ETV Bharat / state

కారు నడిపిన మాజీ సీఎం కేసీఆర్​ - సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్న వీడియో - Ex CM KCR Drive a Car

BRS Chief KCR drive a Car : రోడ్డుపై మాజీ సీఎం కేసీఆర్​ కారును నడిపారు. అదేంటి బీఆర్​ఎస్​ అధినేత కారు నడపడం ఏంటని అంతా ఆశ్చర్యపోతున్నారు! స్వయంగా కేసీఆర్​నే తన పాత ఓమ్నీ కారును కాలు శస్త్ర చికిత్స తర్వాత నడిపారు. ఇది కూడా డాక్టర్లు కారు డ్రైవ్​ చేయమని ఇచ్చిన సలహాతో.

Ex CM KCR Drive a Car on the Road
Ex CM KCR Drive a Car on the Road (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 27, 2024, 3:56 PM IST

Updated : Jun 27, 2024, 9:50 PM IST

Ex CM KCR Drive a Car on the Road : పైన ఉన్న చిత్రం చూస్తే మీకు ఏదో డౌట్​ వచ్చే ఉంటుందే. అదే కారు డ్రైవింగ్​ చేస్తున్న వ్యక్తి మాజీ సీఎం కేసీఆర్​ అని? అసలు బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ ఏంటి? కారు నడపడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? ఎప్పుడూ సభలు, సమావేశాలు అంటూ రాజకీయాల్లో బిజీబిజీగా ఉండి ప్రత్యర్థులపై విరుచుకుపడే కేసీఆర్​నే చూశాం.

కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా ఎప్పుడూ చూడని సన్నివేశం చూస్తున్నాం. అదే బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ ఓమ్నీ వ్యాన్​ నడపడం. ఓమ్నీ వ్యాన్​ స్టీరింగ్​ను తన చేతుల్లోకి తీసుకుని కేసీఆర్​నే స్వయంగా డ్రైవింగ్​ చేశారు. ఇప్పుడు ఈ ఫొటో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. కాలు ఆపరేషన్​ తర్వాత కర్ర సహాయంతో కాకుండా మ్యానువల్​ కారు నడిపి చూడాలని డాక్టర్లు సూచించారు. ఈ క్రమంలో మాజీ సీఎం ఇలా తన పాత కారు ఓమ్నీ కారును నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు.

KCR Drive Omni Car : గతేడాది డిసెంబరు 8వ తేదీన అర్ధరాత్రి కేసీఆర్​ కాలు జారి ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్​లో పడ్డ సంగతి తెలిసిందే. వెంటనే కుటుంబ సభ్యులు కేసీఆర్​ను సోమాజిగూడలోని యశోదా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మాజీ సీఎం కేసీఆర్​కు చికిత్స చేయించారు. అదే రోజు పలు పరీక్షలు చేసిన ఆసుపత్రి వైద్యులు ఎముక విరిగిందని తెలిపారు. డిసెంబరు 9వ తేదీన కేసీఆర్​కు తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స చేశారు. అది విజయవంతమైంది. అనంతరం వైద్యుల సూచన మేరకు తనకు కేటాయించిన గదిలో వైద్యుల పర్యవేక్షణలో వాకర్​ సాయంతో మెల్లగా అడుగులు వేస్తూ నడిచారు. ఆ వీడియోను ఎక్స్​ వేదికగా బీఆర్​ఎస్​ విడుదల చేసింది. ఆయనను కలిసేందుకు సీఎం రేవంత్​ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, చిరంజీవి ప్రముఖులు వెళ్లి పరామర్శించారు.

యశోద ఆసుపత్రిలోనే నాలుగు రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం కాస్త ఆరోగ్యం కుదిటపడిన అనంతరం డిసెంబరు 13వ తేదీన డిశ్చార్జ్​ ఇచ్చి జూబ్లీహిల్స్​లోని నందినగర్​ నివాసానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచే పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. బీఆర్​ఎస్​ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కొద్ది రోజుల తర్వాత కర్ర సాయంతో కేసీఆర్​ నడవడం ప్రారంభించారు. లోక్​సభ ఎన్నికల సమయంలో కూడా కర్ర పట్టుకుని పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత కేసీఆర్​ కొంతమేర కోలుకోవడంతో గత కొద్ది రోజులుగా కర్ర సాయం లేకుండానే నడవడం ప్రారంభించారు. రెండు రోజుల క్రితం బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఇంకా ఆరోగ్యం మెరుగుపడటానికి మ్యానువల్​ కారు నడపాలని డాక్టర్లు సూచించారు. దీంతో తన పాత ఓమ్నీ వ్యాన్​ను కేసీఆర్​ గురువారం నడిపారు. ఇప్పుడు ఈ ఫొటోలు వైరల్​గా మారాయి.

వాకర్ సాయంతో కేసీఆర్ అడుగులు - ఆరోగ్యం కాస్త మెరుగుపడిందన్న వైద్యులు

యశోద ఆసుపత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్ - నందినగర్ నివాసానికి తీసుకెళ్లిన కేటీఆర్, హరీశ్​రావు

Last Updated : Jun 27, 2024, 9:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.