ETV Bharat / state

విద్యార్థులకు అలర్ట్‌ - ఇంటర్, 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ఏపీ పదో తరగతి పరీక్షల తేదీలు ప్రకటన - వచ్చే ఏడాది మార్చి 17 నుంచి 31 వరకు పరీక్షలు - పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసిన మంత్రి లోకేశ్

AP 10th Exams Time Table Released
AP 10th Exams Time Table Released (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 8 hours ago

Updated : 8 hours ago

AP 10th Exams Time Table Released : ఏపీలోని ఇంటర్, పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ విడుదల చేశారు. వచ్చే సంవత్సరం మార్చి 17 నుంచి 31తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన విద్యార్థులకు ఒత్తిడి కలగకుండా రోజు విడిచి రోజు పరీక్షలు నిర్వహించేందుకు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు.

ఈ మేరకు పరీక్షల షెడ్యుల్‌ను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఒత్తిడి లేకుండా రోజు విడిచి రోజు పరీక్ష ఉండేలా జాగ్రత్త తీసుకున్నామని మంత్రి లోకేశ్ తెలిపారు. మార్చి 17న ఫస్ట్ లాంగ్వేజ్, 19న సెకండ్ లాంగ్వేజ్‌, 21న ఇంగ్లీష్‌, 22న ఫస్ట్‌ లాంగ్వేజి పేపర్‌-2, 24న మ్యాథమేటిక్స్‌, 26న ఫిజికల్‌ సైన్స్, 28న బయోలాజికల్‌ సైన్స్‌, 31న సోషల్ స్టడీస్ పరీక్షలు జరగనున్నాయి. మార్చి 29న ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్‌ పేపర్‌-2, వొకేషనల్‌ కోర్స్‌ పరీక్ష జరగనుంది.

మార్చి 1నుంచి ఇంటర్‌ పరీక్షలు : ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ సైతం మంత్రి లోకేశ్ విడుదల చేశారు. వచ్చే ఏడాది మార్చి 1 నుంచి 19 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరగనుండగా, మార్చి 3 నుంచి 20 వరకు ఇంటర్ రెండో ఏడాది పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలు ముందు నుంచే ప్రిపేర్‌ అవ్వాలని సూచించారు. ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా, ఆరోగ్యం కాపాడుకుంటూ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. పరీక్షలు రాసే విద్యార్థులందరికీ లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.

ఎగ్జామ్స్​కు ప్రిపేర్​ అవుతున్నారా? - ఈ పొరపాట్లు చేయకపోతే విజయం మీదే!

ఇంటర్​ స్టూడెంట్స్​ కోసం '90 డేస్' ప్లాన్ - బ్యాక్ బెంచర్స్​కు స్పెషల్​ క్లాసెస్

ఈసారికి ఇంటర్నల్ మార్కులకు ఓకే - నెక్స్ట్ ఇయర్ నుంచి 100 మార్కులకు ఎగ్జామ్

Last Updated : 8 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.