ETV Bharat / state

ఓటు వేసేందుకు సొంతూళ్లకు ఓటర్లు - టోల్​ప్లాజాల వద్ద వాహనాల బారులు - Public Rush For Elections - PUBLIC RUSH FOR ELECTIONS

Public Rush For Polls : ఈ నెల 13న ఎన్నికలు ఉండటంతో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు సొంతూళ్లకు తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద రద్దీ నెలకొంది. ఈ సాయంత్రం నుంచి రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. సొంత వాహనాలతో ఊరెళ్లే వారితో టోల్​ప్లాజాల వద్ద అధిక సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి.

Public Rush For Elections
Public Rush For Elections (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 11, 2024, 4:37 PM IST

ఎన్నికల సందర్భంగా సొంతూళ్లకు తరలివెళ్తున్న ఓటర్లు- టోల్​ప్లాజాల వద్ద బారులు తీరిన వాహనాలు (ETV Bharat)

Public Rush For Elections : రాష్ట్రంలో ఎన్నికల పండగ సమీపిస్తుండటంతో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు వారి సొంత గ్రామాల బాటపడుతున్నారు. దీంతో ఒక్కసారిగా టోల్​ప్లాజాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద రద్దీ నెలకొంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కోర్లపహాడ్ టోల్​ప్లాజాల వద్ద వాహనాల రద్దీ ఏర్పడింది. ఎన్నికల వేళ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తెలంగాణలో ఉన్న ఏపీ ఓటర్లు సొంతూళ్లకు తరలివెళ్తున్నారు.

బారులు తీరిన వాహనాలు : సొంతూళ్లకు ప్రజలు వెళ్తున్నవేళ ఎక్కడిక్కడ రద్దీ నెలకొంది. దీంతో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. వరుస సెలవులు రావడంతో కార్లు, బస్సుల్లో ప్రయాణికులు తరలివెళ్తున్నారు. మండే ఎండలో కూడా ఇంతగా రద్దీ ఉంటే ఈ సాయంత్రం నుంచి వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది.

కష్టతరమైన ప్రయాణం : ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంత ఊర్లకు వెళ్లే వారికి ప్రయాణం కష్టతరంగా మారింది. ముందుగా బుక్ చేసుకుందామనుకున్నప్పటికీ అప్పటికే బస్సు టికెట్లు బుక్ అయ్యి ప్రస్తుతం ఏదో విధంగా వెళ్దామని బస్సుల రైళ్ల వద్దకు చేరుకుంటున్నారు. కూకట్​పల్లి నుంచి ఆంధ్రప్రదేశ్​లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెళ్తున్న వారికి ఎన్నికల సంఘం ఇలాంటి క్లిష్టమైన సమయంలో రవాణా ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడ్డారు.

దారులన్నీ ఏపీవైపే - హైదరాబాద్​ - విజయవాడ రహదారిపై భారీగా వాహనాల రద్దీ - Vehicles traffic at Panthangi toll

People Facing Problems : ప్రయాణికులు పెరగడంతో 2 తెలుగు రాష్ట్రాల ఆర్టీసీలు ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నాయి. ఏపీకి ఇప్పటికే ప్రకటించిన బస్సుల్లో సీట్లన్నీ రిజర్వ్‌ అయ్యాయి. ఉప్పల్ నుంచి దాదాపు 300 బస్సులను ఆంధ్రప్రదేశ్​తో పాటు వరంగల్, హనుమకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, తదితర ప్రాంతాలకు బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు చెప్పారు. చాలామంది ముందస్తుగా రిజర్వేషన్లు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.

ఓటు వేసేందుకు సొంతూరి బాట - ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిట - Public Rush For AP Polls

ఓటేసేందుకు సొంతూరు బాటపట్టిన జనాలు - ప్రత్యేక బస్సులు నడుపుతున్న టీఎస్ఆర్టీసీ - TSRTC Increased Buses For Voters

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.