ETV Bharat / state

సైబర్‌ నేరాల నియంత్రణకు పోలీస్‌ శాఖ వ్యూహాత్మక అడుగులు - సిబ్బందికి ప్రత్యేక శిక్షణ

Cyber Security Bureau In Telangana : ఒక్క నకిలీ వెబ్‌సైట్‌ చాలు, వేల మందిని ముంచేందుకు. ఒక్క ఫోన్‌కాల్, ఒక్క నకిలీ ఈ-మెయిల్‌తో ఎంతో మందిని భయపెట్టొచ్చు. తేలిగ్గా డబ్బు కొట్టేయొచ్చు. ఇదీ సైబర్‌ నేరగాళ్ల ధీమా. మోసం ఏదైనా నకిలీ వెబ్‌సైట్, యాప్, ఈ-మెయిల్, ఇతరుల పేర్లతో తెరిచే బ్యాంకు ఖాతాలు, సిమ్‌కార్డులు, అవే సైబర్‌ నేరగాళ్లకు ప్రధాన ఆయుధాలు. ఈ తరహా మోసాలపై ఉక్కుపాదం మోపేందుకు సైబర్‌ సెక్యురిటీ బ్యూరో ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో నేరాలను ఎదుర్కొనేలా సిబ్బందికి శిక్షణనిస్తోంది.

Cyber Crimes
Cyber Security Bureau In Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 26, 2024, 10:45 AM IST

సైబర్‌ నేరాలపై నయా నిఘా - తెలంగాణలో ప్రత్యేక కాల్​ సెంటర్​ ఏర్పాటు

Cyber Security Bureau In Telangana : సైబర్‌ నేరాల నియంత్రణకు పోలీస్‌శాఖ వ్యూహాత్మక అడుగులేస్తోంది. దేశంలో తొలిసారిగా తెలంగాణలో సైబర్‌ సెక్యురిటీ బ్యూరో ఏర్పాటు, సైబర్‌ నేరాలపై ఫిర్యాదు చేయగానే వేగంగా స్పందించేందుకు ప్రత్యేక కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. బాధితులు సకాలంలో ఫిర్యాదు చేస్తే వారు పోగొట్టుకున్న డబ్బు తిరిగి రాబట్టేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. మరో అడుగు ముందుకేసి సైబర్‌ సెక్యురిటీ బ్యూరో రాష్ట్రంలోని అన్ని పోలీస్‌స్టేషన్లలో సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో (Cyber Security Bureau) ఎప్పటికప్పుడు సాంకేతికను మెరుగుపరుస్తోంది. ఇందులో భాగంగా నేరగాళ్లు ఉపయోగించే మెయిల్స్‌, వెబ్‌సైట్లు, సిమ్‌కార్డుల డేటా సేకరించి ఎప్పటికప్పుడు తొలగించేందుకు రెండు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసింది.

టాస్క్​ పూర్తి చేస్తే డబ్బులు చెల్లిస్తామని నమ్మబలికారు - రూ.49.45 లక్షలు దోచుకున్నారు

Cyber Crimes : ఇప్పటి వరకూ దాదాపు 23 వేల బ్యాంకు ఖాతాలు, 750కిపైగా ఈ-మెయిల్‌ఐడీలు, 22 వేల వెబ్‌సైట్లు, 28 వేల సిమ్‌కార్డుల వివరాలు సేకరించింది. అందులో కొన్నింటి ద్వారా సైబర్‌ నేరాలు (Cyber Crimes) జరిగినట్లు నిర్థారించుకొని నిర్వీర్యం చేసింది. గతేడాది అందుబాటులోకిచ్చిన డేటా అగ్రిగేషన్‌ అండ్‌ అనాలసిస్‌ యూనిట్‌, థ్రెట్‌ ఇంటలిజెన్స్‌ యూనిట్‌ ద్వారా అది సాధ్యమవుతోందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో వివిధ పోలీస్‌స్టేషన్లకు చెందిన 858 మంది కానిస్టేబుళ్లు, హెడ్‌ కానిస్టేబుళ్లకు సైబర్‌ నేరాల్లో వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు.

"కంప్లయింట్​ తీసుకున్న అనుమానితుని సమాచారం ద్వారా అంకౌట్​ నంబర్​, ఫోన్​ నంబర్స్​, యూఆర్ఎల్​ తీసుకుని డీయుఇ టీం వారు విశ్లేషణ చేస్తారు. దేశ వ్యాప్తంగా ఉన్న రిజిస్టర్​ అయిన సమాచారం తీసుకుని లోకల్​ పోలీస్​ల ద్వారా అరెస్ట్​ చేయడానికి ప్రయత్నిస్తాం. తద్వారా నిందితున్ని, రిమాండ్​ పంపిస్తాం." -శ్రవణ్ కుమార్, సైబర్ సెక్యూరిటీ అధికారి

సైబర్​ నేరాల్లో డబ్బులు కోల్పోతున్న బాధితులు - కొత్త విధానంతో సొమ్మును రికవరీ చేస్తున్న పోలీసులు

National Cyber Crime Reporting Portal 1930 Helpline : జాతీయ సైబర్‌ నేరాల రిపోర్టింగ్‌ పోర్టల్‌ 1930 హెల్ప్‌లైన్‌ పనితీరు, అనుమానస్పద సైబర్‌ నేరగాళ్ల గుర్తింపు, సామాజిక మాధ్యమాల ద్వారా నేరాలు, ఆర్ధిక నేరాల దర్యాప్తు, సైకాప్స్‌ అప్లికేషన్‌ ఉపయోగాలు, పిటి వారెంట్లపై నిందితులను పట్టుకొని రావడం, సైబర్‌ భద్రత, సైబర్‌ సిబ్బంది బాధ్యతలు, విధులు తదితర అంశాల్లో శిక్షణ కొనసాగింది. శిక్షణ పొందినవారు. సైబర్‌ సెక్యురిటీ బ్యూరో, పోలీస్‌స్టేషన్ల మధ్య సమన్వకర్తలుగా వ్యవహరించనున్నారు. ఆయా ఠాణాల్లో నమోదైన సైబర్ నేరాలపై దర్యాప్తు అధికారికి సహకరించడం సహా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాల్లో పాల్గొంటారు. సైబర్‌ సెక్యురిటీ బ్యూరో చేపడుతున్న చర్యలు సత్ఫలితాలనిస్తోందని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

మీ మొబైల్​కు ఏవైనా అనుమానాస్పద లింకులు వచ్చాయా - వెంటనే ఈ నంబర్​కు వాట్సాప్​ చేసేయండి

లాటరీ పేరుతో సైబర్ ​నేరగాళ్ల టోకరా - పదిహేను లక్షలకు పైగా పోగొట్టుకున్న ఆటోడ్రైవర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.