BRS Harish Rao On Chief Whip Issue : రాష్ట్రంలో రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారని, శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా పట్నం మహేందర్ రెడ్డి నియామకం ఇందుకు మరో ఉదాహరణ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభ్యుడు హరీశ్‌రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన మహేందర్ రెడ్డిని ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమించడం రాజ్యాంగ విరుద్ధమని, కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తోందని ఆక్షేపించారు. మండలిలో బిల్ పాస్ చేయించడం, ప్రభుత్వ బిజినెస్ జరిగేలా చూడడం చీఫ్ విప్ బాధ్యత అని, మహేందర్ రెడ్డి ఇప్పుడు ఎవరికి విప్ ఇస్తారని ప్రశ్నించారు.
Harish Rao Fires On Congress : ఆయన అధికార పార్టీ సభ్యులకు విప్ ఇస్తారా? లేక ప్రతిపక్ష పార్టీ సభ్యులకు విప్ ఇస్తారా? అని అడిగారు. బీఆర్ఎస్‌కు కూడా మండలిలో విప్ ఉంటారని, సభకు హాజరు, బిల్లుపై ఓటింగ్ సమయంలో బీఆర్ఎస్ విప్ కూడా పార్టీ సభ్యులకు విప్ ఇస్తారని హరీశ్‌రావు వివరించారు. ఇప్పుడు బీఆర్ఎస్ విప్ ప్రభుత్వ చీఫ్ విప్‌కు కూడా విప్ ఇస్తారని పేర్కొన్నారు. చీఫ్ విప్ ఇప్పుడు బీఆర్ఎస్ విప్ ప్రకారం నడుచుకుంటారా? అని ఆయన ప్రశ్నించారు. పీఏసీ ఛైర్మన్ విషయంలో కూడా ఇలాగే వ్యవహరించారని గుర్తు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు సంబంధం లేదు అన్నారని, ఇప్పుడు బీఆర్ఎస్‌కు చెందిన మహేందర్ రెడ్డికి ప్రభుత్వ చీఫ్ విప్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.
Harish Rao Comments On govt Chief whip : మహేందర్ రెడ్డిపై ఛైర్మన్ వద్ద ఇప్పటికే అనర్హత పిటిషన్ పెండింగ్‌లో ఉందన్న హరీశ్‌రావు, పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఛైర్మన్ బులెటిన్ ఇచ్చారని తెలిపారు. మహేందర్ రెడ్డిపై అనర్హత పిటిషన్‌కు ఇంతకు మించిన ఆధారం ఇంకా ఏం ఉంటుందని ప్రశ్నించారు. ఛైర్మన్ ఇచ్చిన బులెటిన్ అనర్హత పిటిషన్‌కు మరింత బలం చేకూర్చిందని, ఆ బులెటిన్‌ను కూడా అనర్హత పిటిషన్లో సాక్ష్యంగా చేరుస్తామని హరీశ్‌రావు చెప్పారు. ఎమ్మెల్సీ హోదాలోనే ఆగష్టు 15, సెప్టెంబర్ 17న మహేందర్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారని, మార్చ్ 15వ తేదీ నుంచే ప్రభుత్వ చీఫ్ విప్ అని బులెటిన్ ఇచ్చారని ఆక్షేపించారు. ఇతర పార్టీల వారిని మంత్రివర్గంలో తీసుకోరాదని రాజ్యాంగంలో ఎక్కడా లేదని హరీశ్‌రావు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పనులకు - హస్తం గుర్తు తీసేసి బుల్డోజర్ గుర్తు పెట్టుకోవాలి : హరీశ్ రావు