Ind vs NZ Test 2024 : న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను టీమ్ఇండియా ఓటమితో ప్రారంభించింది. దీంతో మిగిలిన రెండు టెస్టులపై దృష్టి పెట్టింది. ఎలాగైన తర్వాత రెండింట్లో నెగ్గి సిరీస్ పట్టేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో యంగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు జట్టులో చోటు కల్పించింది. న్యూజిలాండ్‌తో జరగనున్న రెండు, మూడో టెస్టులకు గాను వాషింగ్టన్ సుందర్ టీమ్ఇండియాతో కలవనున్నాడు.
ప్రస్తుత రంజీ ట్రోఫీలోనూ సుందర్ అదరగొట్టాడు. తమిళనాడు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సుందర్ దిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో సుందర్ (152 పరుగులు; 269 బంతుల్లో 19 ఫోర్లు, 1 సిక్స్) భారీ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌తో ఒక్కసారిగా సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. అయితే శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్ ఫిట్‌నెస్‌పై ఆందోళన ఉండటం వల్ల టాపార్డర్‌ను కవర్ చేయడానికి ముందు జాగ్రత్తగా సుందర్‌ను కివీస్‌తో మిగిలిన రెండు టెస్టులకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
Washington Sunder Test Career : కాగా, వాషింగ్టన్ సుందర్ 2021లో టెస్టు అరంగేట్రం చేశాడు. 2021 జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రతిష్ఠాత్మక గబ్బా టెస్టు విజయంలో సుందర్ జట్టులో సభ్యుడు. సుందర్ కెరీర్లో ఇదే తొలి టెస్టు మ్యాచ్. ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 4 వికెట్లు పడగొట్టాడు. ఇక మొత్తం కెరీర్లో 4 మ్యాచ్‌ల్లో సుందర్ 6 వికెట్లు, 265 పరుగులు నమోదు చేశాడు. ఇక అదే ఏడాది మార్చిలో ఇంగ్లాండ్‌తో ఆడిన మ్యాచ్ సుందర్‌కు చివరి టెస్టు.
🚨 News 🚨
— BCCI (@BCCI) October 20, 2024
Squad Update: Washington Sundar added to squad for the second and third Test#INDvNZ | @IDFCFIRSTBank
Details 🔽
న్యూజిలాండ్‌తో రెండు, మూడు టెస్టులకు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ . సిరాజ్, ఆకాష్ దీప్, వాషింగ్టన్ సుందర్
మిగిలిన షెడ్యూల్
- రెండో టెస్టు : అక్టోబర్ 24 - అక్టోబర్ 28 : పుణె
- మూడో టెస్టు : నవంబర్ 01- నవంబర్ 05 : ముంబయి
కివీస్‌తో ఓటమి WTCపై ఎఫెక్ట్- ఫైనల్ చేరాలంటే ఎన్ని నెగ్గాలంటే?
టీమ్ఇండియాకు తప్పని ఘోర పరాజయం - 36 ఏళ్ల తర్వాత భారత్‌లో కివీస్ విక్టరీ!