ETV Bharat / state

నేటితో ముగియనున్న బీఆర్‌ఎస్ లోక్‌సభ సన్నాహక సమావేశాలు - బీఆర్ఎస్‌ లోక్‌సభ సమావేశాలు 2024

BRS Lok Sabha Meetings 2024 : బీఆర్ఎస్ లోక్‌సభ సన్నాహక సమావేశాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. శాసనసభ ఎన్నికల ఓటమిని సమీక్షిస్తూనే, పార్లమెంట్ ఎన్నికల కార్యాచరణపై దృష్టి సారించింది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల నుంచి అభిప్రాయాల సేకరణతోపాటు సూచనలు స్వీకరిస్తున్నారు. వాటన్నింటిని క్రోడీకరించిన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, శిక్షణా తరగతులు నిర్వహించేందుకు గులాబీ పార్టీ సిద్ధమవుతోంది. త్వరలోనే బూత్‌స్థాయి మొదలు పార్టీ పొలిట్‌బ్యూరో వరకు కొత్త కమిటీలు ఏర్పాటు కానున్నాయి.

BRS LokSabha Preparatory Meetings
BRS LokSabha Preparatory Meetings
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 22, 2024, 7:14 AM IST

నేటితో ముగియనున్న బీఆర్‌ఎస్ లోక్‌సభ సన్నాహక భేటీలు

BRS Lok Sabha Meetings 2024 : శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలై అధికారానికి దూరమైన భారత్ రాష్ట్ర సమితి, సార్వత్రిక ఎన్నికల కోసం కసరత్తు కొనసాగిస్తోంది. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది. ఈనెల మూడో తేదీ నుంచి ప్రారంభమైన ఈ సమావేశాలు రెండు విడతలుగా జరగుతున్నాయి. ఇవాళ నల్గొండ నియోజకవర్గ భేటీతో సమీక్షలు ముగియనున్నాయి. ప్రతి శాసనసభ నియోజకవర్గం నుంచి దాదాపుగా వంద మంది చొప్పున ప్రజాప్రతినిధులు, మాజీలు, ముఖ్య నేతలు, ఇతర కార్యకర్తలను సమావేశాలకు ఆహ్వానించారు.

BRS Focus on Lok Sabha Elections 2024 : పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో (KTR) పాటు సీనియర్ నేతలు హరీశ్‌రావు, కేశవరావు, మధుసూదనాచారి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, కడియం శ్రీహరి, జగదీశ్‌రెడ్డి వారితో సమావేశమవుతున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణాలను తెలుసుకుంటూనే భవిష్యత్ కార్యాచరణపై సమావేశాల్లో దృష్టి సారిస్తున్నారు. ముఖ్య నేతలతోపాటు క్షేత్రస్థాయి నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు సమావేశంలో మాట్లాడే అవకాశం ఇస్తున్నారు. వారి నుంచి అభిప్రాయాలు సేకరించడంతోపాటు సూచనలు, సలహాలు స్వీకరిస్తున్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో త్రిముఖ పోరు తప్పదు - గట్టిగా పోరాడాల్సిందే : కేటీఆర్

పదేళ్లపాటు అధికారంలో ఉన్న సమయంలో ఉద్యమకారులు, పార్టీ కార్యకర్తలను పట్టించుకోలేదన్న అంశమే ప్రతి సమావేశంలోనూ ప్రధానంగా వ్యక్తమవుతోంది. అధికారాన్ని అనుభవించిన నేతలు, క్షేత్రస్థాయి కార్యకర్తలను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కమిటీలు కేవలం నామామాత్రంగానే తయారయ్యాయని, పూర్తిగా ఎమ్మెల్యే కేంద్రంగా కార్యకలాపాలు సాగడం వల్ల తమకు ప్రాధాన్యం లేకుండా పోయిందని అభిప్రాయపడ్డారు.

ఆదివారం మల్కాజిగిరి నియోజకవర్గ సమావేశంలో కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన ప్రభుగుప్తా, ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన మణెమ్మ చేసిన ప్రసంగాలు నేతలను ఆకట్టుకున్నాయి. పార్టీ ఇంఛార్జ్‌లు అల్లుళ్ల పాత్రకు పరిమితం కారాదని అన్నారు. అధికారం, బాధ్యతలు అప్పగిస్తున్న అధిష్ఠానం, ఆ ఇంఛార్జులు పనిచేస్తున్నారో లేదో చూడాలని వ్యాఖ్యానించారు. సమావేశంలో కొంతమంది మాట్లాడుతుండగా మిగతా వారి నుంచి లిఖితపూర్వకంగా అభిప్రాయాలు తీసుకుంటున్నారు. వాటన్నింటినీ పార్టీ అధినేత కేసీఆర్‌కు (KCR) నివేదిస్తున్నారు.

కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేదాకా విడిచి పెట్టం : కేటీఆర్

BRS Focus on Parliament Poll 2024 : నేతలు, కార్యకర్తల నుంచి వస్తున్న అభిప్రాయాలను అధ్యయనం చేస్తున్న గులాబీ దళపతి, కొంతమందితో ఫోన్లోనూ మాట్లాడారు. అన్నింటిని విశ్లేషించిన అనంతరం పార్టీ నాయకత్వం భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయనుంది. సమావేశాల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా బీఆర్ఎస్‌ను సంస్థాగతంగా పటిష్టం చేయాలని నిర్ణయించారు. బూత్‌స్థాయి మొదలు రాష్ట్ర స్థాయి, పొలిట్ బ్యూరో వరకు అన్ని కమిటీలను పునర్‌వ్యవస్థీకరించాలని అన్ని స్థాయిల్లో అనుబంధ విభాగాలను కూడా ఏర్పాటు చేయాలని సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నారు.

త్వరలో కొత్త కమిటీలు : భారత్ రాష్ట్ర సమితికి 60 లక్షల మంది సభ్యులు ఉండగా, 20 నుంచి 30,000ల మంది వరకు కమిటీల్లో చోటు కల్పించాలని భావిస్తున్నట్లు సమాచారం. కమిటీలు ఏర్పాటు చేయడంతోపాటు వారికి దశల వారీగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. లోక్‌సభ ఎన్నికల కసరత్తులో భాగంగా తదుపరి శాసనసభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ నాయకత్వం సిద్ధమవుతోంది. ఒక్కో ఉమ్మడి జిల్లాలో రోజూ ఒక అసెంబ్లీ నియోజకవర్గ సమావేశం నిర్వహించి, శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేయాలని భావిస్తున్నారు. రాష్ట్ర స్థాయి నుంచి ముఖ్య నేతలు ఈ సమావేశాలకు హాజరయ్యేలా కార్యచరణ రూపొందించనున్నారు.

బీఆర్​ఎస్​ ఎంపీలు గెలవకపోతే పార్లమెంటులో తెలంగాణ పేరు అనామకం అవుతుంది : కేటీఆర్

పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్​ఎస్​ గెలిస్తేనే హక్కులను కాపాడుకోగలం : హరీశ్​ రావు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.