ETV Bharat / state

వాహనదారులకు అలర్ట్ - దశాబ్ది ఉత్సవాల వేళ నగరంలో ట్రాఫిక్ మళ్లింపు మార్గాలు ఇవే - traffic diversion routes in Hyd - TRAFFIC DIVERSION ROUTES IN HYD

Traffic Diversion Routes in Hyd : నగరంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సర్వం సిద్దమైంది. ఈ సందర్బంగా నగరంలో పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ అంక్షలను విధించారు. ట్యాంక్​బండ్, సికింద్రాబాద్ పరేడ్​గ్రౌండ్ ప్రాంతాల్లో ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ అంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని వారు సూచించారు.

State Inauguration Day Celebrations 2024
Traffic Diversion Routes in Hyd (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 1, 2024, 9:07 PM IST

State Inauguration Day Celebrations 2024 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్​లో ట్యాంక్​బండ్​పై వివిధ వివిధ సంస్కృతి కార్యక్రమాలు జరుపనున్నారు. దీంతో ఇవాళ్టి నుంచి ట్యాంక్‌బండ్, పరేడ్ గ్రౌండ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి.

తెలంగాణలో కాంగ్రెస్-బీజేపీ మధ్య హోరాహోరీ - కమలానికే ఎక్కువ చాన్స్ - Telangana LokSabha Exit Poll Result

ఇవాళ్టి నుంచి ఆదివారం రాత్రి పన్నెండు గంటల వరకు ట్యాంక్ బండ్​పై వాహనాల రాకపోకలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో వాహనాలకు అనుమతి లేదని పేర్కొన్నారు. దీంతో వాహనదారులు ఈ రూట్లో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని పోలీసుల తెలియజేశారు.

ట్యాంక్​బండ్, కట్టమైసమ్మ, ఓల్డ్ అంబేడ్కర్ విగ్రహం, తెలుగుతల్లి జంక్షన్, లిబర్టీ, ఇక్బాల్ మినార్, ఇందిరాగాంధీ రోటరీ, వీవీ విగ్రహం, కర్బలా, ఓల్డ్ సైఫాబాద్, రవీంద్రభారతి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయిని పోలీసులు వెల్లడించారు. అప్పర్ ట్యాంక్​బండ్ మీదుగా ఎలాంటి వాహనాలకు అనుమతి లేదన్నారు. ఆర్టీసీ బస్సులు లోయర్ ట్యాంక్ బండ్ నుంచే వెళ్లాలని సూచించారు.

సికింద్రాబాద్, రవీంద్ర భారతి, ఎన్టీఆర్ మార్గ్, జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు నుంచి అప్పర్ ట్యాంక్​బండ్ వైపు వచ్చే వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అసెంబ్లీ ఎదురుగా గన్‌పార్క్‌, ట్యాంక్‌బండ్‌, సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ తదితర ప్రాంతాల్లోని అమరవీరుల స్థూపం వద్ద వేడుకలు జరుగునున్నాయి. ఈ మార్గాల్లో సైతం ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు ట్రాఫిక్ పోలిసులు వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు గన్ పార్క్ వైపు రాకపోకలు అనుమతించబోమని పోలీసులు తెలిపారు.

బేగంపేట వైపు నుంచి సికింద్రాబాద్​కు వచ్చే వాహనాలను సీటీఓ, తివోలీ, వైఎంసీఏ, సంగీత్‌ క్రాస్‌రోడ్స్‌ వైపునకు మళ్లించనున్నారు. బేగంపేట నుంచి కార్ఖానా వైపునకు వెళ్లే వాహనాలను పాట్నీ, వైఎంసీఏ వైపునకు మళ్లిస్తారు. ఆర్‌పీ రోడ్‌ వైపు నుంచి తిరుమలగిరి వైపు వెళ్లే వాహనాలను ప్యాట్నీ, క్లాక్‌ టవర్‌, వైఎంసీఏ వైపు దారికి అనుమతి ఇస్తారు. సంగీత్‌ నుంచి బేగంపేట వైపునకు వచ్చేవాహనాలను క్లాక్‌ టవర్‌, ప్యారడైజ్‌ మీదుగా రసూల్‌పురా దారికి పంపుతారు.

ఆలుగడ్డబావి వైపు నుంచి తాడ్‌బండ్‌, బోయినపల్లి వైపు వెళ్లే వాహనాలను సీటీఓ, రాణిగంజ్‌ వైపునకు దారి మళ్లిస్తారు. బోయినపల్లి వైపు నుంచి తివోలీ వైపు వచ్చే వాహనాలను సీటీఓ వైపునకు పంపుతారు. కార్ఖానా, జేబీఎస్‌, తిరుమలగిరి వైపు నుంచి ప్యాట్నీ వైపునకు వెళ్లే వాహనాలను స్వీకార్‌ ఉపకార్‌, వైఎంసీఏ, క్లాక్‌టవర్‌ వైపునకు పంపుతారు. తివోలి క్రాస్‌రోడ్స్‌, ప్లాజా క్రాస్‌రోడ్స్‌ నుంచి పరేడ్‌ గ్రౌండ్‌కు వెళ్లే దారిని మూసివేస్తారు. ఆయా రూట్లలో ప్రయాణించే వాహనదారులు ఈ ఆంక్షలను దృష్టిలో ఉంచుకొని, ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణం చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

ఆహ్వానించినట్లే ఆహ్వానించి అవమానించదలిచారు - కేసీఆర్ బహిరంగ లేఖ - KCR letters to CM Revanth

తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీ రావట్లేదు : వీహెచ్ - Sonia Not Come to TG celebrations

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.