Chandrababu Naidu Oath as New CM of Andhra Pradesh : ఏపీ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12న ఉదయం 11.27 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్డీయే కూటమి ముఖ్యనేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉన్నందున, ఎయిమ్స్ సమీపంలోని స్థలాన్ని ముందుగా పరిశీలించారు.
ఆ ప్రాంతం అనువుగా లేక పోవడంతో గన్నవరంలో మరో ప్రాంతాన్ని పరిశీలించారు. గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణస్వీకార కార్యక్రమం ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. సభావేదిక నిర్మాణం కోసం ఇప్పటికే 12 లారీలలో సామగ్రిని తీసుకొచ్చారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టి.డి.జనార్దన్, మంతెన సత్యనారాయణ రాజు, పెందుర్తి వెంకటేశ్ తదితరులు సభా స్థలాన్ని పరిశీలించారు.