ETV Bharat / state

ఏంటీ! అంబులెన్సులు, ఆటోలు, బైకుల్లో 'గొర్రెల పంపిణీ' చేశారా? - కాగ్​ సంచలన రిపోర్ట్

CAG Report on Telangana : గొర్రెల పంపిణీ పథకం అమల్లో మోసాలు జరిగినట్లు కంప్రోల్టర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) పేర్కొంది. మోటార్ బైకులు, అంబులెన్సుల్లోనూ గొర్రెల రవాణా జరిగినట్లు గుర్తించింది. రైతుబీమా కింద క్లెయిమ్‌లు పొందిన వారి పేర్లు కూడా గొర్రెల పథకం లబ్ధిదారుల జాబితాలో ఉన్నారని, చెవులకు వేసే ట్యాగ్‌లు కూడా పునరావృతం అయ్యాయని తెలిపింది. అలాగే రెండు పడక గదుల ఇళ్ల కోసం తీసుకున్న రుణాలను కూడా దారి మళ్లించారని ఆక్షేపించింది. లబ్ధిదారుల జాబితా ఖరారు చేయకపోవడంతో తద్వారా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను కోల్పోవాల్సి వచ్చిందని కాగ్ వెల్లడించింది.

CAG Report on Telangana
CAG Report on Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 16, 2024, 11:11 AM IST

Updated : Feb 16, 2024, 12:03 PM IST

CAG Report on Telangana : గొర్రెల పెంపకం అభివృద్ధి పథకం అమలులో మోసాలు జరిగినట్లు కాగ్‌ అనుమానం వ్యక్తం చేసింది. ఏడు జిల్లాల్లో మచ్చుకు తనిఖీ చేయగా రూ.253.93 కోట్ల మేర సందేహాస్పద లావాదేవీలతో పాటు తీవ్ర లోపాలను గమనించినట్లు పేర్కొంది. నకిలీ రవాణా ఇన్‌వాయిస్‌లు, నకిలీ వాహనాలు, వాహనాల్లో సామర్థ్యానికి మించి గొర్రెల యూనిట్ల రవాణా, గొర్రెలకు నకిలీ ట్యాగ్‌ల కేటాయింపు, తదితరాలు ఉన్నట్లు కాగ్ పేర్కొంది.

CAG on Sheep Distribution Telangana : సంగారెడ్డి జిల్లాలో ఒక మోటార్‌ బైక్‌పై 126 గొర్రెలు రవాణా చేసినట్లు, నల్గొండ జిల్లాలో ఒక ఆటోలో 126 గొర్రెలు రవాణా చేసినట్లు కాగ్‌ తనిఖీల్లో తేలింది. అంబులెన్స్‌లలోనూ, అగ్నిమాపక వాహనాల్లోనూ, నీళ్ల ట్యాంకర్లలో, మొబైల్‌ కంప్రెసర్‌లలో గొర్రెలు రవాణా చేసినట్లు చూపారని పేర్కొంది. ఒకే వాహనం ఒకే రోజు శ్రీకాకుళం, కడప జిల్లా నుంచి మహబూబ్‌నగర్‌ జిల్లాకు గొర్రెలు తరలించినట్లు చూపారని కాగ్ ఆడిట్‌లో తెలిపింది.

ఆదాయం పెరిగినా రెవెన్యూ మిగులు సాధించడంలో రాష్ట్రం విఫలం - కాగ్​ రిపోర్టు

2017-18 నుంచి 2019-20 మధ్య కాలంలో ఐదు జిల్లాల్లో 96,299 గొర్రెల యూనిట్లు (Sheep Distribution)పంపిణీ చేసినట్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారని కాగ్ వివరించింది. అయితే దాణా మాత్రం కేవలం 29,616 యూనిట్లకు మాత్రమే సరఫరా చేసినట్లు తేలిందని పేర్కొంది. దాదాపు 70శాతం యూనిట్లు దాణా తీసుకోలేదంటే గొర్రెల సరఫరాలో పలు మోసాలు జరిగినట్లు అనుమానించాల్సి వస్తుందని కాగ్‌ అభిప్రాయపడింది.

Sheep Distribution Scam in Telangana : గొర్రెను గుర్తుపట్టేలా వేసే ట్యాగులు కూడా మోసాలు జరిగినట్లు నిర్ధారిస్తున్నాయని కాగ్‌ తెలిపింది. మొత్తం 80.37 లక్షల ట్యాగ్‌ సంఖ్యల్లో రెండు లక్షలకు పైగా ట్యాగ్‌ సంఖ్యలు రెండు నుంచి 34 సార్లు పునరావృతం అయినట్లు పేర్కొంది. ఐదు శాతానికి పైగా గొర్రెల చెవులకు కోతలు, చిల్లులు ఉన్నాయంటే సరఫరా చేసిన గొర్రెలనే మళ్లీ చేసినట్లు కనిపిస్తుందని వ్యాఖ్యానించింది.

మరోవైపు బీమా పథకం కింద క్లెయిమ్‌లు పొందిన 860 మంది రైతుల పేర్లు గొర్రెల పథకం లబ్ధిదారుల జాబితాలో ఉన్నట్లు తేలిందని వివరించింది. అయితే వారి వివరాలు వెబ్‌సైట్‌లో కూడా లేకపోవడంతో యూనిట్లు ఇచ్చే సమయానికి వారు వాస్తవంగా జీవించి ఉన్నారా లేరా అనే విషయాన్ని నిర్ధారించలేకపోయినట్లు తెలిపింది. లబ్ధిదారులు మరణించిన 14 నుంచి 36 నెలలు గడిచిన తర్వాతే వారి పేరుతో మంజూరు ఉత్తర్వులు ఇచ్చినట్లు పేర్కొంది. లబ్ధిదారుల వారీగా దస్త్రాలు నిర్వహించని కారణంగా వారి లావాదేవీలను నిర్ధారించలేకపోయిందని, దీంతో నిధుల దుర్వినియోగమైతే గుర్తించలేని ప్రమాదముందని కాగ్‌ ఆందోళన వ్యక్తం చేసింది.

అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ పగుళ్లు.. కాగ్‌ నివేదికలో సంచలన విషయాలు

CAG on Double Bedroom Houses Telangana : పేదలకు గౌరవప్రదమైన నివాసం ఉండేలా వందశాతం రాయితీతో కూడిన రెండు పడక గదుల ఇళ్ల పథకం ఆర్థిక నిర్వహణలో, లోటుపాట్లు ఉన్నాయని కంప్రోల్టర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తెలిపింది. 2021 మార్చితో ముగిసిన సంవత్సరానికి సామాన్య, సామాజిక, ఆర్థిక రంగాలపై ఇచ్చిన నివేదికలో తొమ్మిది ప్రభుత్వ శాఖల్లో పాటించిన నిబంధనలు, లావాదేవీల అంశాలను ప్రస్తావించింది. ఇండ్ల నిర్మాణం కోసం తీసుకున్న రుణ మొత్తాన్ని కొంత కాలం పాటు నిరర్థకంగా డిపాజిట్లలో ఉంచారని, ఆ నిధులను ఇతర సంస్థలు, పథకాలకు మళ్లించినట్లు కాగ్‌ పేర్కొంది.

దీంతో ఇళ్ల పథకానికి (Double Bedroom Houses) సంబంధం లేని అప్పులను కూడా రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ తిరిగి చెల్లించాల్సి వచ్చిందని కాగ్‌ తప్పుపట్టింది. జీహెచ్‌ఎంసీ మంజూరు చేసిన లక్ష ఇళ్లలో 48,178 ఇళ్ల నిర్మాణం పూర్తైందని, మరో 45,735 ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉందని పేర్కొంది. ఆరేళ్లు గడిచినప్పటికీ నిర్మాణం పూర్తైన ఇళ్ల శాతం లక్ష్యంలో 50 శాతం కంటే తక్కువగా ఉందని, లబ్ధిదారుల గుర్తింపులో ప్రభుత్వ వైఫల్యం కారణంగా రూ.3,983 కోట్లు వృథా అయినట్లు కాగ్‌ వెల్లడించింది.

మరోవైపు తెలంగాణ సర్కార్ అర్హులైన లబ్ధిదారుల జాబితాను గుర్తించినా వారిని ఎంపిక చేయలేదని కాగ్ వివరించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద నిధులు విడుదల చేయలేదని పేర్కొంది. తద్వారా కేంద్రం నుంచి వెయ్యి కోట్లకు పైగా సాయాన్ని కోల్పోయిందని ఆక్షేపించింది. నాలుగేళ్లు గడిచినప్పటికీ పేదలకు రెండు పడక గదుల ఇళ్లు అందించాలన్న లక్ష్యం నెరవేరలేదని కాగ్ (CAG) తెలిపింది.

ప్రయాణికుల నుంచి మెట్రో రైలు అధిక ఛార్జీలు వసూలు చేసింది : కాగ్

గత ప్రభుత్వ ఆసరా పింఛన్ల పంపిణీలో అక్రమాలు జరిగాయి : కాగ్​

Last Updated : Feb 16, 2024, 12:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.