24Hour Project International Photo Exhibition In Hyderabad 2024 : కోల్‌కతా అభివృద్ధిలో వెనకబడిన మహిళలకు సాధికారత కల్పించడం కోసం 24 హవర్ ప్రాజెక్టు సంస్థ హైదరాబాద్‌లో మొదటిసారిగా ఫొటోగ్రఫీ ఫర్ సోషల్ చేంజ్ పేరుతో ఫోటో ఎగ్జిబిషన్‌ను నిర్వహించింది. హైదరాబాద్ ఆర్ట్ గ్యాలరీలో ప్రారంభించిన ఈ ఎగ్జిబిషన్ లో 24హవర్ ప్రాజెక్టు సంస్థ పెట్టిన పోటీల్లో ప్రపంచ వ్యాప్తంగా తీసిన 127 బెస్ట్ పిక్చర్స్ కొలువుదీరాయి. ఫొటోగ్రఫీ అంటే కేవలం అందమైన పిక్చర్స్ తీసి పోస్ట్ చేయటమే కాదు దీని ద్వారా వివిధ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు, సంస్కృతి, ఆచారాలు, సామాజిక పరిస్థితులు కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయని సంస్థ నిర్వాహకులు అన్నారు.
ఈ ఎగ్జిబిషన్ ద్వారా వచ్చిన డబ్బులను కలకత్తాలోని రెస్పాన్సిబుల్ చారిటీకీ ఇస్తామని వారు తెలిపారు. ఈ వారం రోజుల పాటు ఇక్కడ ఫోటో వర్క్‌షాప్‌లను నిర్వహిస్తామని నిర్వాహకులు చెప్పారు. దేశ నలుమూల నుంచి ఔత్సాహికులైన, అనుభవజ్ఞులైన వందలాది ఫొటో గ్రాఫర్లు ఇందులో పాల్గొంటారని వారు వివరించారు. ఇంటర్నేషనల్ ఫోటో ఎగ్జిబిషన్ 2024 కోసం ఈటీవీ తెలంగాణ న్యూస్ ఛానల్, ఈటీవీ భారత్ మొబైల్ యాప్ ఈ వర్క్‌షాప్‌కు మీడియా పార్ట్నర్గా వ్యవహరిస్తున్నాయి.
"హైదరాబాద్‌లో ఫోటో ఎగ్జిబిషన్ పెట్టడం చాలా సంతోషంగా ఉంది. మొదటిసారి మేము భారత్‌లో ఎగ్జిబిషన్ నిర్వహించాం. ఈ ఎక్స్ పో ద్వారా వచ్చిన ఫండ్స్‌ను మహిళా సాధికారత కోసం కోల్‌కతాలోని రెస్పాన్సిబుల్ ఛారిటీకి ఇస్తాం. ఈ ఎగ్జిబిషన్లో ప్రపంచవ్యాప్తంగా తీసిన 127 బెస్ట్ పిక్చర్స్ పెట్టాం. ఈ ఫొటోగ్రఫీలో వివిధ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు , సంస్కృతి, ఆచారాలు, సామాజిక పరిస్థితులు కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి." రెంజు గ్రాందే, 24హవర్ ప్రాజెక్టు సంస్థ ఫౌండర్
24 Hour Project In Hyderabad : ఇది భారతదేశంలో తొలిసారిగా ప్రారంభించిన స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ కార్యక్రమం. అంతర్జాతీయ న్యాయమూర్తులతో రూపొందించిన 127 ఫ్రేమ్డ్ ఫోటోలు, కోల్‌కతాలోని రెస్పాన్సిబుల్ ఛారిటీ ద్వారా నిర్వహించబడుతున్న స్వీయ-స్థిరమైన మహిళల కార్యక్రమాలకు మద్దతునిచ్చే అద్భుతమైన ఈవెంట్‌గా ఇది ప్రదర్శితమవుతుంది. దేశవిదేశాల నుంచి ఫొటోగ్రఫీ నిపుణులు ఈ ఈవెంట్‌కు వచ్చి తమ అనుభూతులను పంచుకుంటున్నారు.
World Photography Day 2023 : మాదాపూర్‌లో ఫొటో ఎగ్జిబిషన్.. ఆ అద్భుతాలపై మీరూ ఓ లుక్కేయండి..