ETV Bharat / state

'తనిఖీలు పెంచండి - చలానా కడితే ఓకే - లేదంటే బండి సీజ్ చేసేయండి' - AP HIGH COURT ON TRAFFIC RULES

ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే జరిమానా విధించాలని ఏపీ హైకోర్టు స్పష్టం - తనిఖీలు పెంచి, కఠిన చర్యలు తప్పవన్న సందేశాన్ని ఇవ్వాలని పోలీసులకు ఆదేశం - విచారణ 3 వారాలకు వాయిదా

AP HIGH COURT ON TRAFFIC CHALLAN
AP High court on Traffic Rules Violation (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 19, 2024, 11:05 AM IST

AP High court on Traffic Rules Violation : ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారనేలా ప్రజలకు ఓ సందేశాన్ని పంపాల్సిన అవసరం ఉందని ఏపీ హైకోర్టు పేర్కొంది. రహదారులపై తనిఖీలు చేసి నిబంధనలు పాటించని వారికి అక్కడికక్కడే జరిమానాలు విధించాలని, అప్పుడే వాహనదారుల్లో భయం ఉంటుందని తెలిపింది. పోలీసులు రోడ్లపై ఉంటే నేరం చేయడానికి సిద్ధపడ్డ వాళ్లు కూడా భయపడి వెనక్కి తగ్గడమో, వాయిదా వేయడమో చేస్తారని వ్యాఖ్యానించింది. మోటారు వాహన చట్ట నిబంధనలు అమలు చేయకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరిగి, భారీ సంఖ్యలో మరణిస్తున్నారంటూ న్యాయవాది తాండవ యోగేశ్‌ గతంలో ఏపీ హైకోర్టులో పిల్​ వేశారు.

దీనిపై ఇటీవల విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం, ట్రాఫిక్​ ఐజీని వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాజాగా బుధవారం దీనిపై ధర్మాసనం విచారణ చేపట్టగా, కోర్టు ముందు డీజీపీ కార్యాలయం నుంచి ఐజీ ఆకే రవికృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసులు క్రియాశీలకంగా వ్యవహరించాలని గుర్తు చేస్తూ పలు విషయాలను ఏపీ హైకోర్టు ప్రస్తావించింది. సీసీటీవీ కెమెరాల ఆధారంగా చలానాలు వేసే విధానాన్ని తగ్గించాలంటూ పోలీసులకు ఆదేశించింది. జరిమానా విధించిన సొమ్మును 90 రోజుల్లో చెల్లించకపోతే వాహనాన్ని జప్తు చేయొచ్చన్న నిబంధనను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది.

667 మంది చనిపోవడం చిన్నవిషయం కాదు : సెక్షన్‌-167 ప్రకారం నిర్దిష్ట సమయంలో చలానాలు చెల్లించని వారి వాహనాలను సీజ్‌ చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. సెక్షన్‌-206 ప్రకారం వారి లైసెన్స్‌ కూడా రద్దు చేయాలంటూ వ్యాఖ్యానించింది. హెల్మెట్‌ ధరించని కారణంగా జూన్‌ నుంచి మూడు నెలల్లో 667 మంది చనిపోవడం చిన్నవిషయం కాదని విచారం వ్యక్తం చేసింది. హెల్మెట్‌ను తప్పనిసరి ధరించాలని జూన్​లో తాము ఇచ్చిన ఆదేశాలు అమలుచేసి ఉంటే ఇన్ని ప్రాణాలు పోయేవి కాదు కాదా అని పేర్కొంది. దాదాపు 90 శాతం మంది హెల్మెట్లు లేకుండా ప్రయాణిస్తున్నారని వివరించింది. బైక్​ నడిపే వ్యక్తే కాకుండా వెనుక కూర్చున్న వాళ్లు సైతం హెల్మెట్‌ ధరించేలా చూడాలని స్పష్టం చేసింది.

విజయవాడలో వాహనదారులకు క్రమశిక్షణ లేదని, ఎక్కడా నో హార్​ బోర్డులు కనిపించడంలేదని ఏపీ హైకోర్టు పేర్కొంది. కొందరు అతిగా హారన్‌ మోగిస్తూ ప్రజలకు నరకం చూపిస్తున్నారని, ఆటోల్లో పరిమితికి మించి పాఠశాల పిల్లల్ని తీసుకెళ్తున్నారని మండిపడింది. కొందరు ఇదే చివరిరోజు అన్నట్లు వేగంగా దూసుకెళ్తున్నారని, సరిగా సరిపడా స్పీడ్‌ గన్‌లు కూడా లేవు వ్యాఖ్యానించింది. అలాంటి వారిని పోలీసులు ఆపి తనిఖీ చేస్తున్న దాఖలాలేమీ తమకు కనిపించలేదంటూ తెలిపింది. పోలీసులు సక్రమంగా విధులు నిర్వర్తించకపోవడం వల్లే ఉల్లంఘనలు జరుగుతున్నాయని వెల్లడించింది. దిల్లీ, చండీగఢ్‌లలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తూ ఉల్లంఘనలపై వెంటనే జరిమానాలు విధిస్తున్నారని తెలిపింది.

అవగాహన సదస్సలు నిర్వహించాలి : ఓసారి హైబీమ్‌ లైట్‌ వాడిన కారణంగా తాను కూడా జరిమానా చెల్లించాననని సీజే జస్టిస్‌ ఠాకుర్‌ గుర్తు చేసుకున్నారు. కఠినంగా నిబంధనలు అమలుచేస్తే రెండు నెలల్లోనే గణనీయమైన మార్పు వస్తుందని ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది. అందుకు తమది హామీ అంటూ స్పష్టం చేసింది. ప్రజలను సైతం చైతన్యవంతుల్ని చేసేలా అవగాహన సదస్సలు నిర్వహించాలని సూచించింది. టీవీలు, పత్రికలు, ఎఫ్​ఎం రేడియోలు, ప్రకటన బోర్డులు, సినిమా హాళ్లల్లో కూడా ప్రకటనలు ఇవ్వాలని ఆదేశించింది.

ట్రాఫిక్‌ నిబంధనల అమలు, హెల్మెట్‌ ధారణ తప్పనిసరిపై తీసుకున్న చర్యలు, జిల్లాల వారీగా ఏర్పాటైన బృందాల వివరాలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను అఫిడవిట్‌ రూపంలో కోర్టు ముందు ఉంచాలంటూ ఏపీ ఐజీ రవికృష్ణను కోర్టు ఆదేశించింది. దీనికి ఐజీ బదులిస్తూ నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని, తనిఖీలు చేసి, జరిమానాలు విధిస్తామని కోర్టుకు వివరించారు. ఇప్పటికే అవగాహన సదస్సులపై ఎస్పీలకు ఆదేశాలిచ్చామని తెలిపారు. జరిమానా వసూళ్లలో పురోగతి ఉందని, అఫిడవిట్‌ వేయడానికి సమయం ఇవ్వాలని కోరారు. దీంతో విచారణను మూడు వారాలకు వాయిదా వేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలిచ్చింది.

ఏపీలో 99 శాతం మంది హెల్మెట్ ధరించకుండానే బైక్​ రైడ్ - హైకోర్టు సీరియస్​ - ap HIGH COURT ON HELMET

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.