WPL 2024 Eliminator Match Winner : డబ్ల్యూపీఎల్ సీజన్-2లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్‌ను ఆర్సీబీ 5 పరుగుల తేడాతో ఓడించింది. 136 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 130 పరుగులకే పరిమితమైంది. హర్మన్ ప్రీత్ కౌర్ (33) కీలక సమయంలో ఔట్‌కావడంతో ముంబయికి ఓటమి తప్పలేదు. అమేలీ కెర్(27*), యాస్తికా భాటియా (19), హేలీ మ్యాథ్యూస్ (15), నాట్‌సీవర్ (23) హర్మన్‌ప్రీత్ కౌర్(30) పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో శ్రేయాంక పాటిల్ రెండు వికెట్లు తీయగా, ఎలీస్ పెర్రీ, జార్జియా వేర్‌హామ్, సోఫీ మోలినెక్స్, ఆశా శోభనా తలో వికెట్ తీశారు.
కాగా, ఛేదనలో ముంబయి ఇన్నింగ్స్ సాఫీగా ముందుకు వెళ్లలేదు. హేలీ (15) ఆరంభంలోనే వెనుదిరిగింది. యాస్తిక, సీవర్ కాసేపు మాత్రమే నిలిచారు. దీంతో ముంబయి 10.4 ఓవర్లలో 68/3తో ఇబ్బందుల్లోకి వెళ్లిపోయింది. అప్పుడు హర్మన్‌ప్రీత్, అమేలియాతో కలిసి స్కోరు బోర్డును పెంచింది. అలా ముంబయి నిలకడగా ఆడుతూ విజయం దిశగా ముందుకు సాగింది. కానీ ఈ సమయంలోనే హర్మన్‌ను ఆర్సీబీ ఔట్ చేయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఆశ వేసిన ఆఖరి ఓవర్లో 12 పరుగులు అవసరమయ్యాయి. మొదటి 3 బంతులకు 4 పరుగులే ఇచ్చిన ఆశ నాలుగో బంతికి పూజ(4)ను ఔట్ చేసింది. ఆ తర్వాతి రెండు బంతులకు రెండే పరుగులు ఇచ్చి రాయల్ ఛాలెంజర్స్‌ను గెలిపించింది.
అంతకుముందు టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ముంబయి బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. క్లిష్ట సమయంలో ఎలీస్ పెర్రీ (66: 50 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్) గొప్పగా రాణించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించింది. ఓపెనర్లు స్మృతి మంధాన (10), సోఫీ డివైన్ (10)తో పాటు దిశా కసత్ (0), రిచా ఘోష్ (14), సోఫీ మోలినెక్స్ (11) విఫలమయ్యారు. ముంబయి బౌలర్లలో హేలీ మ్యాథ్యూస్, నాట్ సీవర్, సైకా ఇషాక్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
IPL 2024 - టాప్ ప్లేస్‌లో కోహ్లీ - మెగా లీగ్ అత్యధిక శతక వీరులు వీరే!
IPL 2024 గెట్ రెడీ ఆరెంజ్ ఆర్మీ - హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఎప్పుడంటే?