ETV Bharat / state

బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్​ - విచారణ గురువారానికి వాయిదా - MLAs Disqualification Petition

BRS MLA's Disqualification Hearing Adjourned : పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పార్టీ​ దాఖలు చేసిన అనర్హత పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న న్యాయస్థానం విచారణను గురువారానికి వాయిదా వేసింది.

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 8, 2024, 4:23 PM IST

Updated : Jul 8, 2024, 10:58 PM IST

BRS MLAs Disqualification Petition
BRS MLA's Disqualification Hearing Adjourned (ETV Bharat)

BRS MLAs Disqualification Petition : బీఆర్ఎస్​ నుంచి కాంగ్రెస్​లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్​కు ఆదేశాలిచ్చే పరిధి ఈ కోర్టుకు లేదంటూ ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఇదే విషయాన్ని సుప్రీం కోర్టు అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసమం చెప్పిందని తెలిపింది.

బీఆర్ఎస్​ తరఫున ఎన్నికై కాంగ్రెస్​లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్‌రావులపై అనర్హతా వేటు వేయాలంటూ గులాబీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ గౌడ్ వేర్వేరు పిటీషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ బీ విజయ్​సేన్ రెడ్డి మరోసారి విచారణ చేపట్టారు. అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ స్పీకర్​కు ఆదేశాలిచ్చే పరిధి హైకోర్టుకు లేదంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందన్నారు.

గత తీర్పు పరిశీలనలు : పిటిషనర్లు కేశం మెగాచంద్రసింగ్ కేసులో ముగ్గురు జడ్జీలు ఇచ్చిన తీర్పును ఆధారంగా చేసుకొని వాదనలు వినిపిస్తున్నానన్నారు. అయితే అయిదుగురు జడ్జీలు ఇచ్చిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందన్నారు. అంతేకాకుండా గతంలో తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్​లోకి ఫిరాయించారంటూ తలసాని శ్రీనివాస్​ యాదవ్​పై అనర్హత వేటు వేయకుండా స్పీకర్ జాప్యం చేస్తున్నారని ఎర్రబెల్లి దయాకర్ రావు దాఖలు చేసిన పిటిషన్​పై తీర్పు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించిందన్నారు.

High Court On MLAs Disqualification : రాజ్యాంగం ప్రకారం పార్టీ ఫిరాయింపులకు సంబంధించి స్పీకర్ ముందున్న పిటిషన్లలో సుప్రీంకోర్టు, హైకోర్టులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్నారు. చట్టసభ నుంచి సభ్యుడి సస్పెన్షన్ లేదా శాశ్వత బహిష్కరణ, అనర్హత వేటు వంటి నిర్ణయాలన్నీ స్పీకర్ పరిధిలోనివని, ఇందులో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోరాదన్నారు.

తదుపరి వాదనల నిమిత్తం విచారణను 11వ తేదీకి వాయిదా కోరగా పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్​రావు జోక్యం చేసుకుంటూ విచారణలో జాప్యానికే వాయిదా కోరుతున్నారన్నారు. మరిన్ని ఫిరాయింపులు జరగకుండా ఉండాలంటే దీనిపై నిర్ణయం సత్వరం వెలువడాల్సి ఉందన్నారు. ఈ దశలో ప్రతివాదుల తరఫు సీనియర్ న్యాయవాది బీ మయూర్రెడ్డి జోక్యం చేసుకుంటూ బయట జరిగే ఊహాజనిత అంశాల ఆధారంగా విచారణలో హడావుడి సరికాదన్నారు. వాదోపవాదనలు విన్న హైకోర్టు విచారణను 11వ తేదీకి వాయిదా వేసింది.

పోచారం, సంజయ్​ అనర్హత పిటిషన్​పై శాసనసభ స్పీకర్​ స్పందించరా?​​ : జగదీశ్​ రెడ్డి - Jagadish Reddy on Speaker prasad

మల్లారెడ్డికి బిగ్​షాక్​ - 'యూనివర్సిటీ ఆఫ్​ క్యాంపస్​'పై హైకోర్టు కీలక ఆదేశాలు - TELANGANA HC ON MALLAREDDY UNI

Last Updated : Jul 8, 2024, 10:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.