ETV Bharat / state

మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం, సమాజం సంతోషంగా ఉంటాయి : సీఎం రేవంత్​ రెడ్డి - Pink power Run In Hyderabad - PINK POWER RUN IN HYDERABAD

PINK POWER RUN IN HYDERABAD : బ్రెస్ట్​ క్యాన్సర్​పై అవగాహన కల్పించేందుకు సుధారెడ్డి ఫౌండేషన్ ఏర్పాటు చేసిన పింక్ పవర్ రన్-2024 కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ బ్రెస్ట్​ క్యాన్స్​ర్​పై సుధారెడ్డి పౌండేషన్ అవగాహన కల్పించడం చాలా గొప్ప కార్యక్రమమని కొనియాడారు. మహిళ సాధికారత కోసం రాష్ట్ర అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు.

PINK POWER RUN IN HYDERABAD
PINK POWER RUN IN HYDERABAD (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 29, 2024, 10:20 AM IST

Updated : Sep 29, 2024, 10:48 AM IST

CM Revanth Reddy On Pink Power Run Program : మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటంబం, సమాజం సంతోషంగా ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బ్రెస్ట్​ క్యాన్సర్​పై అవహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన పింక్ పవర్​ రన్ చాలా గొప్ప కార్యక్రమమని కొనియాడారు. మహిళా సాధికారత కోసం రాష్ట్రప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోందని వివరించారు. హైదరాబాద్​లోని గచ్చిబౌలి స్టేడియంలో సుధారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'పింక్ పవర్ రన్ 2024' కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్​ రెడ్డి మాట్లాడుతూ, మహిళా సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని సీఎం తెలిపారు. వైద్య రంగ అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీఠవేస్తోందని అన్నారు. బ్రెస్ట్​ క్యాన్సర్​పై అవగాహన కల్పించేందుకు సుధారెడ్డి పౌండేషన్ ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమం నిర్వహించినందుకు సుధారెడ్డికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పింక్ పవర్ 5కె, 10కె రన్​లో గెలుపొందిన వారికి సీఎం రేవంత్​ రెడ్డి నగదు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి పీఏసీ ఛైర్మన్ అరికపూడి గాంధీ, శాట్ ఛైర్మన్ శివసేనారెడ్డి తదితరులు హాజరయ్యారు.

'పింక్​ పవర్​ రన్​'ను ప్రారంభించిన దామోదర రాజనర్సింహా : ఎం.ఇ.ఐ.ఎల్, సుధా రెడ్డి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 3,5,10కిలో మీటర్ల మారథాన్​లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. గచ్చిబౌలి స్టేడియం నుంచి ప్రారంభమైన మారథాన్​ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జెండా ఊపి ప్రారంభించారు. బ్రెస్ట్ (రొమ్ము) క్యాన్సర్​పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఈ పరుగు నిర్వహించినట్లు ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభమైన మారథాన్ ఓల్డ్ ముంబయి జాతీయ రహదారి, ఐఎస్‌బీ రోడ్, టిఎన్ఓ కాలనీ మీదుగా కొనసాగి తిరిగి స్టేడియంకి చేరింది. ఈ కార్యక్రమంలో వందలాది మంది పిల్లల, పెద్దల వరకు అందరూ గులాబీ రంగు దుస్తుల్లో ముస్తాబై పక్షి రూపంలో భారీ మానవహారంగా ఏర్పడి గిన్నిస్ వరల్డ్ రికార్డులో చేరేందుకు ప్రయత్నించారు. యువత ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంది.

'ఈ అలవాట్ల వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ఛాన్స్'- అవేంటో తెలుసా? - Reasons for Breast Cancer

అలర్ట్ : మహిళలకు రొమ్ము క్యాన్సర్​ ముప్పు - ఈ పని తప్పక చేయాలి! - Benefits of Breastfeeding to Mother and Baby

Last Updated : Sep 29, 2024, 10:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.