ETV Bharat / state

వామ్మో జింకలు : వేసిన మొక్క వేసినట్లు తినేస్తూ - కర్షకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ - Deers Destroying Crops

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 26, 2024, 1:35 PM IST

Crops Are Being Destroyed by Deer : చూడముచ్చటైన అందంతో చెంగు చెంగున జింకలు గంతులేస్తుంటే చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. పచ్చని అడవుల్లో అవి పరిగెడుతుంటే ఎంతటి వారైనా వాటి విన్యాసాలకు ముగ్ధులవ్వాల్సిందే. అలాంటి కనువిందు చేసే కృష్ణ జింకలే రైతులే పాలిట శాపంగా మారాయి. పంటలపై దాడి చేస్తూ కర్షకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

Crops Are Being Destroyed by Deer in Mahabubnagar
Crops Are Being Destroyed by Deer in Mahabubnagar (ETV Bharat)

Crops Are Being Destroyed by Deer's in Mahbubnagar : మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మక్తల్‌, మాగనూరు, కృష్ణ, నర్వ, ఉట్కూరు మండలాల్లో జింకల బెడద తీవ్ర స్థాయిలో ఉంది. ఆరుగాలం రైతులు శ్రమించి పండించిన పంటలను జింకలు నాశనం చేస్తున్నాయి. నదీ తీర ప్రాంతం కావడంతో జింకల సంతతి భారీగా పెరిగిపోయింది. ఒక్కో గుంపులో 30 నుంచి 50 జింకలు వచ్చి, పంట పొలాలపై దాడి చేస్తున్నాయని అన్నదాతలు వాపోతున్నారు.

పంట వేసినప్పటి నుంచి చేతికొచ్చే వరకు పొలాల దగ్గర కాపలా కాసినా కానీ, ఒక్కసారిగా జింకలు పంటలపై మెరుపు దాడి చేసి నాశనం చేస్తున్నాయని కర్షకులు ఆవేదన చెందుతున్నారు. కంటి మీద కునుకు లేకుండా రాత్రింబవళ్లు పొలాల గట్లపై కాపలా కాస్తూ పంటలను కాపాడుకుంటున్నామంటున్నారు. మక్తల్‌ నియోజకవర్గంలో జింకల సంతతి మూడు వేల వరకు ఉంటుందని అంచనా. రిజర్వ్‌ ఫారెస్ట్‌ అడవుల నుంచి కృష్ణ జింకలు ఇక్కడికి రావడంతో వీటి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. జింకలను నియంత్రించే పనిలో ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల వీటి ఆవాసం పూర్తిస్థాయిలో పెరిగి రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నాయి.

Deers Destroying Crops : చెంగు చెంగున ఎగురుతూ.. పంట పొలాలను ఆగం చేస్తూ

కాగితాలకే పరిమితమైన ప్రతిపాదనలు : గత ప్రభుత్వంలో మక్తల్‌ నియోజకవర్గం కృష్ణ మండలం ముడుమాల్‌ గ్రామంలో ప్రభుత్వ సర్వే నెంబర్‌ 192, 194లో 74 ఎకరాల 10 గుంటల భూమిని అటవీ శాఖ అధికారులకు కేటాయించారు. ఈ భూమిలో ఫినిషింగ్‌ ఏర్పాటు చేసి జింకలను ఒకే సమూహంలోకి తేవాలని నివేదికలు పంపినప్పటికీ ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడంతో ఆ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. జింకల వల్ల తాము వ్యవసాయం మానుకునే పరిస్థితి వస్తుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వమైనా జింకల నుంచి పంటలను కాపాడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

జింకలు, అడవి పందుల దాడుల వల్ల మాకు చాలా నష్టం వస్తుంది. జింకల వల్ల ఏ పంట వేసినా నాశనం అవుతుంది. పంట అంతా తినేస్తున్నాయి. దాని వల్ల మాకు తీవ్ర నష్టం వస్తుంది. దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. వేసిన మొక్క వేసినట్లు తింటుంది. ఎప్పుడు పంట దగ్గర కాపలా ఉంటున్నా మరోవైపు నుంచి తినేసి పోతున్నాయి. జింకలు పంటల వైపు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుంది - బాధిత రైతులు, మహబూబ్​నగర్

వర్షాల కారణంగా ధాన్యం తడిసి రైతులు అవస్థలు - వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ - Crops Damage Due to Untimely Rains

Deer Fell in Canal video : కాలువలో పడ్డ దుప్పి.. పైకి వచ్చేందుకు ఎన్ని తిప్పలు పడిందో చూశారా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.