Virat Kohli Break Dravid Record : గబ్బా వేదికగా జరగుతున్న మూడో టెస్టులో (గబ్బా) ఆస్ట్రేలియా బౌలర్ల దెబ్బకు టీమ్ ఇండియా బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు చేరుతున్నారు. 22 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. యశస్వి జైస్వాల్ (4; 2 బంతుల్లో, 1 ఫోర్), శుభ్‌మన్ గిల్ (1; 3 బంతుల్లో)ను మిచెల్ స్టార్క్ పెవిలియన్‌కు పంపాడు. విరాట్ కోహ్లీని (3; 16 బంతుల్లో)ని హేజిల్‌వుడ్ బోల్తా కొట్టించాడు. అయితే విరాట్ ఔట్ అవ్వడంపై క్రికెట్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కోహ్లీ అవుట్ సైడ్ ఆఫ్ బంతిని వెంటాడి మరీ వికెట్ కీపర్ చేతికి చిక్కాడు. ఈ తరహాలో విరాట్ ఔటవ్వడం సాధారణంగా మారిపోయింది. ఈ సిరీస్‌లోనే డ్రైవ్‌కు ప్రయత్నించి వికెట్ కీపర్-స్లిప్‌లలో మూడోసారి ఔట్ అయ్యాడు.
ద్రవిడ్ రికార్డ్ బ్రేక్ - అయినప్పటికీ కోహ్లీ ఈ మ్యాచ్‌లో ఓ రికార్డును అందుకున్నాడు. ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఓ పెద్ద రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. మాజీ క్రికెటర్, కోచ్ రాహుల్ ద్రవిడ్ రికార్డును బ్రేక్ చేశాడు. టెస్టుల్లో ఆస్ట్రేలియాపై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు.
రాహుల్ ద్రవిడ్ ఆస్ట్రేలియాపై 62 ఇన్నింగ్స్‌లో 2166 పరుగులు చేశాడు. ఇప్పుడు విరాట్ 48 టెస్ట్ ఇన్నింగ్స్‌లో 2168 రన్స్ సాధించాడు. అలా ద్రవిడ్ రికార్డును అధిగమించి, ఆసీస్‌పై అత్యధిక పరుగులు చేసిన మూడో భారత బ్యాటర్‌గా నిలిచాడు. సచిన్ తెందుల్కర్(3630), వీవీఎస్ లక్ష్మణ్ (2434) పరుగులు చేసి తొలి రెండు స్థానాల్లో నిలిచారు.
కాగా, ప్రస్తుత సిరీస్‌లోని తొలి మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ శతకం బాదిన సంగతి తెలిసిందే. కెరీర్లో మొత్తంగా 5329 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు ఉన్నాయి. మొత్తంగా 100 టెస్ట్ మ్యాచులు ఆడాడు.
ముగిసిన మూడో రోజు ఆట - గబ్బా టెస్టులో ఆసీస్ బౌలర్లతో పాటు భారత బ్యాటర్లను వరుణుడు అడ్డుకున్నాడు. వర్షం కారణంగా 33 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. డే 3 స్టంప్స్ ప్రకటించే సమయానికి టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 17 ఓవర్లను ఎదుర్కొని 51/4 స్కోరుతో నిలిచింది. క్రీజ్‌లో కేఎల్ రాహుల్ (33*), కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఇంకా 394 పరుగులు వెనకబడి ఉంది. అయితే వర్షం అంతరాయం కలిగించడం వల్లనే టీమ్ ఇండియా మరిన్ని వికెట్లను చేజార్చుకోలేదని క్రికెట్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
బుమ్రాపై అభ్యంతరకర వ్యాఖ్యలు - సారీ చెప్పిన మహిళా కామెంటేటర్
గబ్బా మ్యాచ్ వెరీ స్పెషల్! - ఆ ఒక్క సెంచరీతో సచిన్ సాధించలేని రికార్డు విరాట్ సొంతం!