ETV Bharat / state

తెలంగాణవ్యాప్తంగా ఎంగిలి పూల బతుకమ్మ సంబురాలు - ఆడిపాడిన మహిళలు - Bathukamma Celebration In Telangana

Telangana Bathukamma Celebrations 2024 : రాష్ట్రవ్యాప్తంగా తొలిరోజు ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నేటి నుంచి తొమ్మిది రోజులపాటు బతుకమ్మ సంబరాలు కొనసాగనున్నాయి. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ వసతిగృహాల్లో, కాలనీల్లో, ఆలయాల్లో మహిళలు ఉత్సహంగా జరుపుకున్నారు. యువతులు, మహిళలు అందమైన బతుకమ్మలను పేర్చి చుట్టూ చేరి బతుకమ్మ పాటలకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు.

Bathukamma Celebration In Telangana
Telangana Bathukamma Celebrations 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 2, 2024, 9:48 PM IST

Updated : Oct 2, 2024, 10:22 PM IST

Bathukamma Celebration In Telangana : పూలనే దైవంగా కొలిచే ఏకైక పండుగ బతుకమ్మ! తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పూల పండుగ బతుకమ్మ.! తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడపడుచులంతా ఆడిపాడే వేడుక. అంతా ఒక్కచోట చేరి తమ అనుభవాలనే పాటలుగా మలిచి చప్పట్లతో గౌరమ్మను కొలిచే 9 రోజుల పాటు కొలిచే పూల సంబరం. 9 రోజుల పాటు ఘనంగా జరిగే బతుకమ్మ వేడుకల్లో భాగంగా తొలిరోజు జరిగే ఎంగిల పూల బతుకమ్మ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగాయి. పూల వనాలే నడిచివచ్చాయా అన్నంత వర్ణరంజితంగా ఊరూవాడ బతుకమ్మ ఆడిపాడారు. నెక్లెస్‌రోడ్డులో మంత్రి సీతక్క బతుకమ్మ చుట్టూ ఆడిపాడారు.

Bathukamma Celebration In Hyderabad : తెలంగాణ ఆడపచులు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పూల పండగ బతుకమ్మ ఉత్సవంలో భాగంగా హైదరాబాద్​లోని నారాయణగూడలో కేశవ మెమోరియల్ జూనియర్ కాలేజీలో ఘనంగా నిర్వహించారు. ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలో పాల్గొనడానికి కాలేజీ యువతులు పూర్తి సంప్రదాయ దుస్తుల్లో వచ్చి ఆటపాటలతో సందడి చేశారు. రోజూ పుస్తకాలతో కుస్తీ పట్టిన వారంతా స్నేహితురాళ్లతో కలిసి పాటలు పాడుతూ ఉల్లాసంగా గడిపారు.

తొమ్మిది రోజుల పాటు సాగే ఈ ఉత్సవంలో మొదటి రోజు కాలేజీలో ప్రత్యేక పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు కూడా ఇస్తామని ప్రకటించారు. నగరవాసులే కాదు ఇతర రాష్ట్రాలకు, ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడి విద్యార్థులతో కలిసి పండుగ ప్రత్యేకతను తెలుసుకున్నారు. రోజూ మోడ్రన్ డ్రెస్సుల్లో కాలేజీకి వెళ్లే వీరంతా సంప్రదాయ దుస్తుల్లో రావడంతో అక్కడంతా పండగ వాతారవణం నెలకొంది. మన సంస్కృతీ సంప్రదాయాలను సజీవంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఏటా ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని కళాశాల నిర్వాహకులు చెప్పారు.

రవీంద్ర భారతిలో బతుకమ్మ ఉత్సవాలు : పూలను పూజించే బతుకమ్మ మన రాష్ట్ర అస్తిత్వం అయినప్పుడు, దాన్ని ఎంత స్వచ్ఛంగా ఉంచితే అంత మంచిది అని పర్యాటక సాంస్కృతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి ప్రసాద్ అన్నారు. రవీంద్ర భారతిలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ ఉత్సవాలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రపంచం మొత్తంలో పూలను పూజించే పండుగ మనదేనని అందుకు మనం గర్వపడాలన్నారు. సంప్రదాయక రీతిలో బతుకమ్మ సంబరాలు చేసుకోవడం సంతోషకరంగా ఉందని ఆమె అన్నారు. నగర మహిళలతో కలిసి బతుకమ్మ అప్పుడప్పుడు ఆడానని బతుకమ్మ ఆడిన ప్రతిసారీ పరవశించానని తెలిపారు. అనంతరం బతుకమ్మ పాటల సంకలనం ఒక్కేసి పూవేసి చందమామ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

భద్రాచలం పట్టణంలో బతుకమ్మ సంబరాలు : భద్రాచలం పట్టణంలోని పవర్ బాయ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగాయి. మొదటిరోజు బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథులుగా స్థానిక డాక్టర్లు శ్రీకాంత్, డాక్టర్ సరోజినీ, టౌన్ ఎస్ఐ విజయలక్ష్మి హాజరయ్యారు. అశోక్​నగర్ కాలనీలోని మహిళలు చిన్నారులతో కలిసి బతుకమ్మ పాటలకు నృత్యాలు చేశారు. ఈరోజు నుంచి తొమ్మిది రోజులపాటు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తామని పవర్ బాయ్స్ కమిటీ సభ్యులు తెలిపారు.

నిజామాబాద్​లో బతుకమ్మ వేడుకలు : నిజామాబాద్​లో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని కన్యకాపరమేశ్వరి, సాయిబాబా ఆలయాల్లో నిర్వహించిన సంబరాల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బోధన్, ఆర్మూర్, బాల్కొండ ధర్పల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో బతుకమ్మ వేడుకలు వైభవంగా జరుపుకున్నారు. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ తిరుగుతూ తమదైన శైలిలో ఆడిపాడారు. ఈ వేడుకల్లో పాల్గొన్న మహిళలు ఒక్కొక్కరూ ఒక్కో పాట పాడి అందరినీ ఆకట్టుకున్నారు.

2024లో ఉర్రూతలూగిస్తున్న బతుకమ్మ పాటలు ఇవే - మీరు ఒక్కసారైనా విన్నారా? - 2024 Bathukamma Songs With Lyrics

ప్రకృతి పండుగ బతుకమ్మ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - DUSSEHRA AND BATHUKAMMA FESTIVALS

Last Updated : Oct 2, 2024, 10:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.