DY CM Bhatti Condoled Farmer Death : ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన ఖమ్మం జిల్లా పొద్దుటూరుకు చెందిన రైతు ప్రభాకర్ కుటుంబాన్ని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరామర్శించారు. ప్రభాకర్ ఆత్మహత్య బాధాకరమని ఆయన తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్ని విధాలా న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎంత పెద్ద సమస్య ఉన్నప్టటికీ అన్నదాతలెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన హితవు పలికారు.
Bhatti Vikramarka On Farmer suicide : రైతు ఆత్మహత్యకు పురిగొల్పిన వారు ఎంతటివారైనప్పటికీ ఉపేక్షించేది లేదని భట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రభాకర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. పిల్లల చదువులకు ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని ఆయన వెల్లడించారు. బాధిత రైతు భూ సమస్యను శాశ్వత పరిష్కారం చూపించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని ఆయన తెలిపారు.
రైతు ప్రభాకర్ కుటుంబాన్ని ఆదుకుంటాం : బాధిత రైతు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు.'రైతు ప్రభాకర్ మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లుగా మీడియా ద్వారా తెలిసింది. ప్రాణం చాలా విలువైనది, మనం పుట్టింది బతకడానికి కానీ చావడానికి కాదు. ఎంత పెద్ద సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. రైతు ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు కల్పించిన వారెవరైనా సరే, ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించాను. ఇక్కడ ఉన్నవారందరూ మా వాళ్లే. బాధిత కుటుంబానికి అన్ని విధాలా న్యాయం జరిగేటట్లుగా చూస్తాం' అని తెలిపారు.
"రైతు ప్రభాకర్ భూమికి సంబంధించిన సమస్యకు ప్రభుత్వం తరపున శాశ్వత పరిష్కారం చూపిస్తాం. చేపల సొసైటీ, ఇరిగేషన్, రెవెన్యూ వారితో మాట్లాడి సమస్య ఏంటో తెలుసుకొని సమస్యను పరిష్కరించాలని కలెక్టర్‌ను ఆదేశించాను. ప్రభాకర్ పిల్లలు చదువుకోవడానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తాం. వారు చదువుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. బాధిత రైతు కుటుంబానికి అన్ని విధాలా న్యాయం జరిగే విధంగా అధికారులను ఆదేశించడం జరిగింది"- భట్టి విక్రమార్క, ఉపముఖ్యమంత్రి
వ్యవసాయంలో నష్టం వచ్చి.. రైతు బలవన్మరణం.!
కామారెడ్డి మాస్టర్ ప్లాన్.. భూమి పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం