ETV Bharat / state

ఆకాశమే మీ లక్ష్యమైతే - అక్కడికి తీసుకెళ్లడానికి మేం రాకెట్​తో సిద్ధం : సీఎం రేవంత్​ రెడ్డి

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 27, 2024, 11:37 AM IST

Updated : Feb 27, 2024, 12:47 PM IST

CM Revanth Reddy Attend Bio Asia Summit in Hyderabad : ఆకాశమే మీ లక్ష్యమైతే మేం అక్కడికి తీసుకెళ్లడానికి రాకెట్​తో సిద్ధంగా ఉన్నామని ఫార్మా కంపెనీలకు సీఎం రేవంత్​ రెడ్డి పిలుపునిచ్చారు. హెచ్​ఐసీసీ వేదికగా జరుగుతున్న 21వ బయో ఆసియా సదస్సులో సీఎం రేవంత్​ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​ బాబు పాల్గొన్నారు.

Revanth Reddy
Revanth Reddy BIOASIA Summit
20 ఏళ్లుగా బయో ఆసియా సదస్సులు హైదరాబాద్​ను ఉన్నత శిఖరంలో నిలిపాయి : సీఎం రేవంత్

CM Revanth Reddy Attend Bio Asia Summit in Hyderabad : హైదరాబాద్​ ఐటీ, సాఫ్ట్​వేర్​ రంగానికి రాజధానిగా ఉందని, అలాగే లైఫ్​ సైన్సెస్​ రాజధాని అనడంలో కూడా ఎలాంటి సందేహం లేదని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. హెచ్​ఐసీసీ వేదికగా జరుగుతున్న 21వ బయో ఆసియా సదస్సు(21th Bio Asia Summit)లో సీఎం రేవంత్​ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​ బాబు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జీవ వైవిధ్య, సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులపై చర్చించారు. అలాగే ఔషధ రంగంలో ఆవిష్కరణలు, ఔషధ పరికరాల ప్రోత్సాహకాలపైనా చర్చలు జరిపారు. పరిశోధనలు చేస్తున్న అంకుర సంస్థలకు ప్రోత్సాహకాలపై ఈ సదస్సులో నిర్ణయాలు తీసుకోనున్నారు.

ఈ సందర్భంగా కొవిడ్​(Covid 19) అనంతరం ప్రజలు ఆరోగ్యంపై దృష్టి సారించారని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. ప్రపంచంలో మూడు కొవిడ్​ వ్యాక్సిన్​లు వచ్చాయని, అందులో ఒకటి అందించిన ఘనత హైదరాబాద్​కే దక్కుతుందని వివరించారు. 20 ఏళ్లుగా బయో ఆసియా సదస్సులు హైదరాబాద్​ను ఉన్నత శిఖరంలో నిలిపాయని అన్నారు. హైదరాబాద్​ ఎన్నో పరిశోధనలకు నిలయంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. జాతీయ, అంతర్జాతీయ, స్టార్టప్​ కంపెనీలకు తమ ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందన్నారు. ఎంఎస్​ఎంఈ(MSME)లను పటిష్ఠం చేసేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని పేర్కొన్నారు.

''ఫుడ్‌ ఆన్‌ వీల్స్‌' - ఇక మీ ఇంటి వద్దకే చిరు ధాన్యాలతో చేసిన నిత్యావసర వస్తువులు

Bio Asia Summit 2024 : ఫార్మా రంగాల్లో సవాళ్లను తాను అర్థం చేసుకోగలనని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. ఈ మధ్య కొందరు ఫార్మా రంగ ప్రతినిధులతో సమావేశమయ్యానని, వారి సమస్యలు వివరించారన్నారు. ఫార్మా రంగానికి బాసటగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఆకాశమే మీ లక్ష్యమైతే మేం అక్కడికి తీసుకెళ్లడానికి రాకెట్​తో సిద్ధంగా ఉన్నామని ఫార్మా కంపెనీలకు సీఎం రేవంత్​ రెడ్డి పిలుపునిచ్చారు.

"హైదరాబాద్‌ ఐటీ, సాఫ్ట్‌వేర్‌ రంగానికి రాజధానిగా ఉంది. కొవిడ్‌ అనంతరం ప్రజలు ఆరోగ్యంపై దృష్టి సారించారు. లైఫ్‌సైన్సెస్‌ రాజధాని హైదరాబాద్‌ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రపంచంలో మూడు కొవిడ్‌ వ్యాక్సిన్‌లు వచ్చాయి. ఒక కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందించిన ఘనత హైదరాబాద్‌కు దక్కింది. 20 ఏళ్లుగా బయో ఆసియా సదస్సులు హైదరాబాద్‌ను ఉన్నత శిఖరంలో నిలిపాయి. హైదరాబాద్‌ ఎన్నో పరిశోధనలకు నిలయంగా ఉంది. జాతీయ, అంతర్జాతీయ, స్టార్టప్‌ కంపెనీలకు మా ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుంది. ఎంఎస్‌ఎంఈలను పటిష్ఠం చేసేందుకు మా ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుంది. ఆకాశమే మీ లక్ష్యమైతే మేం అక్కడికి తీసుకెళ్లడానికి రాకెట్​తో సిద్ధంగా ఉన్నాము." - రేవంత్​ రెడ్డి, ముఖ్యమంత్రి

నైపుణ్య రాజధానిగా హైదరాబాద్​ : 21 ఏళ్ల క్రితం బయో ఆసియా సదస్సు ప్రయాణం మొదలైందని, జీవ వైద్య రంగంలో అద్భుతమైన ఆవిష్కరణలకు ఇది ఒక మంచి వేదికని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్​బాబు అన్నారు. త్వరలోనే న్యూలైఫ్​ సైన్సెస్​ పాలసీని తీసుకొస్తామని స్పష్టం చేశారు. నూతన ఆవిష్కరణలకు హైదరాబాద్​ వేదిక కావడం ఆనందంగా ఉందని తెలిపారు. జీవవైద్య రంగంలో అంతర్జాతీయ ఖ్యాతిని విస్తరించడానికి ఈ వేదిక ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రపంచ వేదికపై తెలంగాణ జీవవైద్య రంగం అభివృద్ధికికి ఈ సదస్సు దోహదం చేస్తుందన్నారు. నైపుణ్య రాజధానిగా హైదరాబాద్​ను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.

నేటి నుంచి 21వ బయో ఆసియా సదస్సు - జీవవైద్య సాంకేతిక రంగంలో మార్పులు, ఆవిష్కరణలపై చర్చలు

Bio Asia Summit 2024 : బయో ఆసియా సదస్సు 2024లో ప్రసంగించే ప్రముఖుల పేర్లు ఖరారు.. లిస్ట్​ ఇదే

Last Updated : Feb 27, 2024, 12:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.