Consumer Commission Imposed Fine On Singapore Airlines : ఫ్లైట్‌లో బిజినెస్ క్లాస్ టికెట్లతో ఎకానమీ ప్రయాణానుభవం పొందామని తెలంగాణ డీజీపీ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన వినియోగదారుల కమిషన్ సంబంధిత సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు రూ.2 లక్షల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని డీజీపీ, ఆయన భార్యకు చెల్లించాలని సంబంధిత సంస్థ సింగపూర్ ఎయిర్‌లైన్స్‌ను ఆదేశించింది.
DGP Ravigupta Will Get Compensation : సరైన సేవలు అందించనందుకు సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు జిల్లా వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. తెలంగాణ డీజీపీ రవిగుప్తా ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన కమిషన్ డీజీపీ, ఆయన భార్యకు కలిపి రూ.2 లక్షలు చెల్లించాలని ఆదేశించింది.
TSRTC is fined : బస్సు ఆలస్యం.. తెలంగాణ ఆర్టీసీకి జరిమానా
గతేడాది మే 23 న రవిగుప్తా తన భార్య అంజలి గుప్తాతో కలిసి హైదరాబాద్ నుంచి సింగపూర్ మీదుగా ఆస్ట్రేలియా వెళ్లారు. అందుకు బిజినెస్ క్లాస్‌లో రిక్లైనర్ సీట్లు బుక్ చేసుకున్నారు. కాగా ప్రయాణ సమయంలో రిక్లైనర్ సీట్లలో ఎలక్ట్రానిక్ కంట్రోల్ విఫలమవడం వల్ల ప్రయాణ సమయమంతా మేల్కొని ఉండాల్సి వచ్చిందని, బిజినెస్ క్లాస్ టికెట్లతో ఎకానమీ ప్రయాణానుభవం పొంది ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు డీజీపీ రవిగుప్తా జిల్లా వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. బిజినెస్ క్లాస్ ఒక్కో టికెట్ ధర 66 వేల 750గా ఉంది. కాగా, డీజీపీతో పాటు ఆయన భార్యకు కలిగిన అసౌకర్యానికి గాను ఇద్దరికీ కలిపి రూ.97,500పాటు 2023 మే నుంచి 12 శాతం వడ్డీ అందజేయాలని వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. దీంతో పాటు రవిగుప్తా, ఆయన భార్యకు ఒక్కో లక్ష చొప్పున మొత్తంగా 2 లక్షలు, ఫిర్యాదు చేసేందుకు అయిన ఖర్చులకు గాను 10వేలు ఇవ్వాలని సింగపూర్ ఎయిర్‌లైన్స్‌ను ఆదేశించింది.
హెర్నియా సర్జరీకి వెళ్తే కిడ్నీ మాయం - రూ. 30 లక్షలు చెల్లించాలని వినియోగదారుల కమిషన్ ఆదేశం