ETV Bharat / state

నాలుగు నెలల క్రితం డీఎస్సీ నోటిఫికేషన్ - సబ్జెక్టులవారీగా షెడ్యూల్ ప్రకటించేదెన్నడో? - TELANGANA DSC EXAM SCHEDULE 2024 - TELANGANA DSC EXAM SCHEDULE 2024

TG DSC TRT Recruitment 2024: డీఎస్సీ పరీక్షలు జులై 17 నుంచి 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. అయినప్పటికీ, డీఎస్సీ పరీక్షలకు సంబంధించి విద్యాశాఖ సబ్జెక్టులవారీగా పూర్తిస్థాయి షెడ్యూలును విడుదల చేయలేదు. దీంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు పరీక్షలు వాయిదా వేయాలని కొత్తగా టెట్ పాస్అ యిన అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.

TG DSC TRT Recruitment 2024
TG DSC TRT Recruitment 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 27, 2024, 7:02 AM IST

Telangana DSC Schedule Issue 2024 : ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న డీఎస్సీ పరీక్షలకు సంబంధించి విద్యాశాఖ సబ్జెక్టులవారీగా పూర్తిస్థాయి షెడ్యూలును విడుదల చేయలేదు. దీంతో ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. జులై 17 నుంచి 31వ తేదీ వరకు పరీక్షలను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించేందుకు, విద్యాశాఖ తాత్కాలిక షెడ్యూలును గత ఫిబ్రవరిలోనే ప్రకటించింది. తుది తేదీలు మాత్రం ప్రకటించలేదు.

పూర్తి స్థాయి తేదీలను ఎప్పుడు ప్రకటిస్తుందోనని అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు, ఇటీవల కొత్తగా టెట్‌ ఉత్తీర్ణులైనవారు, పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు సమయం సరిపోదని, కొంతకాలంపాటు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. డీఎస్సీని ఆగస్టు 15 నెల తర్వాత నిర్వహించాలని డీఎస్సీ హెల్ప్‌లైన్‌ డెస్క్‌కు పెద్దసంఖ్యలో అభ్యర్థులు ఈ-మెయిళ్ల ద్వారా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యాశాఖ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

2.79 లక్షల దరఖాస్తులు : రాష్ట్రంలో మొత్తం 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సంబంధించి, ఫిబ్రవరి 28న పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. పరీక్షలకు దరఖాస్తుల గడువు ఈ నెల 20వ తేదీతో ముగిసింది. మొత్తం 2.79 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అభ్యర్థులపరంగా చూస్తే, సుమారు 2 లక్షల వరకు ఉంటారని తెలుస్తోంది. డీఎస్సీ పరీక్షలను జులై 17 నుంచి 31 మధ్య నిర్వహిస్తామని విద్యాశాఖ నోటిఫికేషన్‌లో విద్యాశాఖ తెలిపింది. ఇది తాత్కాలిక షెడ్యూలుగా తెలిపింది. అంటే ఆ తేదీల్లో జరగొచ్చు లేదా మారొచ్చు అని అర్థం.

రాష్ట్రంలో డీఎస్సీకి భారీగా దరఖాస్తులు - ఒక్కో పోస్టుకు ఎంతమంది పోటీ పడుతున్నారంటే? - Telangana DSc Exam 2024

ఈ నెల 12న టెట్‌ ఫలితాలు వెలువడ్డాయి. అప్పుడుకూడా డీఎస్సీ పూర్తిస్థాయి షెడ్యూలును అధికారులు ప్రకటించలేదు. టెట్‌లో కొత్తగా పాసైన విద్యార్థులు, తాము డీఎస్సీకి సన్నద్ధం అయ్యేందుకుగాను కనీసం నెల రోజులపాటు పరీక్షలను వాయిదా వేయాలని కోరుతున్నారు. అందులో భాగంగా ఎమ్మెల్యేలు, మంత్రులకు పలువురు వినతిపత్రాలు ఇస్తున్నారు. మరోవైపు, గతంలో టెట్‌ ఉత్తీర్ణులైనవారిలో కూడా అధిక శాతం మంది కనీసం నెల రోజులపాటు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. డీఎస్సీలో వర్తమాన వ్యవహారాలకు 10, విద్యా దృకృథాల(పర్‌స్పెక్టివ్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌)కు 10 మార్కుల చొప్పున కేటాయించారు. వాటిని చదివేందుకు సమయం పడుతుందని అభ్యర్థులు పేర్కొంటున్నారు.

విద్యాశాఖ గతంలో ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 17 నుంచి పరీక్షలు ప్రారంభమైతే, అభ్యర్థులకు ఇంకా 20 రోజుల సమయం మాత్రమే ఉంది. కానీ, అధికారులు ఇప్పటివరకు సబ్జెక్టుల వారీగా పరీక్షల తేదీలు ప్రకటించలేదు. మరోవైపు, పాఠశాల విద్యాశాఖ అధికారులు గత కొంతకాలంగా ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియలో భాగమయ్యారు. అందువల్ల డీఎస్సీ పూర్తిస్థాయి షెడ్యూలుపై దృష్టి పెట్టలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. టెట్‌ ఫలితాలు విడుదల చేసిన రోజే పూర్తి షెడ్యూలు ప్రకటించి ఉంటే గందరగోళం తలెత్తేది కాదని రాష్ట్ర బీఎడ్, డీఎడ్‌ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు రావుల రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. పరీక్షలను వాయిదా వేయడంతోపాటు ఉపాధ్యాయుల పదోన్నతులతో ఏర్పడిన ఖాళీలను, డీఎస్సీ నోటిఫికేషన్‌లో కలిపి భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు.

రెండు, మూడు రోజుల్లో షెడ్యూలు! షెడ్యూలు ఖరారుపై కసరత్తు జరుగుతోందని అధికారులు తెలిపారు. ఒక జిల్లా అభ్యర్థులు అదే జిల్లాలో ఒకే రోజు పరీక్షలు రాసేలా కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని విద్యాశాఖవర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఆన్‌లైన్‌ కేంద్రాల అందుబాటు వివరాలను టీసీఎస్‌ అయాన్‌ ప్రతినిధులు అందించారని తెలిపారు. 2-3 రోజుల్లోనే తేదీలు ప్రకటిస్తామని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. పరీక్షల వాయిదా ఉండదని, ముందుగా ప్రకటించినట్లుగానే, షెడ్యూలు ప్రకారమే జరుగుతాయని స్పష్టం పేర్కొన్నారు. వాయిదా వేస్తే 10-15 రోజులపాటు ఆన్‌లైన్‌ పరీక్షల నిర్వహణకు మళ్లీ స్లాట్లు దొరకటం కష్టమవుతుందని వెల్లడించారు.

మెగా డీఎస్సీకి ఏపీ కేబినెట్ ఆమోదం - మరికొన్ని కీలక నిర్ణయాలు ఇవే! - AP CABINET APPROVES MEGA DSC

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.