Allu Arjun Arrest : ప్రముఖ హీరో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 4న పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన ఘటన నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేశారు. తొలుత అల్లు అర్జున్ ఇంటి వద్ద చేరుకున్న పోలీసులు, ఆయనను అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరిలించారు. అక్కడి నుంచి వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి అల్లుఅర్జున్ను పోలీసులు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై అల్లు అర్జున్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసుల తీరును తప్పుపట్టారు. తనను అరెస్ట్ చేసిన విధానం సరిగా లేదన్నారు.
నన్ను తీసుకెళ్లడంలో తప్పు లేదు, కానీ పోలీసులు మరీ బెడ్‌రూమ్ వరకు వస్తారా?, దుస్తులు కూడా మార్చుకోనివ్వరా ? ఇది మంచి విషయం కాదు - అల్లు అర్జున్
అల్లు అర్జున్ కారుతో పాటే మరో కారులో అల్లు అరవింద్, అల్లు అర్జున్ తమ్ముడు శిరీష్ కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. అల్లు అరవింద్ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లగా శిరీష్ కారులోనే పోలీస్ స్టేషన్ ముందు ఉన్నారు. అరెస్ట్ నేపథ్యంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
అల్లు అర్జున్‌ను నాంపల్లి కోర్టులో హాజరు పరిచేందుకు ముందు పోలీసులు, వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ బన్నీకి బీపీ, షుగర్ పరీక్షలతో పాటు, కొవిడ్-19 టెస్ట్ కూడా చేసినట్లు ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ సునీల్ తెలిపారు. అన్ని పరీక్షల్లో ఆయనకు సాధారణ ఫలితాలు వచ్చాయని వెల్లడించారు. ఈసీజీ పరీక్షలు కూడా నిర్వహించామని, భద్రతా కారణాల రీత్యా ఆయనను సూపరింటెండెంట్ కార్యాలయంలో వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం పోలీసులు ఆయన్ను నాంపల్లి క్రిమినల్ కోర్టుకు తరలించారు.
మరోవైపు అల్లు అర్జున్ తరపున హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని ఆయన తరపు న్యాయవాది నిరంజన్‌రెడ్డి హైకోర్టును కోరారు. బుధవారం పిటిషన్ వేశామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అత్యవసర పిటిషన్‌ను ఉదయం ఉ.10.30కే మెన్షన్ చేయాలి కదా అని కోర్టు ప్రశ్నించింది. క్వాష్ పిటిషన్‌పై పోలీసుల దృష్టికి తెచ్చామని అల్లు అర్జున్ లాయర్ కోర్టుకు వివరించారు. వాదనల అనంతరం సాయంత్రం 4 గంటలకు విచారణ వాయిదా పడింది.
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసులు ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశారు. థియేటర్ యజమానుల్లో ఒకరైన సందీప్, సీనియర్ మేనేజర్ నాగరాజు, లోయర్ అప్పర్ బాల్కనీ ఇన్ఛార్జ్ విజయ్ చందర్‌లను అరెస్ట్ చేశారు. తాజాగా అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారు.
'పుష్ప' తీసిన ప్రాణం : సంధ్య థియేటర్‌కు అల్లుఅర్జున్ - తొక్కిసలాటలో మహిళ మృతి