Alwal Road Accident Boy Died : ఇప్పటికే ఆ కుటుంబ పెద్ద ఆరోగ్యం సరిగ్గా లేక నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు కళ్ల ముందే కుమారుడి మృతితో ఆ ఇంటి ఇల్లాలి రోదనకు అంతే లేదు. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి తండ్రి.. ఆ కుమారుడి మరణ వార్త విని తట్టుకుంటాడా? ఇలా కష్టకాలంలో చేతికి అందుతున్న వంశ వృక్షాన్ని కోల్పోయిన ఆ కుటుంబం పరిస్థితి తెలుసుకుందాం.
DCM Van Crash in Alwal Boy Died : తన భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తన తండ్రి ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో తల్లితో కలిసి ఆసుపత్రికి వెళ్లి ఇంటికి వెళుతున్నారు. అల్వాల్‌లోని రిలయన్స్ ఫ్రెష్‌కు సరుకులతో వచ్చిన డీసీఎం వాహనం హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో రోడ్డుపైకి దూసుకొచ్చింది. రహదారిపై నడుచుకుంటూ వెళ్లుతున్న వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలుడు తిరుపాల్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లినా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనలో తల్లికి స్వల్ప గాయాలయ్యాయి.
వరుడి ఇంట్లో 'తిలక్' వేడుక- తిరిగివస్తుండగా ప్రమాదం- 'వధువు' కుటుంబంలో ఆరుగురు మృతి
9Years Boy Dies In Road Accident : బాలుడి మరణంతో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకవైపు కుటుంబం పెద్ద ఆ పరిస్థితిలో ఉంటే కుమారుడి మరణంతో ఆ తల్లి రోదన మిన్నంటింది. డీసీఎం వాహనానికి హ్యాండ్ బ్రేక్ డ్రైవర్ నిర్లక్ష్యంగానే ప్రమాదం (Road Accidents) చోటుచేసుకుందని బాధితులు ఆరోపించారు. మృతదేహంతో ఆ సూపర్ మార్కెట్ ముందు ఆందోళనకు దిగారు. నిందితుడిని సరైన శిక్ష వేయాలంటూ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా తగు జాగ్రత్తలు చేపట్టాని పోలీసులను కోరారు. బాలుడిని డీసీఎం ఢీకొన్న దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం - ఆరుగురు మృతి
తరచూ రోడ్డు ప్రమాదాలు ఎంత చెప్పినా అంతే: ఈ మధ్యకాలంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. చిన్నపాటి పొరపాటు, నిర్లక్ష్యం కారణంగా అనేక మరణాలు సంభవిస్తున్నాయి. ఆ వ్యక్తి వల్ల ఒక కుటుంబానికి తీరని నష్టం జరుగుతుంది. పోలీసులు, ట్రాఫిక్ అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం లేకుండాపోతోంది.
వాటర్‌ఫాల్స్‌కు వెళ్లి వస్తూ అనంతలోకాలకు- లారీ, కారు ఢీకొని ఆరుగురు దుర్మరణం