ETV Bharat / state

నేతల్లో భరోసా నింపుతూ, లోక్​సభ ఎన్నికలకు సిద్ధం చేస్తూ - 'కారు'ను తిరిగి ట్రాక్‌లోకి తీసుకొచ్చే పనిలో కేసీఆర్ - KCR Meeting With Leaders

BRS Focus on Lok Sabha Elections 2024 : నేతల్లో భరోసా నింపుతూ, లోక్​సభ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే పనిలో పడ్డారు గులాబీ దళపతి. గత అనుభవాలను ఉదహరిస్తూ, తిరిగి వారిని ప్రజాక్షేత్రంలోకి వెళ్లేలా సంసిద్ధుల్ని చేస్తున్నారు. రాజకీయాల్లో ఎంతటి వారికైనా ఏదో సందర్భంలో ఓటమి తప్పదని వివరిస్తూ శాసనసభ ఎన్నికల పరాజయం నుంచి వారిని బయటపడేసే ప్రయత్నం చేస్తున్నారు. అభ్యర్థిత్వాల విషయంలోనూ నేతలందరి అభిప్రాయాలు తీసుకొని ముందుకెళ్తున్నారు.

BRS President KCR Meeting With Leaders
BRS Meeting On Lok Sabha Elections 2024
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 5, 2024, 7:11 AM IST

లోక్‌సభ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే పనిలో కేసీఆర్‌

BRS Focus on Lok Sabha Elections 2024 : రాష్ట్రంలో పదేళ్ల పాటు అధికారాన్ని అనుభవించి, ఇప్పుడు ప్రతిపక్షంలోకి వెళ్లిన భారత రాష్ట్ర సమితి గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటుందనే చెప్పొచ్చు. ఓటమి నుంచి కోలుకోక ముందే పలువురు నేతలు పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. సిట్టింగ్ ఎంపీలతో పాటు జడ్పీ ఛైర్మన్లు, వివిధ స్థాయి ప్రజాప్రతినిధులు, మాజీలు, సీనియర్ నేతలు గులాబీ పార్టీని వీడుతున్నారు. కొందరు ఎన్నికల్లో పోటీకి విముఖత చూపుతున్నారు. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎప్పటికప్పుడు బీఆర్ఎస్​ను లక్ష్యంగా చేసుకొని ముందుకు సాగుతున్నాయి.

ఏమాత్రం అవకాశం వచ్చినా, కారు పార్టీని దెబ్బ తీయాలని చూడడంతో పాటు భవిష్యత్‌లో మనుగడ కష్టమంటూ వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. అనారోగ్యం నుంచి కోలుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కారును తిరిగి ట్రాక్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నాన్ని ప్రారంభించారు. త్వరలోనే జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు పార్టీని, నేతలను సంసిద్ధం చేసే పనిలో పడ్డారు. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ముఖ్య నేతలతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేస్తున్నారు.

లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన కేసీఆర్ - ఫస్ట్‌ లిస్ట్‌లో వీరికే ఛాన్స్

BRS President KCR Meeting With Leaders : రాజకీయాల్లో ఉన్న వారికి గెలుపు ఓటములు సహజమేనని, ఎన్టీఆర్ ఉదంతాన్ని కూడా కేసీఆర్‌ ప్రస్తావిస్తున్నారు. ఎన్నో మంచి పనులు చేసినప్పటికీ, ఎన్టీఆర్ 1989లో ఓటమి పాలయ్యారని, 1994లో మళ్లీ ఘన విజయం సాధించారని చెబుతూ నేతల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క ఓటమికే కుంగిపోవాల్సిన అవసరం లేదని, అలా కుంగిపోయి ఉంటే తాను తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేవాడినా అని ప్రశ్నిస్తున్నారు. కొందరు నేతలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, ఎందుకు డీలా పడుతున్నారని ప్రశ్నిస్తున్నారు.

బీఆర్ఎస్ చేసిన మంచి పనులను ప్రజలు మరచిపోరని, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల విసుగు ప్రారంభమైందని అంటున్నారు. నీళ్లు, విద్యుత్ అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్న కేసీఆర్, ప్రభుత్వం మారగానే సమస్యలు వస్తున్నాయంటే పాలకుల అవగాహనా లోపమేనని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ పరంగా పదేళ్ల పాటు ఎలాంటి ఇబ్బందులు రాలేదని, కాంగ్రెస్ వ్యవహారం అలా ఉండబోదని అన్నారు.

BRS President KCR On Lok sabha Elections 2024 : ప్రతిపక్షం రుచిని ప్రభుత్వానికి చూపుదామన్న కేసీఆర్, అంశాలను కూడా ప్రభుత్వమే ఇస్తుందని పేర్కొన్నారు. లోక్​సభ ఎన్నికలకు అభ్యర్థుల విషయమై కూడా ముఖ్య నేతల నుంచి సమావేశంలోనే అభిప్రాయాలు తీసుకుంటున్నారు. సిట్టింగ్ ఎంపీల విషయంలో సంతృప్తిగా ఉన్నారా? లేక మార్చాలా అని కూడా కేసీఆర్ నేతలను అడుగుతున్నారు. ఖమ్మం, మహబూబాబాద్ ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు నామ నాగేశ్వర రావు, మాలోత్ కవితకు మరోమారు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు.

కరీంనగర్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన వినోద్ కుమార్ పేరును ప్రకటించారు. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ పార్టీని వీడడంతో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను అక్కడ అభ్యర్థిగా ప్రకటించారు. సీనియర్ నేత, ఉద్యమ కాలం నుంచి వెన్నంటి ఉన్న కొప్పులకు అక్కడ అవకాశం కల్పించారు. ఎన్నికల ప్రచార శైలిని కూడా మార్చి, ఎక్కువగా రోడ్ షోలు, బస్సు యాత్రలు నిర్వహించాలని నిర్ణయించారు. శాసనసభ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను ఏర్పాటు చేసుకొని పోవాలని నేతలకు కేసీఆర్ స్పష్టం చేశారు.

జోరుగా బీఆర్ఎస్‌ లోక్‌సభ సన్నాహక సమావేశాలు - పార్టీ శ్రేణుల అభిప్రాయాలపై అధినేత కేసీఆర్‌ అధ్యయనం

లోక్​సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ - న్యూ ఇయర్ తర్వాత కేసీఆర్ బాస్ వస్తారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.