ETV Bharat / state

'దండిగా వానలు పడ్డా సాగు మాత్రం తగ్గింది' - ఎందుకిలా? - ఏం జరిగింది? - Crops Cultivation In Mahbubnagar - CROPS CULTIVATION IN MAHBUBNAGAR

Crops Cultivation In Mahbubnagar : ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యవసాయ ముఖచిత్రం ఈసారి భిన్నంగా కనిపిస్తోంది. సాధారణానికి మించి వర్షాలు కురిశాయి. కానీ సాధారణ సాగు విస్తీర్ణంతో పోల్చితే వానాకాలంలో పంటల సాగు 55శాతానికే పరిమితమైంది. వానలు కురుస్తున్నప్పటికీ భూగర్భ జలమట్టాలు మాత్రం గతేడాది జులైతో పోల్చితే ఒకటి నుంచి రెండున్నర మీటర్ల లోతుకు పడిపోయాయి. వానాకాలంలో అత్యధికంగా సాగుచేసే పత్తి పంట గణనీయంగా పడిపోయింది. పత్తి స్థానంలో కంది, మొక్కజొన్న, జొన్న సాగు పెరిగింది. వరి సాగు సైతం 100శాతానికి చేరుకోలేదు. ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో పంటల సాగుతీరుపై కథనం.

Crops Cultivation In Mahbubnagar
Crops Cultivation In Mahbubnagar (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 22, 2024, 2:15 PM IST

Story On Crops Cultivation In Mahbubnagar : ఉమ్మడి మహబూబ్​ నగర్ జిల్లాలో వానాకాలం సీజన్​లో సాధారణానికి మించి వర్షపాతం నమోదైంది. కానీ వానాకాలం పంటల సాగు మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అధిక వర్షపాతాలు నమోదు కాగా నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యింది. పంటల సాగు మాత్రం సాధారణ సాగువిస్తీర్ణంతో పోల్చితే మహబూబ్ నగర్ జిల్లాలో 53శాతం, నారాయణపేట జిల్లాలో 83శాతం, నాగర్ కర్నూల్ జిల్లాలో 53శాతం, వనపర్తి జిల్లాలో 41శాతం, జోగులాంబ గద్వాల జిల్లాలో 61శాతం మాత్రమే సాగయ్యాయి.

భూగర్భ జలాలు గత ఏడాదితో పోల్చితే తక్కువగా ఉండటం, చెరువులు,కుంటలు, బోరుబావుల్లో ఆశించిన మేర నీరు లేకపోవడం అందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలో గత ఏడాది జూలైతో పోల్చితే 2.56 మీటర్లు, నాగర్ కర్నూల్ జిల్లాలో 1.86, జోగులాంబ గద్వాల జిల్లాలో 1.52, నారాయణపేట జిల్లాలో 1.68, వనపర్తి జిల్లాలో 1.11 మీటర్ల లోతుకు భూగర్భ జలమట్టాలు పడిపోయాయి.

Farmers who Cultivate Cotton In Less Area : వర్షపాతం అత్యధికంగా నమోదైనప్పటికీ పంటలకు అనుకూలంగా లేకపోవడంతో ఎక్కువమంది రైతులు సాగువైపు ఆసక్తి చూపలేదు. ఆ కారణంగా ఈసారి పంటల సాగు సాధారణ సాగు విస్తీర్ణంతో పోల్చితే తగ్గిందని తెలుస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పత్తి సాగు గణనీయంగా తగ్గింది. సుమారు 9లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేసే వాళ్లు. కానీ ఈసారి పత్తి సాగు 6లక్షల ఎకరాలకు మాత్రమే పరిమితమైంది.

గత ఐదారేళ్ల నుంచి పత్తి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, తగ్గిన దిగుబడి, మార్కెట్ ధర, ప్రకృత్తి విపత్తుల కారణంగా ఏర్పడిన నష్టాలు వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఎక్కువ మంది రైతులు ఈసారి పత్తిని సాగు చేయలేదని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవడంతో పత్తి సాగు గణనీయంగా పడిపోయందని అంచనా.

3.50లక్షల ఎకరాలకే పరిమితమైన వరిపంట సాగువిస్తీర్ణం : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రధానమైన పంట వరి. వానాకాలంలో సుమారు 6 నుంచి 7 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. గత ఏడాది ఇదే సమయానికి సుమారు మూడున్నర లక్షల ఎకరాలు సాగు కాగా ఈసారి రెండున్నర లక్షల ఎకరాలకే పరిమితమైంది. జూరాల సహా ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల్లో నీళ్లు ఆశించిన మేర రాకపోవడం, భూగర్భ జలాలు పడిపోవడం, ఇతర నీటి వనరులూ అందుబాటులో లేకపోవడంతో ఎక్కువ మంది వరి సాగు చేయలేదు. గత వారం రోజులుగా వానలు బాగా కురుస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్ మొదటి వారం నాటికి వరి సాధారణ సాగు విస్తీర్ణానికి చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రత్యామ్నాయ పంటలవైపు : పత్తి సాగుపై ఆసక్తి చూపని రైతులు ఈసారి కంది, జొన్న, మొక్కజొన్న వైపు మళ్లారని అధికారులు అంచనా వేస్తున్నారు. 2లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సిన కంది లక్షన్నర ఎకరాలు, లక్ష ఎకరాల్లో సాగవ్వాల్సిన మొక్కజొన్న 80వేల ఎకరాలు, 40వేల ఎకరాల్లో సాగవ్వాల్సిన జొన్న 35వేల ఎకరాల్లో సాగైంది గత ఏడాదితో పోల్చితే దాదాపు ఈ మూడు పంటలూ రెట్టింపయ్యాయి. మార్కెట్​లో మంచి ధర, ఆరుతడి పంట కావడంతో రైతులు ఆసక్తి చూపారు. మొత్తంగా 18 లక్షల ఎకరాలకు గాను కేవలం 10 లక్షల ఎకరాల్లో పంటలేశారు. మొత్తం సాధారణ సాగులో అది 55శాతం మాత్రమే.

ప్రస్తుతం వరి తప్ప మరో పంట వేసుకోవడానికి అవకాశం లేదు. నువ్వులు, ఉలవల్లాంటి స్వల్పకాలిక పంటలు వేసుకునేందుకు అవకాశం ఉన్నా ఉమ్మడి జిల్లాలో ఆ తరహా పంటల సాగు చాలా తక్కువ. ఈ నేపథ్యంలో కొందరు ముందస్తు యాసంగికి సన్నద్ధమవుతున్నారు. ముందస్తు యాసంగి పంటగా వేరుశనగ వేసేందుకు సన్నద్ధమవుతున్నారు.

వ్యవసాయం.. వ్యయమయం: ఏటా పెరుగుతున్న పంటల సాగు ఖర్చులు

Yasangi Cultivation in Palamuru: యాసంగి సాగు గందరగోళం.. గణనీయంగా తగ్గిన పంట విస్తీర్ణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.