Balakrishna and Jana Reddy House Marks : జూబ్లీహిల్స్ మహారాజ అగ్రసేన్ కూడలి నుంచి చెక్‌పోస్టు వరకు కేబీఆర్ పార్కు హద్దు పొడవునా రోడ్డు విస్తరణ పనులు, పార్కు చుట్టూ ఉన్న ఆరు కూడళ్ల అభివృద్ధి పనులతో పలువురు ప్రముఖులు భూముల కోల్పోనున్నారు. దీంతో వారంతా తీవ్ర మనస్తాపంతో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి, అల్లు అర్జున్ మామ కె.చంద్రశేఖర్ రెడ్డి, రెండు మీడియా సంస్థల యజమానులు, పలువురు బడా వ్యాపారులు భూమిని కోల్పోతున్నారు. అభివృద్ధి పనుల్లో ఎంతవారైనా వాటిని ముందుకు తీసుకెళ్లడంపైనే రాష్ట్రప్రభుత్వం పట్టుదలతో ఉంది. అధికారులు మాత్రం, బాధితులందరికీ నచ్చజెప్పి భూసేకరణకు ఒప్పిస్తుందని చెబుతున్నారు.
జాతీయ ఉద్యానవనం : కేజీఆర్ పార్క్ జాతీయ ఉద్యానవనం కావడంతో హద్దు పొడవునా కొంత భూమి ఎకో సెన్సిటివ్ జోన్‌గా ఉంటుంది. బీఆర్ఎస్ సర్కారు ఎస్సార్డీపీ పేరుతో 2016లో కేబీఆర్ పార్కు చుట్టూ పైవంతెనలు నిర్మించేందుకు ప్రయత్నించింది. దీంతో ఆయా పైవంతెనల పిల్లర్లు ఎకో సెన్సిటివ్ జోన్లో నిర్మిస్తున్నారంటూ పర్యావరణవేత్తలు ఎన్జీటీని ఆశ్రయించారు. అనంతరం ప్రాజెక్టును రద్దు చేయించారు. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం డిజైన్లను మార్చి ఎకో సెన్సిటివ్ జోన్‌ను తాకకుండా నిర్మాణాలను చేపట్టాలని చూస్తోంది. దీంతో నిర్మాణాలను రోడ్డు వైపున చేపట్టాలని, అవసరమైన చోట ప్రైవేటు ఆస్తులను సేకరించాలని నిర్ణయించింది.
రూ.1200 కోట్లతో పనులు ప్రారంభం : బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి, మహారాజ అగ్రసేన్, ఫిల్మ్‌నగర్, జూబ్లీహిల్స్ రోడ్డు నం.45, చెక్‌పోస్టు, కేబీఆర్ పార్కు ప్రధాన గేటు కూడళ్లలో ఏడు ఉక్కు వంతెనలు, ఆరు అండర్‌పాస్‌లను నిర్మించే పనుల్లో వేగం పెంచింది. ఇందుకు రూ.1200 కోట్లను కేటాయించింది.
స్థలాలు కోల్పోతున్న ప్రముఖులు :
- ఎమ్మెల్యే బాలకృష్ణ ఇల్లు రోడ్డు నం.45, 92 కూడలి వద్ద ఉంది. దీంతో రెండు వైపులా భూసేకరణ చేపట్టాల్సి ఉంది. దాదాపు సగం భూమిని బాలకృష్ణ నష్టపోతారని అంచనా.
- ఒమేగా ఆసుపత్రి సమీపంలో జానారెడ్డికి సంబంధించిన రెండు ప్లాట్లు ఉన్నాయి. ఆ రెండు ప్లాట్లను 43 అడుగుల మేర రోడ్డు కోసం సేకరించాల్సి వస్తోంది. దీంతో ఆయన దాదాపు 700 గజాలు నష్టపోవచ్చని తెలుస్తోంది.
బంజారాహిల్స్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు రోడ్డు విస్తరణ :
- ప్రాజెక్టు వ్యయం - రూ.150 కోట్లు
- రోడ్డు పొడవు - 6.5 కి.మీ
- గుర్తించిన నిర్మాణాలు - 306
- సర్వే పూర్తయినవి - 86
చూడ్డానికి రెండు కళ్లు చాలని కొత్వాల్‌గూడ ఎకో పార్క్ - వారెవ్వా! ఏంటి బ్రో ఆ సదుపాయాలు