Ranji trophy History : క్రికెట్‌ను ఒక మతంగా భావించే భారత్‌లో రంజీ ట్రోఫీకి దాదాపు శతాబ్దం చరిత్ర ఉంది. ఏ క్రికెటర్ అయినా తన ఆటను ఫస్ట్ క్లాస్ క్రికెట్‌తోనే మొదలు పెడతారు. ఐపీఎల్ రాకముందు రంజీ ట్రోఫీలాంటి దేశవాలీ టోర్నీల్లో ప్రతిభ ఆధారంగానే టీమ్ఇండియా ఆటగాళ్లను ఎంపిక చేసేవారు. మరి అంతటి చరిత్ర కలిగిన రంజీ ట్రోఫీ పుట్టుక ఎలా జరిగిందనేది కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.
ప్రస్తుత తరంవారికి క్రికెట్ అంటే సునీల్ గావస్కర్, సచిన్ తెందూల్కర్, కపిల్ దేవ్, విరాట్ కోహ్లీ వంటి ప్లేయర్లు గుర్తుకొస్తారు. అంతలా ఈ క్రీడాకారులు యువతరానికి స్ఫూర్తినిచ్చారు. వీరెవరూ భారత క్రికెట్‌కు పితామహులు కాదు. ఇంతకీ భారత క్రికెట్ పితామహుడు ఎవరు? రంజీ ట్రోఫీకి ఆ పేరు ఎలా వచ్చింది? తదితర విషయాలు చూద్దాం.
భారత క్రికెట్ పితామహుడు - క్రికెట్ ఇంగ్లాండ్‌లో పుట్టింది. అయితే శ్వేత జాతీయుల ఆటగా మొదట పేరొందిన క్రికెట్‌ను భారత్‌కు పరిచయం చేసింది రంజిత్ సింగ్ కుమార్. అందుకే అతడి పేరు మీదుగా రంజీ ట్రోఫీని పెట్టారు. ఇప్పటికీ ఈ ట్రోఫీ కొనసాగుతోంది. రంజిత్ కుమార్ తన ఆటతో బ్రిటిషర్లను సైతం ఆకట్టుకున్నాడు. అందుకే అతడిని భారత క్రికెట్‌కు పితామహుడిగా అభివర్ణిస్తారు. భారత క్రికెట్ ఆరంభాన్ని పరిశీలిస్తే అప్పట్లో మహారాజులు, యువరాజులు, నవాబుల ఈ ఆటను ఆడేవారు. ఆ తర్వాతి కాలంలో సామాన్యులు సైతం క్రికెట్ ఆడడం మొదలుపెట్టారు.
రంజిత్ సింగ్ ఎవరు? - రంజిత్ సింగ్ 1872 సెప్టెంబర్ 10న ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. అతడి కుటుంబనికి నవనగర్ రాజు బీభా సింగ్‌తో సంబంధాలు ఉన్నాయి. బీభా సింగ్ వారసుడిగా రంజీత్ సింగ్ 1978లో ఎంపికయ్యాడు. ఆ తర్వాత రాజుగా బాధ్యతలు చేపట్టాడు. ఆ తర్వాత 16 ఏళ్ల వయసులో చదువు కోసం రంజీత్ సింగ్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి వెళ్లాడు. అక్కడ క్రికెట్ పట్ల ఉన్న ఆసక్తితో ససెక్స్, లండన్ కౌంటీలకు ఆడాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ సిరీస్‌లో ఓ టెస్టు మ్యాచ్ ఆడాడు.
అంత ఈజీగా చోటు దక్కలేదు! - అయితే రంజీత్ సింగ్‌కు అంత ఈజీగా ఇంగ్లాండ్ జట్టులో చోటు దక్కలేదు. స్వాతంత్య్రానికి ముందు భారతీయులను బ్రిటీషర్లు నల్లజాతీయులుగా భావించేవారు. అందుకే బ్రిటీష్ జట్టులో స్థానం కోసం రంజీత్ సింగ్ చాలా కష్టపడ్డాడు. ఎట్టకేలకు తన ప్రతిభతో ఇంగ్లాండ్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. చివరికి ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో తన రెండో టెస్టు ఆడాడు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రంజిత్ సింగ్ తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ బాదాడు. ఆ తర్వాత రంజిత్ సింగ్ పేరు మార్మోగిపోయింది. తనదైన స్టైల్లో లైగ్ సైడ్ షాట్లను కొడుతూ రంజిత్ మంచి పేరు సంపాదించుకున్నాడు.
महाराजा रणजीत सिंह अंतर्राष्ट्रीय क्रिकेट खेलने वाले पहले भारतीय क्रिकेटर थे. उन्होंने 15 टेस्ट मैचों में इंग्लैंड का प्रतिनिधित्व किया था 44.95 के औसत से 989 रन बनाए. उन्हीं के नाम पर रणजी ट्रॉफी खेली जाती है🏏
— AKASHVANI RAIPUR (@akashvaniraipur) September 10, 2024
जयंती पर सादर नमन 🙏 pic.twitter.com/60j1C2wrPq
భారత్ తరఫున ఎందుకు ఆడలేదంటే? - ఇంగ్లాండ్ తరఫున ఆడిన రంజిత్ సింగ్ 15 టెస్టుల్లో 989 పరుగులు చేశాడు. అలాగే ఫస్ట్ క్లాస్ కెరీర్లోనూ అదరగొట్టాడు. 307 మ్యాచుల్లో 24,692 పరుగులు చేశాడు. అందులో 72 సెంచరీలు, 109 అర్ధ శతకాలు ఉన్నాయి. అయితే భారత్ లో రంజిత్ సింగ్ ప్రొఫెషనల్ క్రికెట్ ఆడలేదు. ఎందుకంటే అప్పటికే భారత్‌కు టెస్టు జట్టు లేదు. 1932లో భారత్ టెస్టు మ్యాచులు ఆడింది.
కాగా, 1933లో రంజిత్ సింగ్ ప్రాణాలు విడిచాడు. ఆ తర్వాత ఏడాది అంటే 1934లో బీసీసీఐ 'ఇండియన్ క్రికెట్ ఛాంపియన్ షిప్' అనే టోర్నమెంట్‌ను ప్రారంభించింది. 1935లో ఆ ట్రోఫీకి రంజిత్ సింగ్ పేరు మీదుగా రంజీ ట్రోఫీని అని పేరు పెట్టింది.
ఒకేసారి ఇద్దరు హీరోయిన్లతో శుభమన్ గిల్ డేటింగ్! - ఫొటోస్ వైరల్ - Shubman Gill Dating with Heroines