ETV Bharat / state

Yuva : 'ఒకవైపు సాఫ్ట్​వేర్ ఉద్యోగం - మరొకవైపు మామిడి పండ్ల సాగు' ఇది యువకుడు సక్సెస్ స్టోరీ - Software Cultivating Mangoes - SOFTWARE CULTIVATING MANGOES

Software Cultivating Mangoes : సాఫ్ట్​వేర్ ఉద్యోగం చేస్తూనే ఆ యువకుడు వ్యవసాయం వైపు దృష్టి సారించాడు. ఒకవైపు సాఫ్ట్​వేర్ ఉద్యోగం చేస్తూనే మరోవైపు తనకు నచ్చిన వ్యవసాయం చేయడానికి పూనుకున్నాడు. ఈ క్రమంలో సేంద్రియ పద్ధతిలో మామిడి సాగు చేస్తూ, లక్షల్లో ఆదాయాన్ని పొందుతున్నాడు. ఆ యువకుడు ఎవరో కాదు కరీంనగర్​కు చెందిన సాఫ్ట్​వేర్ ఉద్యోగి సిరిపురం చైతన్య.

Software Employee Mango Organic Farming
Software Employee Mango Organic Farming (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 21, 2024, 8:45 PM IST

Yuva : 'ఒకవైపు సాఫ్ట్​వేర్ ఉద్యోగం - మరొకవైపు మామిడి పండ్ల సాగు' ఇది యువకుడు సక్సెస్ స్టోరీ (ETV Bharat)

Software Employee Mango Organic Farming : ఒకప్పుడు సాఫ్ట్​వేర్ ఉద్యోగానికే ప్రాధాన్యత ఇచ్చే యువతీ యువకులు ప్రస్తుతం వ్యవసాయం వైపు దృష్టి సారిస్తున్నారు. పని ఒత్తిడి నుంచి సేద తీర్చుకోవడానికి వ్యవసాయ క్షేత్రం సరైన ప్రాంతమని అనుభవ పూర్వకంగా తెలుసుకుని ఇతరులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు సాఫ్ట్​వేర్ ఉద్యోగం ఇంకొకవైపు తనకు ఇష్టమైన వ్యవసాయ సేంద్రీయ పద్ధతిలో మామిడి తోట సాగు చేస్తూ ఇతరులకు ఆదర్శంగా కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన సిరిపురం చైతన్య నిలుస్తున్నాడు. అతను నాలుగేళ్లు పడిన కష్టానికి ఈ ఏడాది ఫలితం వచ్చింది.

తన తాతయ్య సిరిపురం వెంకట నరసయ్యను స్ఫూర్తిగా తీసుకొని సాగు బాట పట్టినట్లు చైతన్య తెలిపారు. అమ్మానాన్న చనిపోయాక తాను తాతయ్య వద్దనే పెరిగినట్లు చెప్పాడు. మేమిద్దరం అన్నదమ్ములం, ఒక చెల్లి ఉన్నప్పటికీ ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో సెటిల్ అయ్యామన్నారు. వయసు పెరుగుతున్న కొలదీ తాతయ్య వద్ద ఉండాలన్న కోరిక తనలో బలంగా పెరిగిందని అన్నారు. అప్పుడప్పుడు వారాంతపు సెలవుల్లో వచ్చి ఈ వ్యవసాయ క్షేత్రాన్ని చూసేవాడిని అలా కరోనా లాక్​డౌన్ సమయంలో ఇంటికి వచ్చినప్పుడు తాతయ్య వద్ద ఈ మామిడి పంట గురించి తెలుసుకున్నానని చెప్పారు.

గతంలో బంగినపల్లి, దసేరి సాగు చేసేవాళ్లమని అయితే చీడపీడలు పట్టడంతో అనేక నష్టాలు చవిచూడాల్సి వచ్చిందని యువరైతు సిరిపురం చైతన్య తెలిపారు. ఈ క్రమంలో చీడపీడలు బారిన పడకుండా నూతన రకాల కోసం పలు ప్రాంతాల్లో అన్వేషణ మొదలుపెట్టానన్నారు. అందులో భాగంగా ఖమ్మం జిల్లా అశ్వరావుపేట నుంచి కేసరి అనే నూతన రకాన్ని తీసుకొచ్చి 2019లో 15 ఎకరాల్లో సేంద్రియ పద్ధతుల్లో మొక్కలు పెంపకం మొదలుపెట్టామన్నారు. ప్రతి మొక్కకు డ్రిప్ ద్వారా నీటిని సరఫరా చేసే విధానాన్ని వినియోగిస్తూ తక్కువ శ్రమతో ఎక్కువ దిగుబడి పొందే విధంగా యత్నిస్తున్నట్లు చైతన్య తెలిపారు.

"మామిడి మొక్కలు నాటిన నుంచి చెట్లుగా మారేవరకు ఈ ఏడాది రూ.10 లక్షలు వరకు వెచ్చించాను. సుమారు మూడు టన్నుల పండ్లు దిగుబడి వచ్చింది. కిలోకు సుమారు రూ.200 చొప్పున రూ.6 లక్షల వరకు ఆదాయం వచ్చింది. మా పంట విధానాన్ని సామాజిక మధ్యమాల్లో పోస్ట్ చేస్తుండటంతో ఆసక్తి ఉన్న విద్యార్థి, విద్యార్థులు తోటను చూసేందుకు వస్తున్నారు. అలాగే సామాజిక మాధ్యమం ద్వారా మామిడి పండ్లను విక్రయిస్తున్నాం. వీటి గురించి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో స్టాళ్లు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నాం. సామాజిక మాధ్యమాల ద్వారా కావాలనుకునేవారికి ఆర్టీసీ కార్గో సేవలు ద్వారా పంపిస్తున్నాం." - సిరిపురం చైతన్య, యువ రైతు

సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేయడం అందరికీ ఆసక్తి : తన మనవడు చైతన్య వృద్ధాప్యంలో ఉన్న తనకు తగిన సహకారం లభిస్తుందా లేదా అనే ఉద్దేశంతో ఇక్కడి వచ్చి వ్యవసాయం చేయడం సంతోషంగా ఉందని సాఫ్ట్​వేర్ ఉద్యోగి తాతయ్య వెంకట నరసయ్య సంతోషం వ్యక్తం చేశారు. తనకు చేదోడు వాదోడుగా ఉండడమే కాకుండా మంచి దిగుబడిని సాధించినట్లు తెలిపారు. సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేయడం వల్ల మామిడి పండ్లను కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారన్నారు. సాఫ్ట్​వేర్ ఉద్యోగులు వీకెండ్ వ్యవసాయం కాకుండా పూర్తిస్థాయి వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తే ఆరోగ్యంతో పాటు అదనపు ఆదాయం సమకూరుతుందని చైతన్య సూచించారు.

YUVA : కష్టాలకు ఎదురీత జివాంజీ దీప్తి - పారా అథ్లెటిక్స్​లో సత్తా చాటిన వరంగల్​ బిడ్డ - Special Story On Deepthi Jeevanji

YUVA : కుటుంబ ఆలనా పాలనా చూస్తూనే 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకుడు - Student five Jobs got in Telangana

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.