ETV Bharat / state

ఆగస్టు ఆఖరికల్లా రూ.2 లక్షల్లోపు రైతు రుణమాఫీ : సీఎం రేవంత్‌ రెడ్డి - CM REVANTH on crop loan

CM Revanth unveil Jaipal Reddy Statue : జైపాల్‌రెడ్డికి పదవులతో గౌరవం రాలేదని, జైపాల్‌ రెడ్డి వల్లే పదవులకు గౌరవం వచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా కల్వకుర్తిలో ఏర్పాటు చేసిన జైపాల్‌రెడ్డి కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు.

Former Union Minister Jaipal Reddy
CM Revanth unveil Jaipal Reddy Statue (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 28, 2024, 7:42 PM IST

Updated : Jul 28, 2024, 7:51 PM IST

CM Revanth on Crop Loan Waiver : 2014లో సీఎం అభ్యర్థిగా జైపాల్‌ రెడ్డిని ప్రకటించి ఉంటే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కల్వకుర్తిలో ఏర్పాటు చేసిన జైపాల్‌రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ జైపాల్‌రెడ్డికి పదవులతో గౌరవం రాలేదని, జైపాల్‌రెడ్డి వల్లే పదవులకు గౌరవం వచ్చిందని పేర్కొన్నారు.

తెలంగాణలోని వారసత్వ సంపదను ప్రభుత్వం పరిరక్షిస్తుంది : సీఎం రేవంత్​ రెడ్డి - CM Revanth On Qutb Shahi tombs

కల్వకుర్తి ప్రజలతో వాదించి గెలవడం కష్టమని, ప్రజా సమస్యల పరిష్కారంలో కల్వకుర్తి ప్రజాప్రతినిధులకు ప్రత్యేకత ఉందని సీఎం రేవంత్‌ కొనియాడారు. కల్వకుర్తి ప్రజాప్రతినిధుల్లో జైపాల్‌రెడ్డి నేర్పించిన విలువలు కనిపిస్తుంటాయని పేర్కొన్నారు. తల్లిని చంపి బిడ్డను కాపాడారు అని ప్రధాని మోదీ ఆరోపణ చేశారని సీఎం గుర్తు చేశారు. కాంగ్రెస్‌ అధిష్ఠానానికి ప్రత్యేక తెలంగాణ ప్రాధాన్యతను జైపాల్‌రెడ్డి వివరించారని రేవంత్‌ పేర్కొన్నారు.

ఆగస్టులోపు రుణమాఫీ : రుణమాఫీ చేసి చూపించాలని బీఆర్ఎస్‌ నేతలు సవాల్ విసిరారని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు. ఆగస్టులోపే రుణమాఫీ చేస్తామని, జులై 31లోపే రూ.1.50 లక్షల్లోపు రైతు రుణాలు మాఫీ చేయనున్నట్లు తెలిపారు. ఆగస్టు ఆఖరుకల్లా రూ.2 లక్షల్లోపు రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. కాంగ్రెస్‌ హయాంలో పేదలకు కష్టాలు వచ్చాయని బీఆర్ఎస్‌ నేతలు అంటున్నారని, పేదలకు ఎవరికీ కష్టాలు రాలేదని, కేసీఆర్‌ కుటుంబానికి కష్టాలు వచ్చాయని సీఎం రేవంత్‌ ఎద్దేవా చేశారు. అధికారం పోయిందనే బాధ కేసీఆర్‌లో స్పష్టంగా కనిపిస్తోందని, ప్రజలు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను చిత్తుగా ఓడించారని పేర్కొన్నారు.

నియోజకవర్గ అభివృద్ధికి నిధులు : కల్వకుర్తిని అభివృద్ధి చేస్తానని ఎన్నికల సభలో చెప్పానని సీఎం రేవంత్ గుర్తు చేసుకున్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని, కల్వకుర్తిలో ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌హౌస్‌, రోడ్ల కోసం రూ.180 కోట్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. కల్వకుర్తిలో నిరుద్యోగితను పారదోలడానికి స్కిల్‌ సెంటర్‌, ఆమన్‌గల్‌లో డిగ్రీ కళాశాల మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మాడుగల మండల కేంద్రంలో అండర్‌ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

కల్వకుర్తి నియోజకవర్గంలో బీటీ రోడ్లు వేస్తామని, కల్వకుర్తి నుంచి హైదరాబాద్‌కు 4 లైన్ల రహదారి వేస్తామని సీఎం రేవంత్‌ తెలిపారు. తాను చదివిన తాండ్ర ఉన్నత పాఠశాలను అభివృద్ధి చేస్తామని, రూ.5 కోట్లతో అభివృద్ధి పనులు చేయనున్నట్లు తెలిపారు. ముచ్చర్లలో 50 ఎకరాల్లో రూ.100 కోట్లతో ఆగస్టు 1న యంగ్‌ ఇండియా స్కిల్‌ వర్సిటీ పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు.

జైపాల్‌రెడ్డికి పదవులతో గౌరవం రాలేదు, జైపాల్‌రెడ్డి వల్లే పదవులకు గౌరవం వచ్చింది. రుణమాఫీ చేసి చూపించాలని బీఆర్ఎస్‌ నేతలు సవాల్ విసిరారు. ఆగస్టులోపే రుణమాఫీ చేస్తాం. జులై 31లోపే రూ.1.50 లక్షల్లోపు రైతు రుణాలు మాఫీ చేస్తాం. ఆగస్టు ఆఖరుకల్లా రూ.2 లక్షల్లోపు రైతులకు రుణమాఫీ పూర్తి చేస్తాం. - రేవంత్‌ రెడ్డి, సీఎం

సీఎం రేవంత్ Vs హరీశ్ రావు - అసెంబ్లీలో మోటార్లకు మీటర్లపై మాటల యుద్ధం - Telangana Assembly On Smart Meters

2029 ఎన్నికల నాటికి పాతబస్తీకి మెట్రో రైలు నిర్మించి తీరతాం : సీఎం రేవంత్​ రెడ్డి - CM Revanth on Old City Metro

Last Updated : Jul 28, 2024, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.