Alzarri Joseph Banned : వెస్టిండీస్ పేస్ బౌలర్ అల్జారీ జోసెఫ్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డు రెండు మ్యాచ్‌ల నిషేధం విధించింది. కెప్టెన్ షాయ్ హోప్‌తో గొడవ పడి మైదానాన్ని వీడిన అతడిపై వేటు వేస్తున్నట్లు విండీస్ బోర్డు తెలిపింది. మైదానంలో క్రమశిక్షణ లేకుండా, జట్టు ప్రతిష్ఠ దెబ్బతినేలా ప్రవర్తిస్తే ఎవరినైనా సహించేది లేదని బోర్డు పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడదల చేసింది.
ఇదీ జరిగింది
బార్బడోస్ వేదికగా విండీస్- ఇంగ్లాండ్ మధ్య గురువారం మూడో వన్డే జరిగింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో ఫీల్డింగ్ సెట్టింగ్ విషయమై హోప్- జోసెఫ్ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అయినప్పటికీ ఆ ఓవర్ బౌలింగ్ కొనసాగించిన జోసెఫ్ నాలుగో బంతికి వికెట్ తీశాడు. దీంతో సంబరాలు చేసుకునేందుకు సహచర ప్లేయర్లు అతడి దగ్గరకు రాగా, జోసెఫ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక ఆ ఓవర్ పూర్తి ఆవ్వగానే, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మ్యాచ్ మధ్యలోనే మైదానం వీడి డగౌట్‌కు వెళ్లిపోయాడు.
దీంతో ఒక ఓవర్‌పాటు విండీస్ జట్టు 10 మందితోనే ఫీల్డింగ్ చేయాల్సి వచ్చింది. అయితే జోసెఫ్ ప్రవర్తన తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే బోర్డు అతడిపై చర్యలకు ఉపక్రమించింది. కాగా, తాజాగా వేటు పడడం వల్ల ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో జోసెఫ్ తొలి రెండు మ్యాచ్‌లు ఆడడం కుదరదు.
Cricket West Indies (CWI) Announces Suspension of Alzarri Joseph for Two Matches
— Windies Cricket (@windiescricket) November 7, 2024
Read More 🔽 https://t.co/9GWNkD2nnA
సారీ చెప్పినా నో
అయితే ఈ వివాదం పట్ల జోసెఫ్ సారీ చెప్పాడు. 'కెప్టెన్ హోప్‌కు వ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతున్నా. అలాగే నా టీమ్మేట్స్, మేనేజ్మెంట్, వెస్టిండీస్ ఫాన్స్‌కు కూడా సారీ' అని జోసెఫ్ పేర్కొన్నాడు. కాగా, ఈ వివాదం తర్వాత మళ్లీ మైదానంలోకి వచ్చిన జోసెఫ్, మ్యాచ్ మొత్తంలో 2 వికెట్లు దక్కించుకున్నాడు. కాగా, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను విండీస్ 2-1 తేడాతో ఓడించింది. ఇక ఈ పర్యటనలో విండీస్‌లో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ ఇంగ్లాండ్ తలపడనుంది. శనివారం (నవంబర్ 9) ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
కెప్టెన్‌తో గొడవ- మ్యాచ్ మధ్యలో గ్రౌండ్ వీడిన బౌలర్- 10మందితోనే ఫీల్డింగ్
వెస్టిండీస్‌పై శ్రీ లంక హిస్టారిక్ విన్ - 2-1 ఆధిక్యంతో టీ20 సిరీస్ కైవసం!