ETV Bharat / state

'గత ప్రభుత్వం మాదిరి మేము గొప్పలకు పోలేదు - 100 శాతం వాస్తవ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాం' - Deputy CM Bhatti Speech in Assembly

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 27, 2024, 8:52 PM IST

Updated : Jul 27, 2024, 10:55 PM IST

Deputy CM Bhatti Speech On Budget Session : రాష్ట్ర శాసనసభలో బడ్జెట్‌పై జరిగిన చర్చలకు గానూ విపక్షాల ప్రశ్నలకు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సమాధానం ఇచ్చారు. వంద శాతం వాస్తవ బడ్జెట్‌ను ప్రవేశపెట్టామన్నారు. గత ప్రభుత్వం మాదిరి, గొప్పలకు పోలేదని వివరించారు.

Telangana Assembly Budget Session 2024
Bhatti Vikramarka On Telangana Budget (ETV Bharat)

Deputy CM Bhatti Answer to Opposition Questions On Budget : బడ్జెట్‌పై విపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క సుదీర్ఘంగా సమాధానం ఇచ్చారు. వందశాతం వాస్తవ బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని పునరుద్ఘాటించారు. గత ప్రభుత్వం మాదిరి, గొప్పలకు పోలేదని వివరించారు. అంతకుముందు కాంగ్రెస్‌ చేసిన అభివృద్ధి వల్లే హైదరాబాద్‌కు వెల్లువలా పెట్టుబడులు వచ్చాయన్న భట్టి విక్రమార్క, గత పదేళ్లు బీఆర్​ఎస్​ ప్రభుత్వం చేసింది శూన్యమని విమర్శించారు.

మహిళలకు వడ్డీలేనిరుణాల కోసం రూ. 20వేల కోట్లు కేటాయించామన్న ఆయన హైదరాబాద్‌ ప్రగతికి రూ. 10 వేల కోట్లు పెట్టిన ఘనత తమదేనని స్పష్టం చేశారు. నూటిని నూరుశాతం గ్యారంటీలను అమలుచేస్తామని తేల్చిచెప్పారు. గత ప్రభుత్వం గొప్పల కోసం భారీ బడ్జెట్‌లు పెట్టిందని, వాస్తవంలో మాత్రం ఏటా రూ.60 వేల నుంచి రూ.70 వేల కోట్లు ఖర్చు చేయలేదని ఆరోపించారు. గొప్పల కోసం అయితే తాము కూడా రూ.3.50 లక్షల కోట్ల బడ్జెట్‌ పెట్టేవాళ్లమన్నారు.

"బడ్జెట్​లో పొందిపరిచిన ప్రతి పైసా అర్ధవంతంగా ఖర్చు పెట్టాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. గతంలో బీఆర్​ఎస్​ ప్రభుత్వం రూ.2.90 లక్షల కోట్లు బడ్జెట్​ పెడితే, మేము నిజంగా వారిలా అడ్డగోలుగా, ఊహాజనితంగా ఏదో అలా పెట్టుంటే రూ.3.50 లక్షల కోట్లు అయ్యేది. కానీ మేము పెట్టింది కేవలం రూ.2.91 లక్షల కోట్లు మాత్రమే. అంటే వారు పెట్టిన దానికంటే ఒక వెయ్యి రూపాయలు మాత్రమే పెంచాం."-భట్టి విక్రమార్క, ఉపముఖ్యమంత్రి

గత పదేళ్లలో సాగునీటి సమస్య ఏ మాత్రం తీరలేదు : సాగునీటి సమస్య తీరాలనే పోరాడి రాష్ట్రం తెచ్చుకున్నామన్న ఉపముఖ్యమంత్రి, రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం నిర్మించినా, ఉపయోగం లేకుండా పోయిందన్నారు. మేడిగడ్డ వద్ద వచ్చిన నీరు వచ్చినట్లే పోతోందని, నిల్వ చేయలేని పరిస్థితి ఉందని దుయ్యబట్టారు. గత పదేళ్లలో సాగునీటి సమస్య ఏ మాత్రం తీరలేదని ఆక్షేపించారు.

రూ.లక్ష కోట్లు ఖర్చు చేసినా, కొత్తగా లక్ష ఎకరాలకు కూడా సాగునీరు అందలేదన్నారు. ప్రాధాన్యత వారీగా సాగునీటి ప్రాజెక్టులను తమ ప్రభుత్వం పూర్తి చేస్తుందని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. తక్కువ ఖర్చుతో పూర్తయ్యి నీరు వచ్చే ప్రాజెక్టులను ముందుగా పూర్తి చేస్తామని తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను పదేళ్ల పాటు పట్టించుకోలేదన్న భట్టి, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను పూర్తి చేసి ఉంటే, నల్గొండ జిల్లాకు సాగునీరు అంది ఉండేదని వ్యాఖ్యానించారు.

Bhatti Vikramarka Fires on BRS Party : ఏదైనా అభివృద్ధి చర్యల ఫలాలు ఐదు, పదేళ్ల తర్వాత కనిపిస్తాయని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శ్లాఘించారు. గత పదేళ్లలో హైదరాబాద్‌కు పెట్టుబడులు భారీగా వచ్చాయని బీఆర్ఎస్​ చెప్పుకున్నది. కానీ అంతకుముందు కాంగ్రెస్‌ చేసిన అభివృద్ధి వల్లే పెట్టుబడులు వచ్చాయన్నది వాస్తవమని తెలిపారు. భాగ్యనగరంలో ఎన్నో భారీ పరిశ్రమలను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పుకొచ్చారు.

నాటి కాంగ్రెస్ సర్కార్​ చర్యల ఫలితాలు బీఆర్ఎస్​ హయాంలో కనిపించాయని డిప్యూటీ సీఎం అన్నారు. కృష్ణా నది నుంచి హైదరాబాద్‌కు రెండు విడతల్లో తాగునీటి పైపులైన్లు వేసింది, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రాష్ట్ర రాజధాని పైపులైన్లు వేసింది హస్తం పార్టీనేనని ఉద్ఘాటించారు. హైదరాబాద్‌కు వచ్చే పైపులైన్‌కు గత పాలకులు రంధ్రం పెట్టి గజ్వేల్‌కు నీరు తీసుకెళ్లారన్నారు.

ఓఆర్‌ఆర్‌పై 30 ఏళ్లపాటు వచ్చే ఆదాయాన్ని ఒక్క ఏడాదిలోనే తీసుకున్నారని ఉపముఖ్యమంత్రి ఆరోపించారు. ప్రభుత్వం దిగిపోయే ముందు ఓఆర్‌ఆర్‌ వేలం వేసుకుని భవిష్యత్‌లో ఆదాయం లేకుండా చేశారని మండిపడ్డారు. పదేళ్లలో ఆరోగ్యశ్రీపై కేవలం రూ.4320 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, తమ ప్రభుత్వం మాత్రం ఆరోగ్యశ్రీ కోసం ఒక ఏడాదికే రూ.1063 కోట్లు కేటాయించినట్లు చర్చల్లో వివరించారు.

రాష్ట్రంలో ఒక్కొక్కరిపై రూ.1.76 లక్షలు అప్పు - ఈ నివేదిక ఇదే చెబుతోంది - Telangana Per Capita Income 2024

వ్యవసాయానికి న భూతో న భవిష్యత్ అన్నట్టు నిధులు : భట్టి విక్రమార్క - Telangana Budget 2024

Last Updated : Jul 27, 2024, 10:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.