Dasoju Sravan Shocking Comments on CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు దాసోజ్ శ్రవణ్ ఆక్షేపించారు. అబద్దాల పునాదులపై రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం కుర్చీలో కూర్చున్నాక అయినా హుందాగా వ్యవహరిస్తారని ఆశించామని తెలిపారు. అంతర్జాతీయ వేదికైన దావోస్‌లో చిల్లర ప్రయత్నం చేశారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రతిష్ఠ పెంచాల్సింది పోయి వ్యక్తిగతంగా పబ్లిసిటి చేశారని విమర్శించారు.
ఈ నెల నుంచి ఎవరు కరెంట్ బిల్లు కట్టవద్దు : కేటీఆర్
Dasoju Sravan Fires on Revanth Davos Tour : అంతర్జాతీయ వేదికపై తెలంగాణ గౌరవాన్ని పెంచేలా కేటీఆర్ వ్యవహరిస్తే ముఖ్యమంత్రిగా ఉంటూ అమలు చేయని రైతుభరోసా పథకాన్ని(Rythu Bharosa Scheme) అమలు చేసినట్లు చెప్పి రేవంత్ రెడ్డి తప్పుదోవ పట్టించారని శ్రవణ్ మండిపడ్డారు. చదువుకున్న, అనుభవజ్ఞుడైన మంత్రి శ్రీధర్ బాబును పని చేయనివ్వాలని శ్రవణ్ సూచించారు. అదానీతో రేవంత్ సంబంధం బట్టబయలైందని అన్నారు. అదానీ కోసం పార్లమెంట్‌లో రోజుల కొద్దీ కొట్లాది సభను స్తంభింపజేశారని వివరించారు. దిల్లీలో కుస్తీ, దావోస్‌లో దోస్తీ ఏంటని ప్రశ్నించారు. భుజాలపై ఎత్తుకొని తెలంగాణను అదానీకి తాకట్టుపెట్టారని శ్రవణ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసి వ్యక్తిగతంగా మాట్లాడి వచ్చాక అదాని వచ్చి కలిశారని అనంతరం దావోస్‌లో ఒప్పందం కుదిరిందని వివరించారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్ని అమలు చేసేదాకా విడిచి పెట్టం : కేటీఆర్
Dasoju Sravan on MLC Notification in Telangana : రెండు ఎమ్మెల్సీ స్థానాలకు విడిగా ఎన్నికల నిర్వహిస్తున్నారని శ్రవణ్(Dasoju Sravan) పేర్కొన్నారు. రక్షణ రంగం పనులపై అనుభవం లేదని రాహుల్ గాంధీ అంటే హైదరాబాద్‌లో ఆ పనుల కోసమే రేవంత్ రెడ్డి ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. కేటీఆర్ దావోస్ వెళ్లినపుడు అదానీ కలిసేందుకు ప్రయత్నించినా తిరస్కరించారని గుర్తు చేశారు.
"ఒక రాష్ట్రానికి సీఎం అనే విషయాన్ని రేవంత్‌రెడ్డి మర్చిపోతున్నారు. అంతర్జాతీయ వేదికల మీద రాష్ట్ర గౌరవం పెరిగేలా మాట్లాడాలి. పెట్టుబడుల వేదికను రాజకీయాలకు వాడుకోవడం సరికాదు. మేం రేవంత్‌రెడ్డి భాష గురించి మాట్లడటం లేదు. ఆయన మాటల్లోని భావం గురించే ప్రశ్నిస్తున్నాం. అంతర్జాతీయ వేదికల మీద తెలంగాణకు ఒక గౌరవం సాధించిన నేత కేటీఆర్. ఆయనను డూప్లికేట్ అని దావోస్‌లో మాట్లాడటం సరికాదు."- దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ సీనియర్ నేత
అధికారం ఉందని నోటికొచ్చినట్లు మాట్లాడటం సబబు కాదు : దానం నాగేందర్
Dasoju Sravan on Telangana Investments : తెలంగాణ యువతని వంచన చేయవద్దని దాసోజు శ్రవణ్ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. జేఎస్‌డబ్ల్యూ కంపెనీతో 2022లోనే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని, గోద్రెజ్ కంపెనీతో కూడా కేటీఆర్ హయాంలో గతంలోనే ఒప్పందం చేసుకున్నారని శ్రవణ్ వివరించారు. గతంలోనే ఒప్పందాలు చేసుకున్న కంపెనీలతో కొత్త పెట్టుబడులు అని ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్న రూ.22 వేల కోట్లు పెట్టుబడులు పాతవే అని అన్నారు. నష్టాల్లో ఉన్న కంపెనీ రూ.8000 కోట్ల పెట్టుబడి ఎలా పెడుతుందని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ ప్రశ్నించారు.