్​గా ఉంటారు! - BOOK READING TIPS IN TELUGU

బుక్ ముట్టగానే నిద్ర వస్తుందా? - ఎక్కువ సేపు చదవలేకపోతున్నారా? - ఈ ప్రాబ్లమ్‌ నుంచి బటయపడేందుకు నిపుణులు ఏం టిప్స్ చెబుతున్నారు?

Book Reading Tips And Tricks in Telugu
Book Reading Tips And Tricks in Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 21, 2024, 10:19 AM IST

Book Reading Tips And Tricks in Telugu : అదేం విచిత్రమో గానీ ఇలా పుస్తకం ముందు కూర్చొని కొన్ని పేజీలు తిప్పుతారో లేదో అలా నిద్ర ముంచుకొస్తుంది. పరీక్షల సమయంలో ఇలాగైతే ఎంత కష్టం కదా! ఇలా ఉంటే తక్కువ సమయంలోనే ఎక్కువ సబ్జెక్టులు చదవాలంటే అయ్యే పనికాదు. మరి ఈ ఇబ్బందిని అధిగమించడం ఎలా? నిపుణులు సూచించే టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం!

చదివేటప్పుడు సిట్టింగ్ పోజిషన్‌ చాలా ముఖ్యం. చాలామంది టేబుల్‌పై పుస్తకాలు పెట్టుకుని కుర్చీలో కూర్చుని చదువుతుంటారు. నిజానికి ఇలా కూర్చోవటమే మంచిది. కానీ కొందరు మాత్రం మంచం మీద కూర్చుని లేదా పడుకొని చదువుతుంటారు. ఇలా చదవడం వల్ల శరీరం విశ్రాంతిని కోరుకుని త్వరగా నిద్ర ముంచుకొచ్చేస్తుంది.

  • కూర్చుని చదువుతునప్పుడు తరచూ నీళ్లు తాగుతుండాలి. లేకపోతే శరీరం డీహైడ్రేట్ అయ్యి అలసట, తలనొప్పికి గురై చురుకుదనాన్ని కోల్పోతారు.
  • రాత్రి సమయంలో బెడ్‌ లైట్ లేక స్టడీ లైట్‌ వెసుకుని చీకటి గదిలో చదువుతుంటారు. దీనివల్ల మగతగా అనిపించి త్వరగా నిద్ర వచ్చే అవకాశాలు ఎక్కువ.
  • కడుపునిండా తిని చదవడానికి కూర్చోవడం వల్ల మగతగా అనిపించి కళ్లు మూతలు పడుతుంటాయి. చదవడానికి ముందు అవసరమైన దానికంటే తక్కువగా తింటే మంచిది.
  • పగటిపూట కళ్లు మూతలు పడుతున్నాయంటే అర్థం రాత్రి సరిగ్గా నిద్రపోలేదనే కదా. రాత్రుళ్లు తగినంత నిద్ర పోయేలా చూసుకోవాలి.
  • త్వరగా నిద్రపోయి వేకువజామునే లేస్తే మెదడు చురుగ్గా పని చేస్తుంది.

నిద్ర గురించి ఈ అపోహలు మీలోనూ ఉన్నాయా? - నిపుణులు చెబుతున్నదేమిటంటే..?

  • పరీక్షలు జరుగుతున్నప్పుడు వేకువజామున లేచి చదవాల్సి వస్తుంది. అలాంటప్పుడు మధ్యాహ్నం పూట నిద్ర వస్తుంటుంది. అప్పుడు కాసేపు కునుకు తీస్తే మంచిది. తర్వాత రెట్టింపు ఉత్సాహంతో చదవుకోవచ్చు.
  • చదివేటప్పుడు నిద్ర రాకుండా ఉండేందుకు ప్రొటీన్ బార్లు, చాక్లెట్లు, నట్స్ వంటివి దగ్గర పెట్టుకోవాలి. వీటివల్ల శరీరం తొందరగా నిద్రావస్థలోకి వెళ్లదు.
  • మగతగా అనిపించినప్పుడు టీ, కాఫీ వంటివి తీసుకోవడం ద్వారా చురుకుగా అనిపిస్తుంది.
  • రాత్రుళ్లు ఆసక్తిగా, కాస్త తేలిగ్గా ఉండే సబ్జెక్టులను చదవడం మంచిది. ఆస్తకిలేని వాటిని చదివితే విసుగు, ఆపై నిద్రా రెండూ ముంచుకొస్తాయి.
  • సాధారణంగా వేకువజామున మెదడు చురుగ్గా ఉంటుంది. అప్పుడే నిద్ర నుంచి లేవడం వల్ల శారీరకంగానూ ఉత్సాహంగా అనిపిస్తుంది. అందువల్ల ఈ సమయంలో కష్టంగా అనిపించే సబ్జెక్టులను చదివితే ఈజీగా అర్థమవుతుంది.
  • ఒకే పొజిషన్‌లో ఎక్కువసేపు కూర్చొని చదవడం వల్ల బద్ధకంగా, మత్తుగా అనిపిస్తుంది. కుర్చీలో నుంచి లేచి కాస్త అటూ ఇటూ తిరగడం, కాళ్లూ చేతులు కదిలించడం లాంటివి చేస్తుండాలి.
  • నిద్ర వస్తున్నప్పుడు కొత్తవి చదవడం కంటే అప్పటికే చదివినదాన్ని ఒకసారి చూడకుండా రాయడానికి ప్రయత్నించాలి. అలా రాస్తున్నప్పుడు చదివిన దాన్ని గుర్తు చేసుకునే క్రమంలో బద్ధకం వదిలి మెదడు చురుగ్గా పని చేస్తుంది. పైకి చదవడం మంచి టిప్. మీ గొంతు మీకు స్పష్టంగా వినిపిస్తుంది. అలాగే నిద్ర మత్తు వదిలి చురుగ్గా ఉంటారు.

'తల్లులు సరిగ్గా నిద్రపోతేనే పిల్లలు హుషారుగా పుడతారు'- మరి ఎంత సేపు నిద్రపోవాలి?

నెల రోజులు సరిగ్గా నిద్రలేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయంటే! - Health Risks of Poor Sleep

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.