Rishabh Pant Injury Update : టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ రిషభ్ పంత్ న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టులో రెండో రోజు గాయపడ్డాడు. గతంలో సర్జరీ అయిన కాలుకే బంతి తలగడం వల్ల ఆట మధ్యలోనే మైదానం వీడాడు. అతడి స్థానాన్ని ధ్రువ్ జురెల్ భర్తీ చేశాడు. ఆ తర్వాత పంత్ గాయంపై ఎలాంటి అప్డేట్ రాలేదు. పంత్ బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిసింది. దీంతో అతడు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు రావడం కష్టమేనని ప్రచారం సాగింది.
అయితే అందరి సందేహాలకు పంత్ తాజాగా ఫుల్స్టాప్ పెట్టాడు. మూడో రోజు సెకండ్ సెషన్ మధ్యలో మైదానంలోకి దిగాడు. కాసేపు బ్యాట్ పట్టుకొని ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పంత్ ఫుల్ ఫిట్‌గా ఉన్నట్లు ఫొటోల్లో కనిపిస్తుంది. దీంతో సెకండ్ ఇన్నింగ్స్‌లో పంత్ బరిలోకి దిగడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి మేనేజ్మెంట్ దీనిపై స్పందిచాల్సి ఉంది.
PANT IS BACK...!!!! 🇮🇳
— Johns. (@CricCrazyJohns) October 18, 2024
- He is doing batting practice during Tea Break. [RevSportz] pic.twitter.com/eO9d6hcTmG
Biggest cheer of the day for Rishabh Pant, who has come out to warm up. Looks fit.. #INDvNZ pic.twitter.com/uilewpAKEY
— Aakash Sivasubramaniam (@aakashs26) October 18, 2024
కాగా, తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 402 పరుగుల భారీ స్కోర్ సాధించింది. రచిన్ రవీంద్ర (134 పరుగులు) సెంచరీతో ఆకట్టుకోగా, డేవన్ కాన్వే (91 పరుగులు), టిమ్ సౌథీ (65 పరుగులు) రాణించారు. రవీంద్ర జడేజా 3, కుల్దీప్ యాదవ్ 3, మహ్మద్ సిరాజ్ 2, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ చెరో 1 వికెట్ దక్కించుకున్నారు.
అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. కేవలం 46 పరుగులకే ఆలౌటైంది. రిషబ్ పంత్ (20 పరుగులు) టాప్ స్కోరర్. జైస్వాల్ (13 పరుగులు), రోహిత్ శర్మ (2 పరుగులు) విఫలం కాగా, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఏకంగా ఐదుగురు బ్యాటర్లు పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. మ్యాచ్ హెన్రీ 5 వికెట్లతో సత్తా చాటాగా, విమియమ్స్ రూ రుర్కీ 4, సౌథీ 1 వికెట్ దక్కించుకున్నారు.