Boy life Saved Kims Cuddles Doctors In Hyderabad : ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ ప్రాంతానికి చెందిన 12 ఏళ్ల బాలుడికి అరుదైన ఇన్ఫెక్షన్ సోకింది. దీని కారణంగా తీవ్రంగా జ్వరం, ఫిట్స్, మెదడులో ప్రెషర్ తగ్గిపోవడం లాంటి సమస్యలు తలెత్తి, చివరకు తన సొంత తల్లిదండ్రులను కూడా గుర్తుపట్టలేని పరిస్థితికి చేరాడు. బాలుడిని తొలుత బాలుడిని అక్కడ ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.
అక్కడ బాలుడి పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్‌లోని కిమ్స్ కడల్స్ ఆస్పత్రికి సమాచారం ఇచ్చారు. దీంతో కిమ్స్ కడల్స్ కొండాపూర్ ఆస్పత్రికి చెందిన వైద్యులు చార్టర్డ్ విమానంలో రాయ్‌పూర్ వెళ్లి అక్కడి నుంచి బాబును హైదరాబాద్‌కు తీసుకొచ్చి చికిత్స అందించారు. దీనికి సంబంధించిన వివరాలను కిమ్స్ కడల్స్ ఆస్పత్రి కొండాపూర్‌కి చెందిన పీడియాట్రిక్స్ విభాగం క్లినికల్ డైరెక్టర్, డాక్టర్ పరాగ్ శంకర్‌రావు డెకాటే వివరాలను తెలిపారు.
బాబుకు తీవ్రమైన జ్వరం, ఫిట్స్, మెదడులో ప్రెషర్ తగ్గిపోవడం లాంటి సమస్యలు వచ్చాయని డాక్టర్ డెకాటే తెలిపారు. దాంతో ఛత్తీస్‌గఢ్ వైద్యులు మెరుగైన చికిత్స కోసం మమ్మల్ని సంప్రదించారని అన్నారు. వెంటనే తాము రాయ్‌పూర్ వెళ్లేలోపు అతడికి ఫిట్స్ పెరగడం, బీపీ తగ్గిపోవడం, బాగా మత్తుగా ఉండిపోయి, ఊపిరి కూడా అందని పరిస్థితి వచ్చిందన్నారు. హైదరాబాద్ నుంచి వెళ్లగానే ముందుగా ఆ బాబుకు వెంటిలేటర్ పెట్టి, పరిస్థితిని కొంత మెరుగుపరిచామని పేర్కొన్నారు.
మెదడులో ప్రెషర్, ఫిట్స్ సమస్యలు తగ్గించేందుకు ముందు కొన్ని మందులు ఇచ్చామని తర్వాత అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్‌కు తీసుకొచ్చామని తెలిపారు. ఇలా విమానంలో తీసుకురావడానికి తమ పీడియాట్రిక్ ఐసీయూ కన్సల్టెంట్ డాక్టర్ తరుణ్ సాయపడ్డారని తెలిపారు. ఆ బాలుడు కిమ్స్ ఆస్పత్రిలో 9 రోజులు ఉన్నాడని మధ్యలో బ్రెయిన్ ప్రెషర్ పెరిగి, ఫిట్స్ వచ్చాయని అన్నింటినీ తగిన మందులతో నయం చేశామని పేర్కొన్నారు.
"అతడికి వచ్చిన రికెట్షియల్ ఇన్ఫెక్షన్ అనేది రాయ్‌పూర్ ప్రాంతంలో చాలా అరుదు. దీనివల్ల అతడికి మెదడులో మెర్స్ అనే సమస్య వచ్చింది. అతడికి తర్వాత కాలేయం, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చినా వాటిని మందులతో నయం చేశాం. ఇక్కడ చేరిన నాలుగోరోజే వెంటిలేటర్ తీసేశాం. తొమ్మిదోరోజుకు పూర్తిగా నయం కావడంతో డిశ్చార్జి చేశాం” -పరాగ్ డెకాటే, డాక్టర్
దేశంలోని ఏ ప్రాంతంలో ఎంత సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నవారికైనా చికిత్స చేయగల సామర్థ్యం కిమ్స్ కడల్స్ ఆస్పత్రికి ఉందని డాక్టర్ అవినాష్, డాక్టర్ కళ్యాణ్ (పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్) తెలిపారు. ఇక్కడ చాలా అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్నాయని చెప్పారు.
ఎయిర్ అంబులెన్స్ అనేది కొంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే గానీ, ప్రాణాలకంటే ఏదీ ఎక్కువ కాదు. అత్యాధునిక సదుపాయాలు లేని నగరాల నుంచి అవి ఉన్నచోటుకు సరైన సమయానికి సమర్థమైన చికిత్స కోసం తీసుకురావడం కీలకం. తొలిసారి ఎక్మో పెట్టి ఒక పాపను విమానంలో ఇక్కడకు తీసుకొచ్చి నయం చేశాం. ఇలా విమానంలో తీసుకొచ్చిన వాటిలో ఇది రెండో కేసు. -పరాగ్ డెకాటే, డాక్టర్
బెంగళూరు డాక్టర్లు చేతులెత్తేస్తే - అనంతపురం డాక్టర్లు ప్రాణం నిలిపారు - Rare Surgery to Pancreas
ఎక్మోతో 18 నెలల పాప ప్రాణాలు కాపాడిన కిమ్స్ కడల్స్ వైద్యులు - 18 Months Baby Survives with Ekmo