CM Revanth on SC Classification : ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ అనుకూలమని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. చేవెళ్ల డిక్లరేషన్ ద్వారా ఎస్సీ వర్గీకరణపై పార్టీ వైఖరి ఖర్గే తెలిపారన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పునకు తమ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన గ్లోబల్ మాదిగ డే - 2024 కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వారం రోజుల్లో ఎస్సీ వర్గీకరణపై షమీమ్ అక్తర్ కమిషన్ నివేదిక వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ చేస్తామని పేర్కొన్నారు. రాజకీయ, అధికార నియామకాల్లో మాదిగలకు ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు. చరిత్రలో తొలిసారి ఓయూ వీసీగా మాదిగను నియమించామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.
"ఉస్మానియా యూనివర్సిటీకి వీసీగా మాదిగను 100 సంవత్సరాల చరిత్రలో మన ప్రభుత్వం నియమించింది. ఏ అవకాశం వచ్చినా రాజకీయ పరమైన, అధికారులకు సంబంధించి నియామకాలు ఏది చేపట్టిన మాదిగ సామాజిక వర్గానికి వారు అడగకుండానే వారు కావాల్సిన దానికన్నా ఎక్కువగానే ఇస్తున్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు అన్యాయం జరగనివ్వదు. మీకు న్యాయం చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. నేను ఎక్కడికి వెళ్లిన సరే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ గురించి మాట్లాడుతున్నాను. ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకం తీసుకుంది. ఆ యూనివర్సిటీని పీపీపీ మోడల్లో ప్రారంభించాం. అందులో కూడా పైడిపాటి దేవయ్యను బోర్డు మెంబర్గా నియమించాం." - రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
'చిత్తశుద్ధితో గురుకులాల ప్రక్షాళన - ప్రతి నెల 10లోపు విద్యా సంస్థలకు నిధులు'
ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కీలక తీర్పు - పార్టీలకతీతంగా స్వాగతించిన నేతలు - SC ST SUB CLASSIFICATION