ETV Bharat / state

సైబర్​వలలో డబ్బులు పోగుట్టుకున్న వ్యక్తి - 1930కి డయల్ చేయడంతో డబ్బు తిరిగొచ్చేలా చేసిన పోలీసులు - Cyber Crime Police Recovered Money - CYBER CRIME POLICE RECOVERED MONEY

Cyber Crime Police Recovered Money : హైదరాబాద్​లోని నేరేడ్​మెట్​లో ఓ వ్యక్తి సైబర్​ నేరగాళ్ల​ వలలో చిక్కి రూ. 1,26,752 పోగుట్టుకున్న డబ్బును సైబర్​ క్రైం పోలీసులు రికవరీ చేసి అప్పగించారు. హైదరాబాద్​లోని నేరేడ్​మెట్ గీతానగర్​లో నివాసం ఉంటున్న అభిషేక్ అనే వ్యక్తి సైబర్ నేరగాళ్లు పంపిన లింక్ ఓపెన్ చేసి డబ్బును పోగొట్టుకున్నాడు. దీంతో మోసపోయానని తెలిసి 1930కి డయల్ చేయడంతో పోలీసులు నిందితుల ఖాతాలను సీజ్ చేసి డబ్బులను రికవరీ చేసి బాధితునికి అప్పగించారు.

Cyber Crime Police Recovered Money In Hyderabad
Cyber Crime Police Recovered Money (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 27, 2024, 10:08 PM IST

Cyber Crime Police Recovered Money In Hyderabad : సైబర్​ నేరగాళ్ల దాడుల్లో ఒకసారి వారి చేతుల్లోకి వెళ్లిన సొమ్ము తిరిగి బాధితుని వద్దకు రావడమంటే ఏదో అద్భుతమే జరగాలి. ఇలా చాలా మంది అనేక రకాల సైబర్​ దాడుల్లో కోట్ల రూపాయల సొమ్మునే పోగొట్టుకున్నారు. ఇలా సైబర్ మోసాలు ఈ ఆధునిక సమాజంలో రోజురోజుకీ పెరిగిపోతున్నారు. ఇన్నాళ్లు ఇలాంటి వారిని గుర్తించడం కఠినంగానే ఉండేది కానీ వారితో పాటు పోలీసులు కూడా కొత్త పంథాలను ఎంచుకోవడంతో ఇలాంటి దాడులకు పాల్పడేవారిని గుర్తించి వారి నుంచి సొమ్మును దాదాపుగా రికవరీ చేస్తున్నారు.

తాజాగా హైదరాబాద్​లోని నేరేడ్​మెట్​లో ఓ వ్యక్తి సైబర్​ నేరగాళ్ల​ వలలో చిక్కి రూ. 1,26,752 పోగుట్టుకున్న డబ్బును సైబర్​ క్రైం పోలీసులు రికవరీ చేసి అప్పగించారు. నేరేడ్​మెట్ గీతానగర్​లో నివాసం ఉంటున్న అభిషేక్ అనే వ్యక్తి మూడు నెలల క్రితం సైబర్ నేరగాళ్లు పంపిన లింకులో తన వివరాలు నమోదు చేసుకున్నాడు. టాస్క్ కంప్లీట్ చేస్తే డబ్బులు వస్తాయని సైబర్​నేరగాళ్లు నమ్మించారు.

దీంతో డబ్బు వస్తుందని ఆశపడిన ఆ వ్యక్తి ముందుగా తన ఖాతా నుంచి కొద్దికొద్దిగా డబ్బులు పంపించాడు. మళ్లీ సైబర్ నేరగాళ్లు డబ్బులు డిమాండ్ చేయడంతో మోసపోయానని తెలుసుకున్న ఆ వ్యక్తి 1930కి డయల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై నేరేడ్​మెట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని ముందుగా నిందితుల బ్యాంక్ ఖాతాలను నిలుపుదల చేయించారు. అనంతరం బాధితుడు పోగొట్టుకున్న డబ్బు వివరాలు తెలుసుకొని అతనికి అందేలా చేశారు.

పోగుట్టుకున్న డబ్బును రికవరీ చేసి అప్పగించిన పోలీసులకు బాధితుడు అభిషేక్ నేరేడ్​మెంట్ పోలీస్ స్టేషన్​కు వచ్చి కృతజ్ఞతలు తెలిపాడు. సైబర్ నేరగాళ్లు పోగుట్టుకున్న డబ్బును సకాలంలో ఫిర్యాదు చేయడం వల్ల నేరగాళ్ల ఖాతాను సీజ్ చేసి డబ్బును రికవరీ చేయవచ్చని సీఐ సందీప్ కుమార్ సూచించారు. గోల్డెన్ అవర్ చాలా ముఖ్యమైందని అన్నారు.

బాధితులు వారి ఖాతాలో డబ్బులు పోగొట్టుకున్నట్లయితే ఆలస్యం చేయకుండా 1930కి డయల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. ముఖ్యంగా ప్రజలు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి వారు పంపిన లింకులు తెరచి మోసాలకు గురవుతున్నారన్నారని అన్నారు. నేరేడ్​మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతాల్లో సైబర్ నేరాల నివారణకు అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రజలు సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

పేదల పేరుతో బ్యాంక్ అకౌంట్స్ - దుబాయ్ నుంచి ఆపరేటింగ్ - 2 నెలల్లో రూ.175 కోట్ల స్కామ్ - RS 175 CRORES CYBER FRAUD IN HYD

హైదరాబాద్​ పోలీసులా మజాకా - గుజరాత్​లో​ జల్లెడపట్టి రూ.వెయ్యికోట్లు కాజేసిన నిందితుల అరెస్టు - Hyd Police Nab 36 Fraudsters

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.