ETV Bharat / state

కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్‌లో రూ.లక్షతో పాటు తులం బంగారం - సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy Review on Kalyana Lakshmi and Shadhi Mubarak : రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం త్వరలో శుభవార్త అందించబోతుంది. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ పథకాల్లో లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇచ్చేలా సమాయత్తమవుతోంది. ఆ దిశగా పథకం అమలుకు అంచనాలు రుపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇవాళ సచివాలయంలో బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ మంత్రులతో సీఎం రేవంత్‌ సమీక్ష నిర్వహించారు.

CM Revanth Reddy
CM Revanth Reddy Review on Kalyana Lakshmi and Shadhi Mubarak
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 27, 2024, 3:17 PM IST

Updated : Jan 27, 2024, 5:00 PM IST

CM Revanth Reddy Review on Kalyana Lakshmi and Shadhi Mubarak : కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో లబ్ధిదారులకు నగదు రూ.లక్షతో పాటు తులం బంగారం ఇచ్చేలా అంచనాలు రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. ఇవాళ సచివాలయంలో బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ మంత్రులతో సీఎం రేవంత్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు.

అవును నేను మేస్త్రీనే- తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రీని: సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Review on BC Study Circles : పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు. సంక్షేమ హాస్టళ్లకు గ్రీన్ ఛానెల్ ద్వారా నిధులు విడుదల చేసే ప్రణాళికలు చేయాలని అధికారులకు సూచించారు. అద్దె భవనాల్లోని గురుకులాలకు సొంత భవనాలు నిర్మాణానికి కోసం భూమిని గుర్తించాలని, గురుకులాలకు సొంత భవనాలు నిర్మాణానికి అంచనా వ్యయాన్ని రూపొందించాలని ఆదేశించారు. ఈ సమావేశానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, అధికారులు హాజరయ్యారు.

రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ - దావోస్​ వేదికగా రూ. 37వేల కోట్లకు పైగా పారిశ్రామిక ఒప్పందాలు

Kalyana Lakshmi Scheme : తెలంగాణలో ప్రతి పేదింటి ఆడబిడ్డ తండ్రికి ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు గత బీఆర్‌ఎస్‌(BRS) సర్కార్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రవేశపెట్టింది. ఈ పథకాల్లో భాగంగా పెళ్లి చేసుకున్న ప్రతి ఆడబిడ్డకు రూ. 1,00,116 కానుకగా ఇస్తోంది. ఈ పథకాన్ని అక్టోబరు 2, 2014 నుంచి అమలులోకి తీసుకొచ్చారు. పథకం ప్రారంభంలో రూ.51వేలను ఇవ్వగా అనంతరం రూ.75,116 లకు పెంచారు.

2018 మార్చి 19న రూ.1,00,116 కు పెంచారు. దివ్యాంగ ఆడబిడ్డలకు రూ.1,25,016 అందజేస్తోంది. 18ఏళ్లు వయోపరిమితి ఉన్న బీసీ, ఓబీసీ యువతులకు ఈ పథకం వర్తిస్తుంది. గ్రామాల్లో ఆదాయం రూ.లక్షన్నర, పట్టణాల్లో రూ.2 లక్షల ఆదాయం ఉన్న వారు ఈ పథకానికి అర్హులు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో రాగానే కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌ పథకంలో లబ్ధిదారులకు ఆర్ధిక సహాయంతో పాటు, తులం బంగారం ఇస్తామని హస్తం పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి సంక్షేమ శాఖ అధికారులతో పథకంలో ఆర్దిక సహాయం పెంపుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఆరు గ్యారంటీలు, ఇతర హామీల అమలులో అధికారులదే కీలక పాత్ర : సీఎం రేవంత్​ రెడ్డి

Last Updated : Jan 27, 2024, 5:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.