ETV Bharat / state

ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువయ్యేలా మార్పులు రావాలి : సీజేఐ డి.వై చంద్రచూడ్ - cji on court in hyderabad - CJI ON COURT IN HYDERABAD

CJI Laid Foundation Stone for Court Building in Hyderabad : మారిన కాలంతో పాటు కోర్టుల్లోనూ మార్పులు వస్తున్నాయని, అలానే ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువయ్యేలా మార్పులు రావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ఆకాంక్షించారు. ఇవాళ రాజేంద్రనగర్‌లో నూతన హైకోర్టు భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు.

CJI on Court Building in Hyderabad
CJI Laid Foundation Stone for Court Building in Hyderabad
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 27, 2024, 9:34 PM IST

CJI Laid Foundation Stone for Court Building in Hyderabad : సత్వర న్యాయం కావాలని యువభారతం ఆశిస్తోందని, సమాజంలోని అన్ని వర్గాలకు కోర్టులు చేరువ కావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. భారత్‌లో యువత సంఖ్య చాలా ఎక్కువగా ఉందని, వేగంగా మార్పులు కోరుకుంటున్నారని అన్నారు. ఇవాళ రాజేంద్రనగర్‌లో నూతన హైకోర్టు భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కింది కోర్టుల్లోనే కాదు హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత ఉందని అన్నారు. ఇటీవల ఈ కోర్టు పథకంలో భాగంగా పలుచోట్ల ఈ సేవ కేంద్రాలు ఏర్పాటు చేశారని తెలిపారు.

CJI on Court Building in Hyderabad : సాంకేతిక యుగంలో కోర్టు కార్యకలాపాలకు ఇంటర్నెట్‌ వాడుకోవాలని సీజేఐ చంద్రచూడ్ సూచించారు. బ్రిటీష్‌ కాలంలో కోర్టులు సార్వభౌమత్వాన్ని కలిగి ఉండేవని, మారిన కాలంతో కోర్టుల్లోనూ మార్పులు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువయ్యేలా మార్పులు రావాలని ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో కొత్త హైకోర్టు కోసం చొరవ తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు సీజేను అభినందిస్తున్నట్లు సీజేఐ పేర్కొన్నారు. కొత్త భవనంలో స్త్రీలు, దివ్యాంగులు వంటి విభిన్న వర్గాలకు సౌకర్యాలుండాలన్న ఆయన, జిల్లా కోర్టుల్లో ఎక్కువగా మహిళలు నియమితులవుతున్నారని తెలిపారు.

High Court New building in Hyderabad : న్యాయవ్యవస్థల విలువలు పెంపొందించేలా సీనియర్లు కృషి చేయాలని సీజేఐ సూచించారు. త్వరలోనే హైకోర్టు ప్రారంభోత్సవం జరుపుకుంటామని ఆశించారు. నూతన హైకోర్టు భవన శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర హైకోర్టు జస్టిస్ ఆలోక్ అరాధే, న్యాయమూర్తులతో పాటు సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్‌ నర్సింహ, జస్టిస్‌ సంజయ్ కుమార్, జస్టిస్‌ ఎస్.వి.భట్, తదితరులు హాజరయ్యారు.

'ఈ కోర్టు పథకంలో భాగంగా ఈ సేవ కేంద్రాలు పలుచోట్ల మొత్తం 32 జిల్లాల్లో ఏర్పాట్లు చేశాం. మేము ఎందుకు అంత ఈ సేవ కేంద్రాలపై దృష్టి సారిస్తున్నాం. ఇది ఫేజ్​ ఈ కోర్ట్స్​ ప్రాజెక్ట్​, దీనిపై రూ. 7000 కోట్లు ఖర్చు కేటాయించాం. సంవత్సరాని సమాజం యువశక్తితో పుంజుకుంటోంది. మౌలికి సదుపాయాలు ఉంటే ఇంకా మెరుగా పని చేస్తామని నేను నమ్ముతా. సమాజంలోని అన్ని వర్గాలకు కోర్టులు చేరువ కావాలి'-జస్టిస్ డి.వై చంద్రచూడ్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువయ్యేలా మార్పులు రావాలి : సీజేఐ

నూతన హైకోర్టు భవనానికి నేడు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ శంకుస్థాపన - TS NEW HIGH CORT building
హైకోర్టు నూతన భవన నిర్మాణానికి మరో ముందడుగు - న్యాయశాఖ పేరుపై ఆ 100 ఎకరాల రిజిస్ట్రేషన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.