ETV Bharat / state

ఆకాశాన్ని తాకేలా 'దేవాదుల ఫౌంటేన్' - విజువల్స్ చూస్తే నోరెళ్లబెట్టడం ఖాయం!

దేవాదుల పైప్​లైన్​ గేట్​ వాల్​ లీక్​ - చుట్టూ ఉన్న పంట పొలాల్లోకి భారీగా చేరిన నీరు - ఆందోళన చెందుతున్న రైతులు

Devadula Project Pipeline Leak
Devadula Project Pipeline Leak (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 3, 2024, 6:00 PM IST

Devadula Project Pipeline Leak : హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడపాక శివారులో దేవాదుల పైప్​లైన్ గేట్ వాల్ లీకై భారీగా నీరు ఎగిసిపడుతూ వృథాగా పోతుంది. చుట్టూ పంట పొలాల్లోకి భారీగా నీరు చేరుతుంది. వరి పంట పొలాలు కోత దశలోకి రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పొలానికి సమీపంలోనే విద్యుత్ వైర్లు ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి, మరమ్మతు పనులు చేయాలని కోరుకుంటున్నారు.

"దేవాదుల పైప్​లైన్​ లీక్​ అవ్వడం వల్ల సుమారు 30 ఎకరాల్లో పంటంతా నాశనం అయింది. రేపోమాపో వరి కోత చేద్దామనుకుంటే ఇంతలోనే పంటంతా ఆగమాగం అయింది. నీరు పెద్దఎత్తున ఎగిసి పడుతోంది. పొలమంతా జలమయమైంది. పొలానికి సమీపంలోనే విద్యుత్ లైన్​ కూడా ఉంది. ఏదైనా ప్రమాదం జరిగి ప్రజలు చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం" - రైతు

పొలంలోకి చేరిన వరదనీరు : పైప్ ​లైన్​ లీకై తమ పొలంలోని కోత దశకు వచ్చిన పంటంతా నాశనం అయిందని మరో రైతు వాపోయారు. వరద నీరంతా పొలం నుంచే పోతుందని, చేతికి అందివచ్చిన పంటంతా దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా పైప్​లైన్​ లీకై పెద్ద ఎత్తున ఎగిసి పడుతుండడంతో అటువైపుగా వెళ్తున్న వారు ఆశ్చర్యంగా తిలకిస్తున్నారు.

కేతనపల్లిలో పైప్​లైన్​ లీక్​ : కొద్ది రోజుల క్రితం ఇలాంటి ఘటనే మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో కూడా జరిగింది. మున్సిపాలిటి పరిధిలోని ఓ ఫ్లై ఓవర్ బ్రిడ్జి దగ్గర మిషన్​ భగీరథ పైప్​లైన్​ లీక్​ కావడంతో నీరు వృథాగా పోయింది. పైప్​లైన్​ లీకేజీ కారణంగా నీరు ఒక్కసారిగా ఉవ్వెత్తున పైకి లేచింది. దీంతో అటువైపుగా వెళ్తున్న ప్రయాణికులు, వాహనదారులు ఆ నీటిలో తడుస్తూ వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది. రహదారిపై వరద నీరు చేసి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమీపంలోనే కరెంటు వైర్లు ఉండటంతో ప్రజలు ఒకింత ఆందోళనకు గురయ్యారు.

మిషన్ భగీరథ పైప్​లైన్ లీక్ - జనావాసాల వద్దకు భారీగా చేరిన నీరు - Mission Bhagiratha Pipeline Leak

మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ - ఫౌంటేన్​లా ఉవ్వెత్తున ఎగిసిపడిన నీరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.