ETV Bharat / sports

2024 WPL ఎమర్జింగ్ ప్లేయర్- ఆర్సీబీ క్వీన్ శ్రేయాంకకు ఫాలోయింగ్ పీక్స్​! - Shreyanka Patil RCB 2024

WPL 2024 Shreyanka Patil: డబ్యూపీఎల్ 2024 ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యువ లెగ్ స్పిన్నర్ శ్రేయాంకా పాటిల్ లేడీ సింహంలా గర్జించింది. ఫైనల్​లో నాలుగు వికెట్ల పడగొట్టి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ క్రమంలోనే అసలు ఎవరీ శ్రేయాంకా పాటిల్ అంటూ నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.

WPL 2024 Shreyanka Patil
WPL 2024 Shreyanka Patil
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 18, 2024, 5:19 PM IST

WPL 2024 Shreyanka Patil: సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. గత 16ఏళ్లుగా ట్రోఫీ కోసం యుద్ధం చేస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఎట్టకేలకు విజేతగా నిలిచింది. ఆర్సీబీ పురుషులకు సాధ్యం కాని టైటిల్ ను మహిళలు అందుకుని చూపించారు. డబ్యూపీఎల్ 2024 ఫైనల్లో దిల్లీ క్యాపిటల్స్​ను చిత్తుగా ఓడించి ఆర్సీబీ టైటిల్ ముద్దాడింది. అయితే ఈ విజయంలో ఆర్సీబీ యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్​దే కీలక పాత్ర అని చెప్పవచ్చు.

ఫైనల్​లో నాలుగు వికెట్లు తీసి దిల్లీని దెబ్బకొట్టింది. పాటిల్ 3.3 ఓవర్లలో 12 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసింది. డబ్ల్యూపీఎల్ చరిత్రలో ఒక సీజన్‌లో రెండుసార్లు నాలుగు వికెట్ల ప్రదర్శన చేసిన తొలి మహిళా క్రికెటర్​గా శ్రేయాంక పాటిల్ రికార్డ్ కొట్టింది. ఇంతకుముందు ముందు మార్చి 10న దిల్లీ క్యాపిటల్స్‌తోనే జరిగిన మ్యాచ్‌లో శ్రేయాంక పాటిల్ 4 ఓవర్లలో 26 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టింది. మరి తన అద్భుత ప్రదర్శనతో ఆర్సీబీ తొలి టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన శ్రేయంకా ఎవరంటే? 2024 డబ్ల్యూపీఎల్​లో 21 ఏళ్ల శ్రేయాంకా పాటిల్‌కు ఎప్పటికీ గుర్తుండిపోతుందనే చెప్పవచ్చు

శ్రేయాంక బెంగుళూరులో జన్మించింది. దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తుంది. దేశవాళీ క్రికెట్లో మెరుగ్గా రాణించడం వల్ల ఆమెకు టీమ్​ఇండియాలోకి ఎంట్రీ లభించింది. గతేడాది ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగినే వన్డేతో ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టింది శ్రేయాంకా పాటిల్. ఇప్పటి వరకు భారత్ తరపున 2 వన్డేలు, 6 టీ20లు ఆడింది. వరుసగా 4,8 వికెట్లు పడగొట్టి సంచలనం నమోదు చేసింది. డబ్య్లూపీఎల్ 2023 వేలంలో ఆర్సీబీ శ్రేయాంకను రూ.10 లక్షలకు కొనుగోలు చేసింది.

ఇక ఈ సీజన్‌లో మొత్తం 8 మ్యాచ్‌లు ఆడిన పాటిల్ 13 వికెట్లు పడగొట్టింది. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా శ్రేయాంక పాటిల్‌ నిలిచింది. దీంతో పర్పుల్ క్యాప్​ను సొంతం చేసుకుంది. ఇది మాత్రమే కాదు, పాటిల్‌కు డబ్య్లూపీఎల్ ఎమర్జింగ్ ప్లేయర్ 2024 అవార్డు కూడా లభించింది. ఇక శ్రేయాంక మహిళ కరీబియన్ ప్రీమియర్ లీగ్ లోనూ పాల్గొంది. ఈ లీగ్​లో గయానా అమెజాన్ వారియర్స్​కు ప్రాతినిథ్యం వహిస్తుంది.

WPL 2024 బెంగళూరు భళా - ఇక మిగిలింది IPL ట్రోఫీ మాత్రమే!

WPL 2024 శెభాష్ స్మృతి - వీడియో కాల్​లో కోహ్లీ అభినందనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.