ETV Bharat / state

ఇదెక్కడి విచిత్రం - ఒక్క రూపాయి జీతం తీసుకోలే - ఆస్తి మాత్రం రూ.4.19 కోట్లు - ACB RAID ON EX ADDITIONAL COLLECTOR

మాజీ అదనపు కలెక్టర్‌ భూపాల్‌రెడ్డికి ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు గుర్తించిన ఏసీబీ- ఆయన ఆస్తులు రూ.4.19 కోట్లు కాగా అల్లుళ్ల పేరిట 32 ప్లాట్లు- మార్కెట్‌ ప్రకారం వాటి విలువ రూ.25 కోట్లని అంచనా

ACB RAID ON RANGAREDDY EX JC
ACB Raid on EX Additional Collector Bhupal Reddy (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 23, 2024, 1:00 PM IST

ACB Raid on EX Additional Collector Bhupal Reddy : రంగారెడ్డి జిల్లా మాజీ అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) ఎం.వి.భూపాల్‌రెడ్డికి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న అభియోగాలపై అవినీతి నిరోధకశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఎల్బీనగర్​లోని ఇందూ అరణ్య గేటెడ్‌ కమ్యూనిటీలోని ఆయన నివాసంలో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సూర్యాపేట, మిర్యాలగూడ, సాగర్‌ రింగ్‌రోడ్‌లోని ఆయన సమీప బంధువుల ఇళ్లల్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రూ.5.05 కోట్ల విలువైన నగదు, స్థిరాస్తుల దస్తావేజులు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ పత్రాల్లో మాజీ అదనపు కలెక్టర్‌ భూపాల్‌రెడ్డి ఇద్దరు అల్లుళ్ల పేరు మీద 32 ఇళ్ల స్థలాల దస్తావేజులున్నాయి. ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న పత్రాల్లో మొత్తం రూ.4.19 కోట్ల విలువైన ఆస్తులను కొనుగోలకు భూపాల్‌రెడ్డి సరైన ఆధారాలు చూపించకపోవడంతో కేసు నమోదు చేశారు. ఆయన ఆస్తుల విలువ ఇప్పటి మార్కెట్​ లెక్కల ప్రకారం దాదాపు రూ.25 కోట్లు ఉంటుందని అంచనా. భూపాల్‌రెడ్డి తన కుటుంబ సభ్యుల పేర్లతో స్థిర, చరాస్తులను కొనుగోలు చేసి తనకు వారు బహుమతిగా ఇచ్చినట్లు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ఎల్బీనగర్‌ సమీపంలోని ఇందూ అరణ్యలోని రెండుల విల్లాల్లో ఒకదాన్ని బహుమతి ఇచ్చినట్టు చూపించారు. మరో విల్లాను సైతం ఇటీవలే విక్రయించారు.

బహుమతిగా చలా‘మనీ’ : ధరణి పోర్టల్‌లో లోపాలు భూ కేటాయింపులపై నిర్ణయాల్లో భారీగా ముడుపులు ఆశించారన్న ఆరోపణలపై ఏసీబీ అధికారులు పరిశోధించగా ప్రాథమిక ఆధారాలు లభించినట్లు సమాచారం. సూర్యాపేట, భువనగిరి, మిర్యాలగూడ ప్రాంతాల్లో భూపాల్‌రెడ్డి తన ఇద్దరు అల్లుళ్ల పేరుతో చెరో 16 ప్లాట్లు కొనుగోలు చేశారు. ఆ పత్రాలను ఆయన ఇంటిలోనే ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో అధికారులు ఆయన ఇద్దరు అల్లుళ్లకు ఫోన్​ చేసి ఆస్తుల కొనుగోలు గురించి ప్రశ్నించారు. దానికి వారు కొనుగోలు చేశామని సమాధానం ఇచ్చినా కొనుగోలుకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పలేకుపోయారని తెలిసింది.

ఈ ప్లాట్లలో కొన్నింటిని తమ పేరుమీద గిఫ్ట్‌డీడ్‌గా మార్చుకునేందుకు భూపాల్‌రెడ్డి ప్రయత్నిస్తున్నట్టు అధికారులు గుర్తించారని తెలిసింది. రెండు నెలల క్రితం భూపాల్‌రెడ్డి లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసులో ఇటీవలే బెయిల్​పై ఆయన విడుదలయ్యారు. ముత్యంరెడ్డి అనే రైతు తన పొలంలోని 14 గుంటల భూమిని నిషేధిత జాబితాలో ఉందని, ధరణి పోర్టల్‌లో తొలగించాలంటూ దరఖాస్తు చేసుకోగా రూ.8 లక్షలు లంచం ఇవ్వాలంటూ అప్పటి అదనపు కలెక్టర్​గా ఉన్న భూపాల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

ప్రతినెలా జీతం వచ్చినా తీసుకోకుండా : మొదట ఈ డబ్బును తీసుకున్న కలెక్టరేట్‌ ఉద్యోగి మదన్‌మోహన్‌రెడ్డి తర్వాత భూపాల్‌రెడ్డికి అందజేయగా ఏసీబీ అధికారులు రెడ్​హ్యాండెడ్​గా పట్టుకుని రిమాండ్​కు తరలించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఆదాయంపై ఏసీబీ అధికారులు వివరాలు సేకరించి మంగళవారం సోదాలు నిర్వహించారు. భూపాల్‌రెడ్డి బ్యాంకు ఖాతాలో ప్రతినెలా జీతం జమవుతున్నా ఆయన ఖాతా నుంచి ఒక్క రూపాయి కూడా విత్​డ్రా చేయకపోవడం గమనార్హం.

ధరణి నిషేధిత ఖాతాలోంచి భూమి తొలగించేందుకు లంచం - రంగారెడ్డి జిల్లా జేసీని అరెస్టు చేసిన ఏసీబీ - RANGAREDDY JOINT COLLECTOR BRIBE

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.