ETV Bharat / state

కుటుంబ సమేతంగా చిరంజీవి, నాగబాబుల ఇంటికి వెళ్లిన అల్లుఅర్జున్‌ - ALLU ARJUN AT CHIRANJEEVI RESIDENCE

చిరంజీవి ఇంటికెళ్లిన బన్నీ - సుమారు గంటపాటు చర్చలు - ఇటీవల అల్లు అర్జున్‌ను అరెస్టు చేసిన పోలీసులు - హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో విడుదలైన స్టార్‌ హీరో

ALLU ARJUN AT CHIRANJEEVI RESIDENCE
మెగాస్టార్‌ చిరంజీవితో అల్లు అర్జున్‌ ఆయన సతీమణి స్నేహారెడ్డి (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 15, 2024, 8:02 PM IST

Allu Arjun Meets Megastar Chiranjeevi in Jubileehills : తెలుగు చలన చిత్ర మెగాస్టార్ చిరంజీవిని (Chiranjeevi) పుష్ప- 2 నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) కుటుంబ సమేతంగా ఆదివారం(డిసెంబరు 15న) తన ఇంటికి వెళ్లి కలిశారు. స్వయంగా తన రేంజ్‌రోవర్‌ కారును నడుపుకుంటూ చిరంజీవి ఇంటికెళ్లిన బన్నీ సుమారు గంట సమయం పాటు అక్కడే గడిపారు. తాజా పరిణామాలపై బన్నీ మెగాస్టార్‌తో చర్చించారు. ఈనెల 4(బుధవారం రాత్రి)న ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందింది.

అరెస్ట్‌.. రిమాండ్‌.. బెయిల్‌ : రేవతి కుమారుడు సైతం తీవ్ర గాయాలై ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఆ ఘటనపై అల్లు అర్జున్‌ను ఏ(Acused)-11 నిందితుడిగా చేర్చిన పోలీసులు శుక్రవారం (డిసెంబరు 13)న అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరు పర్చారు. వెంటనే విచారణ చేపట్టిన న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. పోలీసులు ఆయన్ను వెంటనే చంచల్‌గూడ జైలుకు తరలించారు.

మొదటిసారి చిరుమామ దగ్గరికే : అదే రోజు తెలంగాణ హైకోర్టులో అల్లు అర్జున్‌ తరఫున లాయర్‌ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేయగా విచారించిన న్యాయస్థానం బెయిల్‌ను మంజూరు చేసింది. అయినా అల్లు అర్జున్‌ మరుసటి రోజు విడుదలయ్యారు. అల్లుఅర్జున్‌ అరెస్టయిన వెంటనే చిరంజీవి దంపతులు బన్నీ నివాసానికి చేరుకొని కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పి పరామర్శించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారి అల్లు అర్జున్ మెగాస్టార్ ఇంటికెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

టాలీవుడ్‌ ప్రముఖుల పరామర్శ : అల్లు అర్జున్‌ విడుదలైన మరుసటి రోజు ప్రముఖులు ఆయనను పరామర్శించారు. అందులో సీనియర్‌ దర్శకులు కె.రాఘవేంద్రరావు, కొరటాల శివ, వంశీ పైడిపల్లి, నిర్మాతలు నవీన్‌ యేర్నేని, యలమంచిలి రవి, దిల్‌ రాజు, హీరోలు విజయ్‌ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ తదితరులు కలిశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో అల్లు అర్జున్‌ నివాసానికి వెళ్లిన వీరందరూ తాజా పరిణామాల గురించి చర్చించి పరామర్శించారు. పలు విషయాలను బన్నీని అడిగి తెలుసుకున్నారు. అల్లు అర్జున్‌ను కలిసిన పుష్ప-2 డైరెక్టర్‌ సుకుమార్‌ కాస్తా భావోద్వేగానికి గురయ్యారు. బన్నీని చూడగానే కంట కన్నీరును సుక్కుభాయ్‌ ఆపుకోలేకపోయారు. వెంటనే బన్నీ ఆయనను ప్రేమగా ఓదార్చారు.

జైలు నుంచి బన్నీ ఇంటికి - హత్తుకుని ఏడ్చిన స్నేహా రెడ్డి

అల్లు అర్జున్‌ అరెస్ట్ - పోలీసుల తీరును ఖండించిన నేతలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.